యెషయా 43

43
1అయితే యాకోబూ, నిన్ను సృజించినవాడగు
యెహోవా
ఇశ్రాయేలూ, నిన్ను నిర్మించినవాడు ఈలాగు సెల
విచ్చుచున్నాడు
–నేను నిన్ను విమోచించియున్నాను
భయపడకుము, పేరుపెట్టి నిన్ను పిలిచియున్నాను
నీవు నా సొత్తు.
2నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడైయుందును
నదులలో బడి వెళ్లునప్పుడు అవి నీమీద పొర్లిపారవు.
నీవు అగ్నిమధ్యను నడచునప్పుడు కాలిపోవు, జ్వాలలు
నిన్ను కాల్చవు
3యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు
పరిశుద్ధదేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను
నీప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి
యున్నాను
నీకు బదులుగా కూషును సెబాను ఇచ్చియున్నాను.
4నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి
నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా
మనుష్యులను అప్పగించుచున్నాను
నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించు
చున్నాను.
5భయపడకుము, నేను నీకు తోడైయున్నాను
తూర్పునుండి నీ సంతానమును తెప్పించెదను
పడమటినుండి నిన్ను సమకూర్చి రప్పించెదను.
6అప్పగింపుమని ఉత్తరదిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను
బిగబట్టవద్దని దక్షిణదిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను
దూరమునుండి నా కుమారులను
భూదిగంతములనుండి నా కుమార్తెలను తెప్పించుము.
7నా మహిమ నిమిత్తము నేను సృజించినవారిని
నా నామము పెట్టబడిన వారినందరిని తెప్పించుము
నేనే వారిని కలుగజేసితిని వారిని పుట్టించినవాడను నేనే.
8కన్నులుండి అంధులైనవారిని చెవులుండి బధిరులైనవారిని తీసికొని రండి
9సర్వజనులారా, గుంపుకూడి రండి
జనములు కూర్చబడవలెను
వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియజేయుదురు?
పూర్వకాలమున జరిగినవాటిని ఎవరు మాకు వినిపించు
దురు?
తాము నిర్దోషులమని తీర్పుపొందునట్లు తమ సాక్షు
లను తేవలెను
లేదా, విని సత్యమే యని యొప్పుకొనవలెను.
10మీరు తెలిసికొని నన్ను నమ్మి నేనే ఆయననని
గ్రహించునట్లు మీరును నేను ఏర్పరచుకొనిన
నా సేవకుడును నాకు సాక్షులు
నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు నా
తరువాత ఏ దేవుడు నుండడు.
11నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్ష
కుడు లేడు.
12ప్రకటించినవాడను నేనే రక్షించినవాడను నేనే
దాని గ్రహింపజేసినవాడను నేనే; యే అన్యదేవ
తయు మీలోనుండియుండలేదు
నేనే దేవుడను మీరే నాకు సాక్షులు; ఇదే
యెహోవా వాక్కు.
13ఈ దినము మొదలుకొని నేనే ఆయనను
నా చేతిలోనుండి విడిపించగలవాడెవడును లేడు
నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడెవడు?
14ఇశ్రాయేలు పరిశుద్ధదేవుడును మీ విమోచకుడునైన
యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–
మీ నిమిత్తము నేను బబులోకు పంపితిని
నేను వారినందరిని పారిపోవునట్లు చేసెదనువారి అతిశయాస్పదములగు ఓడలతో కల్దీయులను
పడవేసెదను.
15యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను
ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును.
16-17సముద్రములో త్రోవ కలుగజేయువాడును
వడిగల జలములలో మార్గము కలుగజేయువాడును
రథమును గుఱ్ఱమును సేనను శూరులను నడిపించువాడు
నగు యెహోవా
ఈలాగు సెలవిచ్చుచున్నాడు.
వారందరు ఏకముగా పండుకొని లేవకయుందురువారు లయమై జనుపనారవలె ఆరిపోయిరి.
18మునుపటివాటిని జ్ఞాపకము చేసికొనకుడి
పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి.
19ఇదిగో నేనొక నూతనక్రియ చేయుచున్నాను
ఇప్పుడే అది మొలుచును మీరు దాని నాలోచింపరా?
నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను
ఎడారిలో నదులు పారజేయుచున్నాను.
20నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్య
ములో నీళ్లు పుట్టించుచున్నాను
ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను
అడవి జంతువులును అడవి కుక్కలును నిప్పుకోళ్లును
నన్ను ఘనపరచును
21నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును
ప్రచురము చేయుదురు.
22యాకోబూ, నీవు నాకు మొఱ్ఱపెట్టుటలేదు
ఇశ్రాయేలూ, నన్నుగూర్చి నీవు విసికితివి గదా.
23దహనబలులుగా గొఱ్ఱెమేకల పిల్లలను నాయొద్దకు
తేలేదు
నీ బలులచేత నన్ను ఘనపరచలేదు
నైవేద్యములు చేయవలెనని నేను నిన్ను బలవంత
పెట్టలేదు
ధూపము వేయవలెనని నేను నిన్ను విసికింపలేదు.
24నా నిమిత్తము సువాసనగల లవంగపు చెక్కను నీవు
రూకలిచ్చి కొనలేదు
నీ బలి పశువుల క్రొవ్వుచేత నన్ను తృప్తిపరచలేదు
సరే గదా.
నీ పాపములచేత నీవు నన్ను విసికించితివి
నీ దోషములచేత నన్ను ఆయాసపెట్టితివి.
25నేను నేనే నా చిత్తానుసారముగా నీ యతిక్రమము
లను తుడిచివేయుచున్నాను
నేను నీ పాపములను జ్ఞాపకము చేసికొనను.
26నాకు జ్ఞాపకము చేయుము మనము కూడి వాదింతము
నీవు నీతిమంతుడవుగా తీర్చబడునట్లు నీ వ్యాజ్యెమును
వివరించుము.
27నీ మూలపితరుడు పాపముచేసినవాడే, నీ మధ్యవర్తులు
నామీద తిరుగుబాటు చేసినవారే.
28కావున నేను ప్రతిష్ఠితులగు నీ ప్రధానులను అపవిత్ర
పరచితిని
యాకోబును శపించితిని ఇశ్రాయేలును దూషణ
పాలు చేసితిని.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యెషయా 43: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for యెషయా 43