YouVersion Logo
Search Icon

ఆందోళనను దాని విధానాలలోనే ఓడించడంSample

ఆందోళనను దాని విధానాలలోనే ఓడించడం

DAY 4 OF 4

లోతుగా శ్వాస తీసుకోండి

మన మానవ శరీరంలో స్వయంప్రతిపత్తి కలిగిన నాడీ వ్యవస్థ ఉంది, దీనికి సహానుభూతి, ప్రతి నాడీ వ్యవస్థ అని పిలువబడే రెండు ఉప వ్యవస్థలు ఉన్నాయి.  

మొదటిది మన ఆందోళన ప్రతిస్పందనలను నియంత్రిస్తుంది, ఇది ఎదుర్కోవడం, పారిపోవడం, భీతిచెందే యాంత్రిక విధానాలు. ఈ ప్రతిస్పందనలు హృదయ వేగాన్ని, అధిక రక్తపోటు మరియు కార్టిసోల్ హార్మోను స్రావాన్ని అధికం చెయ్యడానికి కారణం అవుతాయి. రెండవ వ్యవస్థ, ప్రతినాడీ వ్యవస్థ ఆందోళన ప్రతిస్పందనను ఎదుర్కోవటానికి నెమ్మది, ఉపశమనాన్ని కలిగించే వ్యవస్థ. లోతుగా ఊపిరి పీల్చుకునేటప్పుడు ఇది ఉత్తేజితం అవుతుంది, మనం సాధారణంగా చేసే విధంగా మన ఛాతీ నుండి కాదు, మన ఉదరవితానం నుండి ఊపిరి పీల్చుకున్నప్పుడు ఇది జరుగుతుంది.  మెదడులోని అమిగ్డాలా ప్రాంతానికి ఎటువంటి ప్రమాదం లేనందున ఆ భాగం నెమ్మదిగానూ, విశ్రమించేలా ఉండడానికి సూచనలు పంపబడే విధంగా మనం ఉద్దేశపూర్వకంగా ఊపిరి పీల్చుకోవడం, ఊపిరి విడవడం అవసరం.

ఈ చిన్న విజ్ఞాన శాస్త్ర పాఠం ఎందుకు? లోతైన శ్వాసకునూ, ఆందోళన ప్రతిస్పందన తగ్గింపుకునూ మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందని నిరూపించబడింది. మీరు తీవ్ర భయాందోళనలకు గురి అయినప్పుడు మీరు ఎదుర్కొనే అన్ని లక్షణాలతో మీ శరీరాన్ని శాంతపరిచేందుకు మీ ఆరోగ్య సలహాదారు మీ శ్వాసమీద మీరు దృష్టి పెట్టాలని మీకు నేర్పుతారు. భూమిమీద ఉన్న మనలో ప్రతి ఒక్కరూ ఎటువంటి లోపం లేకుండా నిపుణుడైన సృష్టికర్తచేత సృష్టించబడ్డాము.  

ఆయన మనలను సృష్టించినప్పుడు ఆయన మన నాసికారంధ్రాలలోనికి జీవాత్మను ఊదాడు. మనం మరణంలో కళ్ళు మూసేంతవరకూ, శ్వాస మన దేహాలను విడిచేంతవరకూ అది మనలను బతికిస్తుంది. ప్రభువైన యేసును వ్యక్తిగతంగా మన రక్షకుడిగా తెలుసుకోవడంలోనూ, మన జీవితాలలో ఆయన విషయంలో మన అవసరాన్ని అంగీకరించడంలో, హెబ్రీలో రువాచ్ హకోడేష్ అయిన పరిశుద్ధాత్మను మనం ఆహ్వానిస్తున్నాము. రువాచ్ అనే పదానికి “ఆత్మ” అని అర్ధం, “గాలి” లేదా “శ్వాస” అని కూడా అర్థాన్ని ఇస్తుంది. ప్రభువైన యేసు పునరుత్థానుడైన తరువాత తన శిష్యులను కలుసుకున్నప్పుడు, ఆయన వారి మీద తన శ్వాసను ఊదాడు, పరిశుద్ధాత్మను పొందమని చెప్పాడు. పాత నిబంధనలో, ప్రవక్త యెహెజ్కేలుకు ఎముకల లోయ యొక్క దర్శనం ఇవ్వబడింది.  

