కీర్తనలు 60
60
కీర్తన 60
సంగీత దర్శకునికి. “నిబంధన పుష్పం” అనే రాగం మీద పాడదగినది. దావీదు శ్రేష్ఠమైన కీర్తన. దావీదు అరాము నహరయీము వారితోను#60 అది వాయువ్య మెసొపొటేమియాకు ఉత్తరపశ్చిమాన ఉన్న అరాములో ఒక భాగము. ఇది రెండు నదుల మధ్య ఉన్నది. అరాము సోబా వారితోను#60 అది మధ్య సిరియా యుద్ధము చేయగా యోవాబు ఉప్పు లోయలో పన్నెండువేలమంది ఎదోమీయులను చంపి తిరిగి వచ్చినప్పుడు వ్రాసినది.
1దేవా, మీరు మమ్మల్ని తిరస్కరించారు, మాపై విరుచుకుపడ్డారు;
మీరు కోపంగా ఉన్నారు మమ్మల్ని మళ్ళీ బాగుచేయండి!
2మీరు దేశాన్ని కంపింపజేసి దానిని చీల్చివేశారు;
దాని పగుళ్లను పూడ్చండి, ఎందుకంటే అది కంపిస్తూ ఉంది.
3మీరు మీ ప్రజలకు కఠిన సమయాలను చూపించారు;
మమ్మల్ని తడబడేలా చేసే మద్యాన్ని మీరు మాకు ఇచ్చారు.
4సత్యం నిమిత్తం ఎత్తి పట్టుకోవడానికి
మీకు భయపడేవారికి మీరొక జెండాను ఇచ్చారు. సెలా
5మీరు ప్రేమించేవారు విడిపించబడేలా,
మీ కుడిచేతితో మమ్మల్ని రక్షించి మాకు సాయం చేయండి.
6దేవుడు తన పరిశుద్ధాలయం నుండి మాట్లాడిన మాట:
“విజయంతో నేను షెకెమును పంచుతాను
సుక్కోతు లోయను కొలుస్తాను.
7గిలాదు నాది, మనష్షే నాది;
ఎఫ్రాయిం నా శిరస్త్రాణం,
యూదా నా రాజదండం.
8మోయాబు నా కాళ్లు కడుక్కునే పళ్లెం,
ఎదోము మీద నా చెప్పు విసిరివేస్తాను,
ఫిలిష్తియా గురించి విజయధ్వని చేస్తాను.”
9కోటగోడలు గల పట్టణానికి నన్నెవరు తీసుకెళ్తారు?
ఎదోముకు నన్నెవరు నడిపిస్తారు?
10దేవా, ఇప్పుడు మమ్మల్ని విసర్జించింది మీరు కాదా?
మా సేనలతో వెళ్లక మానింది మీరు కాదా?
11శత్రువుకు వ్యతిరేకంగా మాకు సహాయం చేయండి,
ఎందుకంటే మనుష్యుల సహాయం పనికిరానిది.
12దేవునితో కలిసి మేము విజయం సాధిస్తాం,
ఆయన మా శత్రువులను అణగద్రొక్కుతారు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
కీర్తనలు 60: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.