మత్తయి 1

1
యేసు క్రీస్తు వంశావళి
1ఇది అబ్రాహాము సంతానమైన దావీదు సంతానం నుండి వచ్చిన మెస్సీయ#1:1 మెస్సీయ లేక క్రీస్తు అనగా అభిషిక్తుడు యేసు వంశావళి:
2అబ్రాహాము కుమారుడు ఇస్సాకు,
ఇస్సాకు కుమారుడు యాకోబు,
యాకోబు కుమారులు యూదా, అతని సహోదరులు,
3యూదా కుమారులు పెరెసు, జెరహు, వీరి తల్లి తామారు.
పెరెసు కుమారుడు హెస్రోను,
హెస్రోను కుమారుడు ఆరాము,#1:3 ప్రా.ప్ర.లలో ఆరాము అలాగే; 1 దినవృ 2:9-10
4ఆరాము కుమారుడు అమ్మీనాదాబు,
అమ్మీనాదాబు కుమారుడు నయస్సోను,
నయస్సోను కుమారుడు శల్మా,
5శల్మా కుమారుడు బోయజు, అతని తల్లి రాహాబు,
బోయజు కుమారుడు ఓబేదు, అతని తల్లి రూతు,
ఓబేదు కుమారుడు యెష్షయి,
6యెష్షయి కుమారుడు దావీదు, అతడు ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించిన రాజు.
దావీదు కుమారుడు సొలొమోను, అతని తల్లి అంతకు ముందు ఊరియాకు భార్య,
7సొలొమోను కుమారుడు రెహబాము,
రెహబాము కుమారుడు అబీయా,
అబీయా కుమారుడు ఆసా,
8ఆసా కుమారుడు యెహోషాపాతు,
యెహోషాపాతు కుమారుడు యెహోరాము,
యెహోరాము కుమారుడు ఉజ్జియా,
9ఉజ్జియా కుమారుడు యోతాము,
యోతాము కుమారుడు ఆహాజు,
ఆహాజు కుమారుడు హిజ్కియా,
10హిజ్కియా కుమారుడు మనష్షే,
మనష్షే కుమారుడు ఆమోను,
ఆమోను కుమారుడు యోషీయా,
11యోషీయా కుమారులు యెకొన్యా#1:11 అంటే యెహోయాకీను; 12వ వచనంలో కూడా మరియు అతని తమ్ముళ్ళు, వీరి కాలంలోనే యూదులు బబులోను నగరానికి బందీలుగా కొనిపోబడ్డారు.
12వీరు బబులోను నగరానికి కొనిపోబడిన తర్వాత:
యెకొన్యా కుమారుడు షయల్తీయేలు,
షయల్తీయేలు కుమారుడు జెరుబ్బాబెలు,
13జెరుబ్బాబెలు కుమారుడు అబీహూదు,
అబీహూదు కుమారుడు ఎల్యాకీము,
ఎల్యాకీము కుమారుడు అజోరు,
14అజోరు కుమారుడు సాదోకు,
సాదోకు కుమారుడు ఆకీము,
ఆకీము కుమారుడు ఎలీహూదు,
15ఎలీహూదు కుమారుడు ఎలియాజరు,
ఎలియాజరు కుమారుడు మత్తాను,
మత్తాను కుమారుడు యాకోబు,
16యాకోబు కుమారుడు మరియకు భర్తయైన యోసేపు, యేసు అని పిలువబడిన క్రీస్తుకు తల్లి మరియ.
17ఈ విధంగా అబ్రాహాము నుండి దావీదు వరకు పధ్నాలుగు తరాలు, దావీదు నుండి బబులోను చెరలోనికి కొనిపోబడే వరకు పధ్నాలుగు తరాలు, చెరలోనికి తీసుకుపోయినప్పటి నుండి క్రీస్తు వరకు పధ్నాలుగు తరాలు ఉన్నాయి.
యోసేపు యేసును తన కుమారునిగా అంగీకరించుట
18యేసు క్రీస్తు పుట్టుక ఇలా జరిగింది: ఆయన తల్లి అయిన మరియ యోసేపుకు పెళ్లి కొరకు ప్రధానం చేయబడింది, కానీ వారిద్దరు ఏకం కాక ముందే ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది. 19అయితే ఆమె భర్త యోసేపు ధర్మశాస్త్రం పట్ల నమ్మకం గలవాడు కాబట్టి ఆమెను బహిరంగంగా అవమానపరచకుండా, రహస్యంగా విడిచిపెట్టాలని మనస్సులో నిర్ణయించుకున్నాడు.
20కాని అతడు ఇలా ఆలోచించిన తర్వాత, కలలో ప్రభువు దూత అతనికి కనబడి, “దావీదు కుమారుడవైన యోసేపూ, మరియను నీ భార్యగా ఇంటికి తీసుకువెళ్లడానికి భయపడకు, ఎందుకంటే ఆమె పరిశుద్ధాత్మ మూలంగా గర్భం ధరించింది. 21ఆమె ఒక కుమారునికి జన్మనిస్తుంది, ఆయన తన ప్రజలను వారి పాపాల నుండి రక్షిస్తారు కనుక నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టాలి” అని చెప్పాడు.
22ప్రవక్త ద్వారా పలికించిన ఈ మాటలు నెరవేరేలా ఇదంతా జరిగింది, 23“ఒక కన్య గర్భం ధరించి ఒక కుమారునికి జన్మనిస్తుంది, ఆయనకు ఇమ్మానుయేలు#1:23 యెషయా 7:14 అని పేరు పెడతారు” ఇమ్మానుయేలు అంటే “దేవుడు మనతో ఉన్నాడు” అని అర్థం.
24యోసేపు నిద్రలేచి ప్రభువు దూత తనకు ఆదేశించిన ప్రకారం మరియను తన భార్యగా స్వీకరించి తన ఇంట్లో చేర్చుకున్నాడు. 25అయితే ఆమె కుమారునికి జన్మనిచ్చే వరకు, యోసేపు ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోలేదు. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాడు.

Выделить

Поделиться

Копировать

None

Хотите, чтобы то, что вы выделили, сохранялось на всех ваших устройствах? Зарегистрируйтесь или авторизуйтесь