కీర్తనలు 13

13
కీర్తన 13
సంగీత దర్శకునికి. దావీదు కీర్తన.
1యెహోవా, ఎంతకాలం నన్ను మరచిపోతారు?
ఎంతకాలం మీ ముఖాన్ని నా నుండి దాచిపెడతారు?
2ఎంతకాలం నా ఆలోచనలతో నేను పెనుగులాడాలి?
ఎంతకాలం నా హృదయంలో నేను దుఃఖపడాలి?
ఎంతకాలం నా శత్రువు నాపై విజయం సాధిస్తాడు?
3యెహోవా నా దేవా, నన్ను చూసి జవాబివ్వండి,
నా కళ్లకు వెలుగివ్వండి, లేకపోతే నేను మరణంలో నిద్రపోతాను.
4“మేము అతన్ని ఓడించాము” అని నా శత్రువులు చెప్పుకోనివ్వకండి,
నేను పడిపోయినప్పుడు నా శత్రువులను ఆనందించనివ్వకండి.
5అయితే నేను మారని మీ ప్రేమను నమ్ముతున్నాను;
మీ రక్షణలో నా హృదయం సంతోషిస్తుంది.
6యెహోవా నా మీద దయ చూపారు,
కాబట్టి నేను ఆయనకు స్తుతి పాడతాను.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

కీర్తనలు 13: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి