యాకోబు 3

3
నాలుకను అదుపుచేయడం
1నా సహోదరీ సహోదరులారా, బోధకులమైన మనం అత్యంత కఠినంగా తీర్పు తీర్చబడతామని మీకు తెలుసు కాబట్టి మీలో అనేకమంది బోధకులుగా మారకండి. 2మన మందరం అనేక రీతులు తడబడతాం. మాట్లాడంలో తప్పులు చేయనివారు పరిపూర్ణులై శరీరమంతటిని ఒక కళ్లెంతో అదుపులో ఉంచుకోగల శక్తిని కలిగివుంటారు.
3మనము గుర్రాలను లోబరచుకోవడానికి వాటి నోటికి కళ్ళెము వేసినట్లైతే వాటి శరీరమంతటిని త్రిప్పగలము. 4లేదా ఓడలను చూడండి; చాలా పెద్దగా ఉంటాయి, అవి బలమైన గాలికి కొట్టుకొనిపోతున్నా దానిని నడిపేవాని ఇష్ట ప్రకారం చాలా చిన్నగా వుండే చుక్కాని సహాయంతో త్రిప్పబడుతుంది. 5అలాగే నాలుక చిన్న అవయవమే కానీ అది అధికంగా ప్రగల్భాలు పలుకుతుంది. చిన్న నిప్పురవ్వ వల్ల ఎంతో పెద్ద అడవి కాల్చి వేయబడుతుంది. 6కాబట్టి నాలుక అగ్నిలాంటిది. నాలుక ఒక పాపాల పుట్టగా మన అవయవాల మధ్య ఉంచబడింది; అది శరీరమంతటిని పాడుచేస్తుంది, ప్రకృతి చక్రంలో చిచ్చు పెడుతుంది; నరకం చేత దానికదే నిప్పు పెట్టుకుంటుంది.
7మృగాలను, పక్షులను, ప్రాకే ప్రాణులను, సముద్రపు జీవులను మానవజాతి అదుపుచేస్తుంది, అదుపుచేసింది. 8కాని నిరంతరం చెడుచేస్తూ, మరణకరమైన విషంతో నిండిన నాలుకను ఎవరూ అదుపుచేయలేరు.
9ఆ నాలుకతోనే తండ్రియైన దేవుని స్తుతిస్తాం, ఆ నాలుకతోనే దేవుని పోలికతో చేయబడిన వారిని శపిస్తాము. 10ఒకే నోటి నుండి స్తుతి శాపాలు వస్తున్నాయి. నా సహోదరీ సహోదరులారా, మనం అలా ఉండకూడదు. 11ఒక నీటి ఊటలో ఒకే చోట నుండి మంచినీరు ఉప్పునీరు వస్తాయా? 12నా సహోదరీ సహోదరులారా, అంజూరపు చెట్టుకి ఒలీవల పండ్లు, ద్రాక్షతీగెలకు అంజూరపు పండ్లు కాస్తాయా? అదే విధంగా ఉప్పునీటి ఊట నుండి మంచినీరు రావు.
రెండు రకాల జ్ఞానం
13మీలో జ్ఞానం, గ్రహింపు కలవారు ఎవరు? జ్ఞానం వలన వచ్చిన సహనంతో మీ పనులు చేయబడ్డాయని మీ మంచి జీవితం ద్వారా చూపించాలి. 14అయితే మీ హృదయాల్లో చెడ్డదైన అసూయ, స్వార్థపూరితమైన దురాశలు వున్నప్పుడు, గొప్పలు చెప్పుకోవద్దు, సత్యాన్ని తప్పుగా చెప్పవద్దు. 15అలాంటి జ్ఞానం పరలోక నుండి దిగివచ్చినది కాదు, అది ఈ లోక సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది కాదు, దయ్యాలకు సంబంధించిన జ్ఞానం. 16ఎక్కడైతే అసూయ, స్వార్థపూరితమైన దురాశలు ఉంటాయో అక్కడ ప్రతి విధమైన అక్రమాలు దుర్మార్గాలు ఉంటాయి.
17పైనుండి వచ్చిన జ్ఞానం మొదట స్వచ్ఛముగా ఉంటుంది, తరువాత శాంతికరంగా, సహనంతో, లోబడేదానిగా, దయతో నిండుకొని మంచి ఫలాలను కలిగి, పక్షపాతం కాని మోసం కాని లేనిదై ఉంటుంది. 18శాంతిలో విత్తిన శాంతిని కలుగచేసినవారు నీతి అనే పంట కోస్తారు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యాకోబు 3: TCV

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి

యాకోబు 3 కోసం వీడియో