యోబు 16

16
1అందుకు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను–
2ఇట్టి మాటలు అనేకములు నేను వినియున్నాను
మీరందరు బాధకే కర్తలుగాని ఆదరణకు కర్తలుకారు.
3ఈ గాలిమాటలు ముగిసిపోయెనా?
నీకేమి బాధ కలుగుటచేత నాకుత్తరమిచ్చుచున్నావు?
4నాస్థితిలో మీరుండినయెడల నేనును మీవలె మాట
లాడవచ్చును.
నేనును మీమీద మాటలు కల్పింపవచ్చును
మీవైపు చూచి నా తల ఆడింపవచ్చును.
5అయినను నేను నా నోటి మాటలతో మిమ్మును బల
పరచుదును
నా పెదవుల మాటలు మిమ్మును ఓదార్చి ఆదరించును
6నేను మాటలాడినను నా దుఃఖము చల్లారదు
నేను ఊరకుండినను నాకేమి ఉపశమనము కలుగును?
7ఇప్పుడు ఆయన నాకు ఆయాసము కలుగజేసి
యున్నాడు
నా బంధువర్గమంతయు నీవు పాడు చేసియున్నావు
8నా దేహమంతయు నీవు పట్టుకొనియున్నావు.
ఇది కూడ నామీద సాక్ష్యముగా నున్నది
నా క్షీణత ముఖాముఖిగా సాక్ష్యమిచ్చుచున్నది.
9ఆయన తన కోపముచేత నామీదపడి నన్ను చీల్చెను.
ఆయన నామీద పండ్లు కొరుకుచుండెను
నాకు శత్రువై నామీద తన కన్నులు ఎఱ్ఱచేసెను.
10జనులు నామీద తమ నోరు తెరతురు
నన్ను తిట్టి చెంపమీద కొట్టుదురు.వారు ఏకీభవించి నామీద గుంపు కూడుదురు
11దేవుడు నన్ను దుర్మార్గులకు అప్పగించియున్నాడు
భక్తిహీనుల వశమున నన్ను ఉంచియున్నాడు.
12నేను నెమ్మదిగానుంటిని అయితే ఆయన నన్ను
ముక్కలు చెక్కలు చేసియున్నాడు
మెడ పట్టుకొని విదలించి నన్ను తుత్తునియలుగా
చేసియున్నాడు.
తనకు నన్ను గురిదిబ్బగా నిలిపియున్నాడు
13ఆయన బాణములు నన్ను చుట్టుకొనుచున్నవి
కనికరములేక నా తుండ్లను పొడిచెను
నా పైత్యరసమును నేలను పారబోసెను.
14కన్నముమీద కన్నమువేసి ఆయన నన్ను విరుగ
గొట్టెను
పరుగులెత్తి శూరునివలె నామీద పడెను.
15నా చర్మముమీద నేను గోనెపట్ట కూర్చుకొంటిని
నా కొమ్మును ధూళితో మురికిచేసితిని.
16నాచేత బలాత్కారము జరుగకపోయినను
నా ప్రార్థన యథార్థముగా నుండినను
17ఏడ్పుచేత నా ముఖము ఎఱ్ఱబడియున్నది
నా కనురెప్పలమీద మరణాంధకారము నిలుచుచున్నది.
18భూమీ, నా రక్తమును కప్పివేయకుము
నా మొఱ్ఱకు విరామము కలుగకుండునుగాక.
19ఇప్పుడు నాకు సాక్షియైనవాడు పరలోకములో
నున్నాడు
నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమం
దున్నాడు.
20నా స్నేహితులు నన్ను ఎగతాళిచేయుచున్నారు.
నరునివిషయమై యొకడు దేవునితో వ్యాజ్యెమాడ
వలెననియు
21నర పుత్రునివిషయమై వాని స్నేహితునితో వ్యాజ్యె
మాడవలెననియు కోరి
నేను దేవునితట్టు దృష్టియుంచి కన్నీళ్లు ప్రవాహ
ముగా విడుచుచున్నాను.
22కొద్ది సంవత్సరములు గతించిన తరువాత తిరిగి రాని
మార్గమున నేను వెళ్లుదును.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యోబు 16: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి