యోబు 22
22
1అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు ఈలాగున
ప్రత్యుత్తరమిచ్చెను–
2నరులు దేవునికి ప్రయోజనకారులగుదురా? కారు;
బుద్ధిమంతులు తమమట్టుకు తామే ప్రయోజనకారులైయున్నారు
3నీవు నీతిమంతుడవై యుండుట సర్వశక్తుడగు దేవునికి
సంతోషమా?
నీవు యథార్థవంతుడవై ప్రవర్తించుట ఆయనకు లాభ
కరమా?
4ఆయనయందు భయభక్తులు కలిగియున్నందున ఆయన
నిన్ను గద్దించునా?
నీ భయభక్తులనుబట్టి ఆయన నీతో వ్యాజ్యెమాడునా?
5నీ చెడుతనము గొప్పది కాదా?
నీ దోషములు మితిలేనివి కావా?
6ఏమియు ఇయ్యకయే నీ సోదరులయొద్ద నీవు తాకట్టు
పుచ్చుకొంటివి
వస్త్రహీనుల బట్టలను తీసికొంటివి
7దప్పిచేత ఆయాసపడినవారికి నీళ్లియ్యవైతివి
ఆకలిగొనినవానికి అన్నము పెట్టకపోతివి.
8బాహుబలముగల మనుష్యునికే భూమి ప్రాప్తించును
ఘనుడని యెంచబడినవాడు దానిలో నివసించును.
9విధవరాండ్రను వట్టిచేతులతో పంపివేసితివి
తండ్రిలేనివారి చేతులు విరుగగొట్టితివి.
10కావుననే బోనులు నిన్ను చుట్టుకొనుచున్నవి
ఆకస్మిక భయము నిన్ను బెదరించుచున్నది.
11నిన్ను చిక్కించుకొన్న అంధకారమును నీవు
చూచుటలేదా?
నిన్ను ముంచబోవు ప్రళయజలములను నీవు
చూచుటలేదా?
12దేవుడు ఆకాశమంత మహోన్నతుడు కాడా?
నక్షత్రముల ఔన్నత్యమును చూడుము అవి ఎంత
పైగా నున్నవి?
13దేవునికి ఏమి తెలియును?
గాఢాంధకారములోనుండి ఆయన న్యాయము కను
గొనునా?
14గాఢమైన మేఘములు ఆయనకు చాటుగా నున్నవి,
ఆయన చూడలేడు
ఆకాశములో ఆయన తిరుగుచున్నాడు అని నీవను
కొనుచున్నావు.
15పూర్వమునుండి దుష్టులు అనుసరించిన మార్గమును నీవు
అనుసరించెదవా?
16వారు అకాలముగా ఒక నిమిషములో నిర్మూలమైరివారి పునాదులు జలప్రవాహమువలె కొట్టుకొని
పోయెను.
17ఆయన మంచి పదార్థములతో వారి యిండ్లను నింపినను
18–మాయొద్దనుండి తొలగిపొమ్మనియు
సర్వశక్తుడగు దేవుడు మాకు ఏమి చేయుననియు వారు
దేవునితో అందురు.
భక్తిహీనుల ఆలోచన నాకు దూరమై యుండునుగాక.
19–మన విరోధులు నిశ్చయముగా నిర్మూలమైరనియువారి సంపదను అగ్ని కాల్చివేసెననియు పలుకుచు
20నీతిమంతులు దాని చూచి సంతోషించుదురు
నిర్దోషులు వారిని హేళనచేయుదురు.
21ఆయనతో సహవాసముచేసినయెడల నీకు సమాధానము
కలుగును
ఆలాగున నీకు మేలు కలుగును.
22ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము
ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము.
23సర్వశక్తునివైపు నీవు తిరిగినయెడల
నీ గుడారములలోనుండి దుర్మార్గమును దూరముగా
తొలగించినయెడల నీవు అభివృద్ధి పొందెదవు.
24మంటిలో నీ బంగారమును ఏటిరాళ్లలో ఓఫీరు సువర్ణ
మును పారవేయుము
25అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన
వెండిగాను ఉండును.
26అప్పుడు సర్వశక్తునియందు నీవు ఆనందించెదవు
దేవునితట్టు నీ ముఖము ఎత్తెదవు.
27నీవు ఆయనకు ప్రార్థనచేయగా
ఆయన నీ మనవి నాలకించును
నీ మ్రొక్కుబళ్లు నీవు చెల్లించెదవు.
28మరియు నీవు దేనినైన యోచనచేయగా అది నీకు
స్థిరపరచబడును
నీ మార్గములమీద వెలుగు ప్రకాశించును.
29నీవు పడద్రోయబడినప్పుడు–మీదు చూచెదనందువు
వినయముగలవానిని ఆయన రక్షించును.
30నిర్దోషికానివానినైనను ఆయన విడిపించును.
అతడు నీచేతుల శుద్ధివలన విడిపింపబడును.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యోబు 22: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.