యాకోబు 4
4
మిమ్మల్ని దేవునికి సమర్పించుకోండి
1మీ మధ్యలో ఉన్న పోరాటాలు, గొడవలు ఎక్కడ నుండి వచ్చాయి? మీలో పోరాడుతున్న దురాశల నుండి వచ్చినవే కదా? 2మీరు కోరుకున్నదానిని పొందలేదు, కాబట్టి మీరు హత్య చేస్తారు. మీరు ఆశపడిన దానిని సంపాదించుకోలేదు, కనుక మీరు పోరాటాలు, గొడవలు చేస్తారు. మీరు దేవుని అడగలేదు కాబట్టి మీరు పొందలేదు. 3మీరు పొందినదానిని మీ సంతోషాల కొరకు ఉపయోగించుకోవాలనే దురుద్ధేశ్యంతో అడుగుతారు కాబట్టి మీరు ఏమి పొందలేదు.
4వ్యభిచారులారా!#4:4 అవిశ్వాస ఒడంబడికకు సూచన, హోషేయ 3:1 ఈ లోకంతో స్నేహం చేయడమంటే దేవునితో విరోధం పెట్టుకోవడం అని మీకు తెలియదా? కాబట్టి ఈ లోకంతో స్నేహం చేసిన ప్రతివారు దేవునికి విరోధులుగా మారతారు. 5లేదా “దేవుడు మనలో నివసింపచేసిన ఆత్మ కొరకు ఆయన వేదనతో అపేక్షిస్తున్నాడని” లేఖనం చెప్పడం అనవసరం అని అనుకుంటున్నారా?#4:5 లేదా, ఆయన మనలో నివసింపచేసిన ఆత్మ తీవ్రంగా అసూయపడుచున్నాడు. 6అయితే ఆయన అందరికి ఎక్కువ కృపను ఇస్తాడు; కనుక,
“దేవుడు గర్విష్టులను వ్యతిరేకిస్తారు కాని,
దీనులకు కృపను ఇస్తారని లేఖనం చెప్తున్నది.”#4:6 సామె 3:34
7కాబట్టి మీరు దేవునికి లోబడి ఉండండి. అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ నుండి పారిపోతాడు. 8దేవునికి దగ్గరగా రండి అప్పుడు ఆయన మీకు దగ్గరగా వస్తాడు. పాపులారా, మీ చేతులను కడుగుక్కోండి, రెండు మనస్సులు కలవారలారా, మీ హృదయాలను శుద్ధి చేసుకోండి. 9విచారపడుతూ దుఃఖిస్తూ కన్నీరు కార్చండి. మీ నవ్వును దుఃఖంగా, మీ సంతోషాన్ని విచారంగా మార్చుకోండి. 10ప్రభువు ముందు మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తారు.
11నా సహోదరీ సహోదరులారా, ఒకరి గురించి ఒకరు చెడుగా మాట్లాడవద్దు. ఇతరుల గురించి చెడుగా మాట్లాడినవారు లేదా ఇతరులకు తీర్పుతీర్చేవారు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా చెడుగా మాట్లాడతారు. ధర్మశాస్త్రానికి తీర్పు తీరుస్తారు. మీరు ధర్మశాస్త్రానికి తీర్పుతీర్చితే మీరు ధర్మశాస్త్రానికి పాటించేవారిగా కాకుండా న్యాయాధికారిగా ఉంటారు. 12ధర్మశాస్త్రంను ఇచ్చినవాడు న్యాయాధికారి ఒక్కడే, ఆయన రక్షించగలడు నాశనం చేయగలడు. కాబట్టి మీ పొరుగు వారికి తీర్పు తీర్చడానికి మీరు ఎవరు?
రేపటి గురించి గొప్పలు చెప్పుకోవడం
13“ఈ రోజైనా లేదా రేపైనా మనం ఏదో ఒక పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం వుండి వ్యాపారం చేసి డబ్బు సంపాదించుకుందామని” చెప్పేవారలారా రండి. 14రేపు ఏమి జరుగుతుందో మీకు తెలియదు. మీ జీవితం ఏపాటిది? కొంతసేపు కనిపించి మాయమైపోయే పొగమంచువంటిది. 15కాబట్టి “ప్రభువు చిత్తమైతే మనం జీవించి ఇది చేద్దాము అది చేద్దాము” అని మీరు చెప్పండి. 16కాని దానికి బదులు మీరు అహంకారంతో గొప్పలు చెప్పుకుంటున్నారు. ఆ విధంగా గొప్పలు చెప్పుకోవడం చెడుతనం. 17కాబట్టి చేయవలసిన మంచి వాటి గురించి తెలిసి, వాటిని చేయడంలో విఫలమైతే వారు పాపం చేసినవారు అవుతారు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యాకోబు 4: TCV
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version™, New Testament
Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.