యోబు 21
21
1అప్పుడు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను–
2నా మాట మీరు జాగ్రత్తగా వినుడి
నా మాట మీ ఆదరణమాటకు ప్రతిగా నుండుగాక.
3నాకు సెలవిచ్చినయెడల నేను మాటలాడెదను
నేను మాటలాడిన తరువాత మీరు అపహాస్యము
చేయవచ్చును.
4నేను మనుష్యునిగురించి#21:4 మనుష్యునితో. మొఱ్ఱపెట్టుకొన్నానా? లేదు
గనుక నేను ఏల ఆతురపడకూడదు?
5నన్ను తేరిచూచి ఆశ్చర్యపడుడి
నోటిమీద చేయి వేసికొనుడి.
6నేను దాని మనస్సునకు తెచ్చుకొనినయెడల నాకే
మియు తోచకున్నది
నా శరీరమునకు వణకు పుట్టుచున్నది.
7భక్తిహీనులు ఏల బ్రదుకుదురు?వారు వృద్ధులై బలాభివృద్ధి ఏల నొందుదురు?
8వారుండగానే వారితోకూడ వారి సంతానమువారు చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచ
బడుచున్నది.
9వారి కుటుంబములు భయమేమియు లేక క్షేమముగా
నున్నవి
దేవుని దండము వారిమీద పడుటలేదు.
10వారి గొడ్లు దాటగా తప్పక చూలు కలుగునువారి ఆవులు ఈచుకపోక ఈనును.
11వారు తమ పిల్లలను మందలు మందలుగా బయటికి
పంపుదురువారి పిల్లలు నటనము చేయుదురు.
12తంబుర స్వరమండలములను పట్టుకొని వాయించుదురు
సానికనాదము విని సంతోషించుదురు.
13వారు శ్రేయస్సుకలిగి తమ దినములు గడుపుదురు
ఒక్కక్షణములోనే పాతాళమునకు దిగుదురు.
14వారు–నీ మార్గములనుగూర్చిన జ్ఞానము మాకక్కరలేదు
నీవు మమ్మును విడిచిపొమ్మని దేవునితో చెప్పుదురు.
15మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగువాడెవడు?
మేము ఆయననుగూర్చి ప్రార్థనచేయుటచేత మాకేమి
లాభము కలుగును? అని వారు చెప్పుదురు
16వారి క్షేమము వారి చేతిలో లేదు
భక్తిహీనుల యోచన నాకు దూరముగానుండును గాక.
17భక్తిశూన్యుల దీపము ఆర్పివేయబడుట అరుదుగదా.వారిమీదికి ఆపద వచ్చుట బహు అరుదు గదా.
18వారు తుపాను ఎదుట కొట్టుకొనిపోవు చెత్తవలెను
గాలి యెగరగొట్టు పొట్టువలెను ఉండునట్లు
ఆయన కోపపడి వారికి వేదనలు నియమించుట అరుదు
గదా.
19వారి పిల్లలమీద మోపుటకై దేవుడు వారి పాపమును
దాచిపెట్టునేమో? అని మీరు చెప్పుచున్నారు
చేసినవారు దానిని అనుభవించునట్లు ఆయన వారికే
ప్రతిఫలమిచ్చును గాక
20వారే కన్నులార తమ నాశనమును చూతురుగాక
సర్వశక్తుడగు దేవుని కోపాగ్నిని వారు త్రాగుదురు
గాక.
తమ జీవితకాలము సమాప్తమైన తరువాత
21తాము పోయిన తరువాత తమ ఇంటిమీద వారికి
చింత ఏమి?
22ఎవడైనను దేవునికి జ్ఞానము నేర్పునా?
పరలోకవాసులకు ఆయన తీర్పు తీర్చును గదా.
23ఒకడు తన కడవలలో పాలు నిండియుండగను
తన యెముకలలో మూలుగ బలిసియుండగను
24సంపూర్ణ సౌఖ్యమును నెమ్మదియును కలిగి నిండు
ఆయుష్యముతో మృతినొందును
25వేరొకడు ఎన్నడును క్షేమమనుదాని నెరుగక మనో
దుఃఖముగలవాడై మృతినొందును.
26వారు సమానముగ మంటిలో పండుకొందురు పురు
గులు వారిద్దరిని కప్పును.
27మీ తలంపులు నేనెరుగుదును
మీరు నామీద అన్యాయముగా పన్నుచున్న పన్నా
గములు నాకు తెలిసినవి.
28–అధిపతులమందిరము ఎక్కడ నున్నది?
భక్తిహీనులు నివసించిన గుడారము ఎక్కడ ఉన్నది
అని మీరడుగుచున్నారే.
29దేశమున సంచరించువారిని మీరడుగలేదా?వారు తెలియజేసిన సంగతులు మీరు గురుతు పట్ట
లేదా?
30అవి ఏవనగా దుర్జనులు ఆపత్కాలమందు కాపాడ
బడుదురు
ఉగ్రతదినమందువారు తోడుకొని పోబడుదురు.
31వారి ప్రవర్తననుబట్టి వారితో ముఖాముఖిగా మాట
లనగలవాడెవడు?వారు చేసినదానినిబట్టి వారికి ప్రతికారముచేయు
వాడెవడు?
32వారు సమాధికి తేబడుదురు
సమాధి శ్రద్ధగా కావలికాయబడును
33పల్లములోని మంటి పెల్లలు వారికి ఇంపుగా నున్నవి
మనుష్యులందరు వారివెంబడి పోవుదురు
ఆలాగుననే లెక్క లేనంతమంది వారికి ముందుగా
పోయిరి.
మీరు చెప్పు ప్రత్యుత్తరములు నమ్మదగినవి కావు
34ఇట్టి నిరర్థకమైన మాటలతో మీరేలాగునన్ను
ఓదార్చ జూచెదరు?
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యోబు 21: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.