కీర్తనలు 150
150
కీర్తన 150
1యెహోవాను స్తుతించండి.#150:1 హల్లెలూయా; 6 వచనంలో కూడ
పరిశుద్ధాలయంలో దేవుని స్తుతించండి;
ఆయన గొప్ప ఆకాశంలో దేవున్ని స్తుతించండి.
2ఆయన శక్తిగల కార్యాలను బట్టి ఆయనను స్తుతించండి;
ఆయన మహా ప్రభావాన్ని బట్టి ఆయనను స్తుతించండి.
3బూర ధ్వనితో ఆయనను స్తుతించండి,
సితారా, వీణలతో ఆయనను స్తుతించండి.
4కంజరతో, నాట్యంతో ఆయనను స్తుతించండి,
తంతి వాయిద్యాలతో, పిల్లన గ్రోవితో ఆయనను స్తుతించండి.
5తాళాలు మ్రోగిస్తూ, గణగణ ధ్వని చేసే తాళాలతో,
ఆయనను స్తుతించండి.
6ఊపిరి ఉన్న ప్రతిదీ యెహోవాను స్తుతించాలి.
యెహోవాను స్తుతించండి.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
కీర్తనలు 150: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.