యెషయా 42

42
1ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు
నేను ఏర్పరచుకొనినవాడు నా ప్రాణమునకు
ప్రియుడు
అతనియందు నా ఆత్మను ఉంచియున్నాను
అతడు అన్యజనులకు న్యాయము కనుపరచును.
2అతడు కేకలు వేయడు అరువడు
తన కంఠస్వరము వీధిలో వినబడనియ్యడు
3నలిగిన రెల్లును అతడు విరువడు
మకమకలాడుచున్న జనుపనార వత్తిని ఆర్పడు
అతడు సత్యము ననుసరించి న్యాయము కనుపరచును.
4భూలోకమున న్యాయము స్థాపించువరకు అతడు
మందగిలడు నలుగుడుపడడు
ద్వీపములు అతని బోధకొరకు కనిపెట్టును.
5ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి
భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి
దానిమీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడచువారి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా
ఈలాగు సెలవిచ్చుచున్నాడు.
6-7గ్రుడ్డివారి కన్నులు తెరచుటకును
బంధింపబడినవారిని చెరసాలలోనుండి వెలుపలికి
తెచ్చుటకును
చీకటిలో నివసించువారిని బందీగృహములోనుండి
వెలుపలికి తెచ్చుటకును
యెహోవానగు నేనే నీతివిషయములలో నిన్ను పిలిచి
నీ చేయి పట్టుకొనియున్నాను
నిన్ను కాపాడి ప్రజలకొరకు నిబంధనగాను అన్య
జనులకు వెలుగుగాను నిన్ను నియమించి
యున్నాను.
8యెహోవాను నేనే; ఇదే నా నామము మరి ఎవనికిని
నా మహిమను నేనిచ్చువాడను కాను
నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెంద
నియ్యను.
9మునుపటి సంగతులు సంభవించెను గదా
క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను
పుట్టకమునుపే వాటిని మీకు తెలుపుచున్నాను.
10సముద్రప్రయాణము చేయువారలారా, సముద్రము
లోని సమస్తమా,
ద్వీపములారా, ద్వీప నివాసులారా,
యెహోవాకు క్రొత్త గీతము పాడుడి
భూదిగంతములనుండి ఆయనను స్తుతించుడి.
11అరణ్యమును దాని పురములును కేదారు నివాస
గ్రామములును బిగ్గరగా పాడవలెను
సెల నివాసులు సంతోషించుదురు గాక
పర్వతముల శిఖరములనుండి వారు కేకలు వేయుదురు
గాక.
12ప్రభావముగలవాడని మనుష్యులు యెహోవాను కొని
యాడుదురు గాక
ద్వీపములలో ఆయన స్తోత్రము ప్రచురము చేయుదురు గాక
13యెహోవా శూరునివలె బయలుదేరును
యోధునివలె ఆయన తన ఆసక్తి రేపుకొనును
ఆయన హుంకరించుచు తన శత్రువులను ఎదిరించునువారియెదుట తన పరాక్రమము కనుపరచుకొనును.
14చిరకాలమునుండి నేను మౌనముగా ఉంటిని
ఊరకొని నన్ను అణచుకొంటిని
ప్రసవవేదనపడు స్త్రీవలె విడువకుండ నేను బలవంత
ముగా ఊపిరితీయుచు ఒగర్చుచు రోజుచు
నున్నాను.
15పర్వతములను కొండలను పాడుచేయుదును
వాటిమీది చెట్టుచేమలన్నిటిని ఎండిపోచేయుదును
నదులను ద్వీపములుగా చేయుదును
మడుగులను ఆరిపోచేయుదును.
16వారెరుగనిమార్గమున గ్రుడ్డివారిని తీసికొని వచ్చెదను
వారెరుగని త్రోవలలో వారిని నడిపింతును
వారి యెదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను
చక్కగాను చేయుదును
నేను వారిని విడువక యీ కార్యములు చేయుదును
17చెక్కినవిగ్రహములను ఆశ్రయించి పోతవిగ్రహ
ములను చూచి
మీరే మాకు దేవతలని చెప్పువారు వెనుకకు తొలగి
కేవలము సిగ్గుపడుచున్నారు.
18చెవిటివారలారా, వినుడి
గ్రుడ్డివారలారా, మీరు గ్రహించునట్లు ఆలో
చించుడి.
19నా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు?
నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు?
నా భక్తుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు?
యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు?
20నీవు అనేక సంగతులను చూచుచున్నావు గాని
గ్రహింపకున్నావువారు చెవి యొగ్గిరిగాని వినకున్నారు.
21యెహోవా తన నీతినిబట్టి సంతోషముగలవాడై
ఉపదేశక్రమమొకటి ఘనపరచి గొప్పచేసెను.
22అయినను ఈ జనము అపహరింపబడి దోపుడు
సొమ్మాయెను.
ఎవరును తప్పించుకొనకుండ వారందరు గుహలలో
చిక్కుపడియున్నారువారు బందీగృహములలో దాచబడియున్నారు
దోపుడుపాలైరి విడిపించువాడెవడును లేడు
అపహరింపబడిరి తిరిగి రప్పించుమని చెప్పువాడెవడును
లేడు.
23మీలో ఎవడు దానికి చెవి యొగ్గును?
రాబోవుకాలమునకై ఎవడు ఆలకించి వినును?
24యెహోవాకు విరోధముగా మనము పాపము చేసితిమివారు ఆయన మార్గములలో నడవనొల్లకపోయిరి
ఆయన ఉపదేశమును వారంగీకరింపకపోయిరి
యాకోబును దోపుసొమ్ముగా అప్పగించినవాడు,
దోచుకొనువారికి ఇశ్రాయేలును అప్పగించినవాడు
యెహోవాయే గదా?
25కావున ఆయన వానిమీద తన కోపాగ్నియు యుద్ధ
బలమును కుమ్మరించెను
అది వానిచుట్టు అగ్ని రాజచేసెను
అయినను వాడు దాని గ్రహింపలేదు
అది వానికి అంటుకొనెను గాని వాడు మనస్సున
పెట్టలేదు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యెషయా 42: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి

యెషయా 42 కోసం వీడియో