కీర్తనలు 149

149
కీర్తన 149
1యెహోవాను స్తుతించండి.#149:1 హెబ్రీలో హల్లెలూయా; 9 వచనంలో కూడ
యెహోవాకు క్రొత్త పాట పాడండి,
ఆయన యొక్క నమ్మకమైన ప్రజల సమాజంలో స్తుతి పాడండి.
2ఇశ్రాయేలీయులు తమ సృష్టికర్తలో సంతోషించును గాక;
సీయోను ప్రజలు తమ రాజులో ఆనందించుదురు గాక.
3వారు ఆయన నామాన్ని నాట్యం చేస్తూ స్తుతిస్తారు
తంబురతో సితారాతో గానం చేస్తారు.
4యెహోవా తన ప్రజల్లో ఆనందిస్తారు;
దీనులకు విజయాన్ని కిరీటంగా ధరింపజేస్తారు.
5ఆయన యొక్క నమ్మకమైన ప్రజలు ఈ ఘనతలో సంతోషించుదురు గాక.
వారు వారి పడకలో ఆనందంతో పాడుదురు గాక.
6వారి నోళ్ళలో దేవుని స్తుతి
వారి చేతుల్లో రెండంచుల ఖడ్గం ఉండును గాక.
7దేశాలపై ప్రతీకారం తీర్చుకోవడానికి
ప్రజలను శిక్షించడానికి,
8-9వారి రాజులను సంకెళ్ళతో,
ఉక్కు సంకెళ్ళతో వారి సంస్థానాధిపతులను బంధించడానికి,
వారికి వ్యతిరేకంగా వ్రాయబడిన తీర్పు అమలుచేసేలా ఇది ఉంటుంది,
ఆయన యొక్క నమ్మకమైన ప్రజలందరికి ఈ ఘనత ఉంటుంది.
యెహోవాను స్తుతించండి.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

కీర్తనలు 149: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి

మీ అనుభవాన్ని వ్యక్తిగతీకృతం చేయడానికి YouVersion కుకీలను ఉపయోగిస్తుంది. మా వెబ్సైట్ ని ఉపయోగించడం ద్వారా, మీరు మా గోప్యతా విధానంలో వివరించబడిన మా కుకీల వాడకాన్ని అంగీకరిస్తారు.