యోబు 20

20
1అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఈలాగున
ప్రత్యుత్తరమిచ్చెను–
2ఆలాగున నీవు చెప్పినందుకు నాయందలి ఆతురత
తగిన ప్రత్యుత్తరము సిద్ధపరచియున్నది.
3నాకు అవమానము కలుగజేయు నిందను నేను విన్నందుకు
నా మనోవివేకము తగిన ప్రత్యుత్తరము సిద్ధపరచి
యున్నది.
4దుష్టులకు విజయము కొద్దికాలముండును
భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషమాత్రముండును.
5ఆదినుండి నరులు భూమిమీద నుంచబడిన కాలము
మొదలుకొని
ఈలాగు జరుగుచున్నదని నీకు తెలియదా?
6వారి ఘనత ఆకాశమంత యెత్తుగా పెరిగినను
మేఘములంత యెత్తుగా వారు తలలెత్తినను
7తమ మలము నశించురీతిగా వారెన్నటికిని నుండకుండ
నశించుదురు.వారిని చూచినవారు–వారేమైరని యడుగుదురు.
8కల యెగసిపోవునట్లువారు గతించి కనబడక పోవుదురు
రాత్రి స్వప్నము దాటిపోవునట్లువారు తరిమి వేయ
బడుదురు.
9వారిని చూచిన కన్ను ఇకను వారిని చూడదువారి స్థలమునవారు మరి ఎప్పుడును కనబడరు
10వారి సంతతివారు దరిద్రుల దయను వెదకెదరువారి చేతులు వారి ఆస్తిని తిరిగి అప్పగించును.
11వారి యెముకలలో యౌవనబలము నిండియుండునుగాని
అదియు వారితోకూడ మంటిలో పండుకొనును.
12చెడుతనము వారి నోటికి తియ్యగా నుండెనువారు నాలుకక్రింద దాని దాచిపెట్టిరి.
13దాని పోనియ్యక భద్రముచేసికొనిరి, నోట దాని
నుంచుకొనిరి.
14అయినను వారి కడుపులో వారి ఆహారము పులిసిపోవును
అది వారిలోపట నాగుపాముల విషమగును.
15వారు ధనమును మ్రింగివేసిరి గాని యిప్పుడు దానిని
మరల కక్కివేయుదురు.
వారి కడుపులోనుండి దేవుడు దాని కక్కించును.
16వారు కట్లపాముల విషమును పీల్చుదురు
నాగుపాము నాలుక వారిని చంపును.
17ఏరులై పారుచున్న తేనెను వెన్నపూసను చూచివారు సంతోషింపరు.
18దేనికొరకు వారు ప్రయాసపడి సంపాదించియుండిరో
దానిని వారు అనుభవింపక మరల అప్పగించెదరువారు సంపాదించిన ఆస్తికొలది వారికి సంతోషముండదు
19వారు బీదలను ముంచి విడిచిపెట్టినవారువారు బలాత్కారముచేత ఒక యింటిని ఆక్రమించు
కొనినను దానిని కట్టి పూర్తిచేయరు.
20వారు ఎడతెగక ఆశించినవారు
తమ యిష్టవస్తువులలో ఒకదానిచేతనైనను తమ్మును
తాము రక్షించుకొనజాలరు.
21వారు మ్రింగివేయనిది ఒకటియు లేదు గనుక వారి
క్షేమస్థితి నిలువదు.
22వారికి సంపాద్యము పూర్ణముగా కలిగిన సమయమునవారు ఇబ్బందిపడుదురు
దురవస్థలోనుండు వారందరి చెయ్యి వారిమీదికి
వచ్చును.
23వారు కడుపు నింపుకొననైయుండగా
దేవుడు వారిమీద తన కోపాగ్ని కురిపించునువారు తినుచుండగా దాని కురిపించును.
24ఇనుప ఆయుధము తప్పించుకొనుటకై వారు పారి
పోగా
ఇత్తడివిల్లు వారి దేహములగుండ బాణములను పోవిడుచును.
25అది దేహమును చీల్చి వారి శరీరములోనుండి వచ్చును
అది బయట తీయగా వారి శరీరములోనుండి పైత్యపు
తిత్తి వచ్చును, మరణభయము వారి మీదికి వచ్చును.
26వారి ధననిధులు అంధకారపూర్ణములగును
ఊదనక్కరలేని అగ్ని వారిని మ్రింగివేయును
వారి గుడారములో మిగిలినదానిని అది కాల్చి
వేయును.
27ఆకాశము వారి దోషమును బయలుపరచును
భూమి వారిమీదికి లేచును.
28వారి యింటికివచ్చిన ఆర్జన కనబడకపోవును
దేవుని కోపదినమున వారి ఆస్తి నాశనమగును.
29ఇది దేవునివలన దుష్టులైన నరులకు ప్రాప్తించుభాగము
దేవునివలన వారికి నియమింపబడిన స్వాస్థ్యము ఇదే.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యోబు 20: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి