కీర్తనలు 36

36
ప్రధానగాయకునికి. యెహోవా సేవకుడైన దావీదు కీర్తన.
1భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తివలె
పలుకుచున్నది
వాని దృష్టియెదుట దేవుని భయము బొత్తిగాలేదు.
2వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడువరకు
అది వాని దృష్టియెదుట వాని ముఖస్తుతిచేయు చున్నది.
3వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును
ఆస్పదములు
బుద్ధిగలిగి ప్రవర్తింపను మేలుచేయను వాడు మానివేసి
యున్నాడు.
4వాడు మంచముమీదనే పాపయోచనను యోచిం
చును
వాడు కానినడతలు నడచువాడు
చెడుతనము వానికి అసహ్యము కాదు.
5యెహోవా, నీ కృప ఆకాశము నంటుచున్నది
నీ సత్యసంధత్వము అంతరిక్షము నంటుచున్నది.
6నీ నీతి దేవుని పర్వతములతో సమానము
నీ న్యాయవిధులు మహాగాధములు.
యెహోవా, నరులను జంతువులను రక్షించువాడవు
నీవే
7దేవా, నీ కృప యెంతో అమూల్యమైనది
నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు.
8నీ మందిరముయొక్క సమృద్ధివలనవారు సంతృప్తి
నొందుచున్నారు.
నీ ఆనందప్రవాహములోనిది నీవు వారికి త్రాగించు
చున్నావు.
9నీయొద్ద జీవపు ఊట కలదు
నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచు
చున్నాము.
10నిన్ను ఎరిగినవారియెడల నీ కృపను
యథార్థహృదయులయెడల నీ నీతిని ఎడతెగక నిలు
పుము.
11గర్విష్ఠుల పాదమును నా మీదికి రానియ్యకుము
భక్తిహీనులచేతిని నన్ను పారదోలనియ్యకుము.
అదిగో పాపముచేయువారు అక్కడ పడియున్నారు
లేవలేకుండ వారు పడద్రోయబడి యున్నారు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

కీర్తనలు 36: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి