కీర్తనలు 37
37
దావీదు కీర్తన.
1చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకుము
దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకుము.
2వారు గడ్డివలెనే త్వరగా ఎండిపోవుదురు.
పచ్చని కూరవలెనే వాడిపోవుదురు
3యెహోవాయందు నమ్మికయుంచి మేలుచేయుము
దేశమందు నివసించి సత్యము ననుసరించుము
4యెహోవానుబట్టి సంతోషించుము
ఆయన నీ హృదయవాంఛలను తీర్చును.
5నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము
నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము
నెరవేర్చును.
6ఆయన వెలుగునువలె నీ నీతిని
మధ్యాహ్నమునువలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును.
7యెహోవా యెదుట మౌనముగానుండి ఆయనకొరకు
కనిపెట్టుకొనుము.
తన మార్గమున వర్ధిల్లువాని చూచి వ్యసనపడకుము
దురాలోచనలు నెరవేర్చుకొనువాని చూచి వ్యసన
పడకుము.
8కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము
వ్యసనపడకుము అది కీడుకే కారణము
9కీడుచేయువారు నిర్మూలమగుదురు
యెహోవాకొరకు కనిపెట్టుకొనువారు దేశమును
స్వతంత్రించుకొందురు.
10ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురువారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు
కనబడకపోవుదురు.
11దీనులు భూమిని స్వతంత్రించుకొందురు
బహు క్షేమము కలిగి సుఖించెదరు
12భక్తిహీనులు నీతిమంతులమీద దురాలోచన చేయుదురువారినిచూచి పండ్లు కొరుకుదురు.
13వారి కాలమువచ్చుచుండుట ప్రభువు చూచు
చున్నాడు.వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు.
14దీనులను దరిద్రులను పడద్రోయుటకై
యథార్థముగా ప్రవర్తించువారిని చంపుటకై
భక్తిహీనులు కత్తి దూసియున్నారు విల్లెక్కు పెట్టియున్నారు
15వారి కత్తి వారి హృదయములోనే దూరునువారి విండ్లు విరువబడును.
16నీతిమంతునికి కలిగినది కొంచెమైనను
బహుమంది భక్తిహీనులకున్న ధనసమృద్ధికంటె శ్రేష్ఠము.
17భక్తిహీనుల బాహువులు విరువబడును
నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు
18నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడువారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును.
19ఆపత్కాలమందువారు సిగ్గునొందరు
కరవు దినములలో వారు తృప్తిపొందుదురు.
20భక్తిహీనులు నశించిపోవుదురు
యెహోవా విరోధులు మేతభూముల సొగసును పోలి
యుందురు
అది కనబడకపోవునట్లువారు పొగవలె కనబడక
పోవుదురు.
21భక్తిహీనులు అప్పుచేసి తీర్చకయుందురు
నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు.
22యెహోవా ఆశీర్వాదము నొందినవారు భూమిని
స్వతంత్రించుకొందురు
ఆయన శపించినవారు నిర్మూలమగుదురు.
23ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును
వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును.
24యెహోవా అతని చెయ్యి పట్టుకొని యున్నాడు
గనుక
అతడు నేలను పడినను లేవలేక యుండడు.
25నేను చిన్నవాడనై యుంటిని ఇప్పుడు ముసలివాడనై
యున్నాను
అయినను నీతిమంతులు విడువబడుట గానివారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి
యుండలేదు.
26దినమెల్ల వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురువారి సంతానపువారు ఆశీర్వదింపబడుదురు.
27కీడుచేయుట మాని మేలుచేయుము అప్పుడు నీవు
నిత్యము నిలుచుదువు
28ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు
ఆయన తన భక్తులను విడువడు
వారెన్న టెన్నటికి కాపాడబడుదురు గాని
భక్తిహీనుల సంతానము నిర్మూలమగును.
29నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురువారు దానిలో నిత్యము నివసించెదరు.
30నీతిమంతుల నోరు జ్ఞానమునుగూర్చి వచించునువారి నాలుక న్యాయమును ప్రకటించును.
31వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో
నున్నది వారి అడుగులు జారవు.
32భక్తిహీనులు నీతిమంతులకొరకు పొంచియుండి వారిని
చంపజూతురు.
33వారిచేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడువారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషు
లుగా ఎంచడు.
34యెహోవాకొరకు కనిపెట్టుకొని యుండుము
ఆయన మార్గము ననుసరించుము
భూమిని స్వతంత్రించుకొనునట్లు ఆయన నిన్ను
హెచ్చించును
భక్తిహీనులు నిర్మూలముకాగా నీవు చూచెదవు.
35భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచి
యుంటిని
అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టువలె వాడు
వర్ధిల్లియుండెను.
36అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు
లేకపోయెను
నేను వెదకితిని గాని వాడు కనబడకపోయెను.
37నిర్దోషులను కనిపెట్టుము యథార్థవంతులను చూడుము
సమాధానపరచువారి సంతతి నిలుచును గాని
38ఒకడైనను నిలువకుండ అపరాధులు నశించుదురు
భక్తిహీనుల సంతతి నిర్మూలమగును.
39యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము
బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము.
40యెహోవావారికి సహాయుడై వారిని రక్షించునువారు యెహోవా శరణుజొచ్చియున్నారు గనుక
ఆయన భక్తిహీనులచేతిలోనుండి వారిని విడిపించి
రక్షించును.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
కీర్తనలు 37: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.