యోబు 17

17
1నా ప్రాణము సమసిపోయెను నా దినములు తీరెను .
సమాధి నా నిమిత్తము సిద్ధమైయున్నది.
2ఎగతాళి చేయువారు నాయొద్ద చేరియున్నారువారు పుట్టించు వివాదములు నా కన్నుల కెదురుగా
నున్నవి.
3ఏర్పాటు చేయుము దయచేసి నా నిమిత్తము నీ
అంతట నీవే పూటపడుము
మరి యెవడు నా నిమిత్తము పూటపడును?
4నీవు వారి హృదయమునకు జ్ఞానము మరుగుచేసితివి
కావున నీవు వారిని హెచ్చింపవు.
5ఎవడు తన స్నేహితులను దోపుసొమ్ముగా ఇచ్చునో
వాని పిల్లల కన్నులు క్షీణించును.
6ఆయన నన్ను జనులలో సామెతకాస్పదముగా చేసి
యున్నాడు
నలుగురు నా ముఖముమీద ఉమ్మివేయుదురు.
7నా కనుదృష్టి దుఃఖముచేత మందమాయెను
నా అవయవములన్నియు నీడవలె ఆయెను
8యథార్థవంతులు దీనినిచూచి ఆశ్చర్యపడుదురు
నిర్దోషులు భక్తిహీనులస్థితి చూచి కలవరపడుదురు.
9అయితే నీతిమంతులు తమ మార్గమును విడువక
ప్రవర్తించుదురు
నిరపరాధులు అంతకంతకు బలము నొందుదురు.
10మీరందరు నాయొద్దకు రండి, మరల దయచేయుడి
మీలో జ్ఞానవంతు డొక్కడైనను నాకు కనబడడు.
11నా దినములు గతించెను
నా యోచన నిరర్థకమాయెను
నా హృదయ వాంఛ భంగమాయెను.
12రాత్రి పగలనియు
చీకటి కమ్ముటయే వెలుగనియు వారు వాదించుచున్నారు.
13ఆశ యేదైన నాకుండినయెడల పాతాళము నాకు
ఇల్లు అను ఆశయే.
చీకటిలో నా పక్క పరచుకొనుచున్నాను
14–నీవు నాకు తండ్రివని గోతితోను
నీవు నాకు తల్లివని చెల్లెలవని పురుగుతోను నేను
మనవి చేయుచున్నాను.
15నాకు నిరీక్షణాధారమేది?
నా నిరీక్షణ యెవనికి కనబడును?
16ధూళిలో విశ్రాంతి దొరకగా
అది పాతాళపు అడ్డకమ్ములయొద్దకు దిగుచున్నది.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యోబు 17: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in