కీర్తనలు 12
12
కీర్తన 12
సంగీత దర్శకునికి. షెమినీతు#12 షెమినీతు బహుశ సంగీత పదం కావచ్చు వాయిద్యాలతో పాడదగినది. దావీదు కీర్తన.
1యెహోవా, సహాయం చేయండి, ఎందుకంటే ఒక్కరైన నమ్మకమైనవారు లేరు;
నమ్మకమైనవారు మనుష్యజాతి నుండి గతించిపోయారు.
2ప్రతి ఒక్కరు తమ పొరుగువారితో అబద్ధమాడుతున్నారు;
వారు తమ హృదయాల్లో మోసం పెట్టుకుని
తమ పెదవులతో పొగడుతారు.
3పొగిడే ప్రతి పెదవిని
గొప్పలు చెప్పుకునే ప్రతి నాలుకను యెహోవా మౌనం చేయును గాక.
4“మా నాలుకలతో మేము గెలుస్తాం;
మా పెదవులు మమ్మల్ని కాపాడతాయి; మామీద ప్రభువెవరు?”
అని వారంటారు.
5“దీనులు దోపిడికి గురవుతున్నారు,
అవసరంలో ఉన్నవారు మూల్గుతున్నారు కనుక,
నేను ఇప్పుడే లేచి దుర్భాషలాడే వారి నుండి నేను వారిని రక్షిస్తాను”
అని యెహోవా అంటున్నారు.
6యెహోవా మాటలు నిర్దోషమైనవి,
అవి మట్టి మూసలో శుద్ధి చేసిన వెండిలా పవిత్రమైనవి,
ఏడుసార్లు శుద్ధి చేయబడిన బంగారం లాంటివి.
7యెహోవా, అవసరంలో ఉన్నవారిని మీరు క్షేమంగా ఉంచుతారు
ఈ చెడ్డతరం వారి నుండి నిత్యం కాపాడతారు,
8మానవులలో నీచ ప్రవర్తన ఎక్కువైనప్పుడు,
దుష్టులు విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటారు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
కీర్తనలు 12: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.