ఈ ఎముకలకు (ఇశ్రాయేలు ప్రజలను సూచిస్తున్నాయి) ప్రవచించమని, ప్రభువు కోసం సైన్యాన్ని పెంచమని దేవుడు అతనిని అడిగాడు. ప్రత్యేకంగా భూమి యొక్క నాలుగు దిక్కులనుండి ఎముకలలోకి జీవాన్ని రావాలని ఆదేశించమని దేవుడు కోరాడు. మన ఉనికికి మన జీవిత శ్వాస ఎంతో కీలకమనేది స్పష్టమైన అంశం కాదా! ఆందోళన మనల్ని పట్టుకున్నప్పుడు, అది మనల్ని స్తంభింపజేస్తుంది, కొన్నిసార్లు మన నుండి ప్రాణాన్నే భయపెడుతుంది. పరిశుద్ధాత్మకు నిలయమైన మన దేహం మీద నియంత్రణను తిరిగి పొందే సమయం అది. మీరు తీసుకునే ప్రతి శ్వాస మనకు జీవాన్ని ఇచ్చే పరిశుద్ధాత్మను అధికంగా తీసుకోవడమే. ప్రతీ ఉచ్ఛ్వాసము దేవునిది కాని దానిని విడిపించడమే అవుతుంది. 

తదుపరిసారి మీ ఆలోచనలు అదుపు తప్పిపోవడం ఆరంభం అయినప్పుడు, మీ మనస్సులోని నిలిపివేసే బటన్‌ను నొక్కండి, దేవుని లోతైన వాగులలో (కీర్తన 42 మెసేజ్ అనువాదం) ఊపిరి పీల్చుకోండి, దేవుని ప్రేమ మీ మీద ఉండి మిమ్మల్ని కడిగివేసేలా, అలసిన మీ ఆత్మను సంపూర్ణంగా నింపేలా దేవుని ప్రేమను అనుమతిస్తూ నెమ్మదిగా శ్వాసను విడిచిపెట్టండి. 

ప్రార్థన:

ప్రియమైన ప్రభువా,

నా దేహంలోని ప్రతి శ్వాసతో నేను నిన్ను ఆరాధిస్తాను, నీకు అర్హమైన మహిమను ఇవ్వాలని కోరుతున్నాను. సంపూర్ణంగా హేచ్చయిన స్థాయిలో నిన్ను అనుభవించడానికి నాకు సహాయం చెయ్యండి. యేసులో నాకు వాగ్దానం చేయబడిన మహిమైశ్వర్యాన్ని నేను అనుభవించేలా నాకు సహాయం చెయ్యండి. ప్రభువా ఆందోళననుండి సంపూర్ణ స్వేచ్ఛనూ, స్వస్థతనూ నేను అనుభవించుడదును గాక. నేను ఆందోళన చెందిన ప్రతిసారీ నా పరిస్థితిలోనికి నిన్ను ఆహ్వానించి, నీవు నన్ను భద్రపరుస్తావని నేను విశ్వసిస్తాను. 

ఈ మానవులు యేసు నామంలో అడుగుతున్నాను

ఆమేన్.

Day 3

About this Plan

ఆందోళనను దాని విధానాలలోనే ఓడించడం

ఆందోళన అన్ని విధాలుగా మనలను బలహీనపరుస్తుంది, ఎందుకంటే ఇది మన సమతుల్యతను చెదరగొడుతుంది, భయంలో మనలను బంధిస్తుంది. ఇది కథకు ముగింపు కాదు, ఎందుకంటే పోరాటాన్ని అధిగమించడానికి మనం యేసులో స్వేచ్ఛనూ, కృపనూ కలిగియున్నాము. మనం దానిని కేవలం అధిగమించడం మాత్రమే కాదు, కాదు కాని దాని విషయంలో శ్రేష్ఠమైన వారంగా చెయ్యబడతాము, దేవుని వాక్యం కోసం, నిరంతరం మనలను ధైర్యపరచే ఆయన సన్నిధి కోసం కృతజ్ఞతలు తెలుపుతున్నాము.

More