యోబు 18

18
1అప్పుడు షూహీయుడైన బిల్దదు ఈలాగు ప్రత్యుత్తర మిచ్చెను–
2మాటలలో చిక్కుపరచుటకై మీ రెంతసేవు వెదకుదురు?
మీరు ఆలోచనచేసి ముగించినయెడల మేము మాటలాడెదము.
3మీ దృష్టికి మృగములుగాను
మూఢులుగాను మేమెంచబడుట ఏల?
4కోపముచేత నిన్ను నీవు చీల్చుకొనువాడా,
నీ నిమిత్తము భూమి పాడుగా చేయబడునా?
నీ నిమిత్తము కొండ దాని స్థానము తప్పునా?
5భక్తిహీనుల దీపము ఆర్పివేయబడునువారి అగ్ని జ్వాలలు ప్రకాశింపకపోవును.
6వారి గుడారములో వెలుగు అంధకారమగునువారియొద్దనున్న దీపము ఆరిపోవును
7వారి పటుత్వముగల నడకలు అడ్డగింపబడునువారి స్వకీయాలోచన వారిని కూల్చును.
8వారు వాగురలమీద నడచువారు
తమ కాళ్లే వారిని వలలోనికి నడిపించును.
9బోను వారి మడిమెను పట్టుకొనును
వల వారిని చిక్కించుకొనును.
10వారిని చిక్కించుకొనుటకై ఉరి నేలను ఉంచబడునువారిని పట్టుకొనుటకై త్రోవలో ఉచ్చు పెట్టబడును.
11నలుదిక్కుల భీకరమైనవి వారికి భయము కలుగ
జేయును
భయములు వారిని వెంటాడి తరుమును.
12వారి బలము క్షీణించిపోవునువారిని కూల్చుటకు ఆపద కాచియుండును.
13అది వారి దేహ అవయవములను భక్షించును
మరణజ్యేష్ఠుడు వారి అవయవములను భక్షించును.
14వారి ఆశ్రయమైన వారి గుడారములోనుండి పెరికి
వేయబడుదురువారు భీకరుడగు రాజునొద్దకు కొనిపోబడుదురు.
15వారికి అన్యులైనవారు వారి గుడారములో నివాసము
చేయుదురు
16వారి నివాసస్థలముమీద గంధకము చల్లబడును.
క్రింద వారి వేళ్లు ఎండిపోవును
పైన వారి కొమ్మలు నరకబడును.
17భూమిమీద ఎవరును వారిని జ్ఞాపకము చేసికొనరు
మైదానమందు ఎక్కడను వారిని ఎరిగినవారు ఉండరు.
18జనులు వారిని వెలుగులోనుండి చీకటిలోనికి తోలుదురు
భూలోకములోనుండి వారిని తరుముదురు.
19వారి ప్రజలలో వారికి పుత్రులైనను పౌత్రులైనను
ఉండరువారు నివసించిన స్థలములో తప్పించుకొనినవాడు
ఒకడైనను ఉండడు.
20తర్వాత వచ్చినవారు వారిమీద పడిన శిక్షనుచూచి
విస్మయమొందుదురు
పూర్వముండినవారు దానిని చూచి దిగులుపడుదురు.
21నిశ్చయముగా భక్తిహీనుల నివాసములకు ఇట్టి గతి
పట్టును
దేవుని ఎరుగనివారి స్థలము ఇట్టిది.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యోబు 18: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in