ఆందోళనను దాని విధానాలలోనే ఓడించడంSample
ఒక్క సమయంలో ఒక్క రోజు
ప్రతి రోజుకూ దానికి సంబంధించిన పోరాటాలు ఉన్నాయి. మీరు దానితో ఖచ్చితంగా అంగీకరించకపోయినా కాని ఇది వాస్తవం. గృహంలోనూ, పనిలోనూ, పిల్లలతోనూ, విస్తరించిన కుటుంబంతోనూ, స్నేహాలతోనూ మనం ఎదుర్కొనే తాజా సవాళ్లకు అవసరమైన నూతన కరుణలు ప్రతిదినంలో ఉన్నాయి. దీని కోసం ప్రతి దినంలోని హెచ్చు, లోతు అనుభవాలు, హెచ్చు తగ్గులు, నష్టాలు, లాభాలతో పాటు ప్రాథమికంగా ప్రతీ దినాన్ని అంగీకరించవలసి ఉంది. మరుసటి రోజు, లేదా వారం లేదా నెలలో మనం ఏమి సాధించాలో అని ఆలోచించినప్పుడు చాలా సార్లు ఆందోళన మన హృదయాలను కలవరపరుస్తుంది. మానవ శరీరదారిగా ప్రభువైన యేసు తానే భవిష్యత్తును గురించి ఆందోళన చెందడం వ్యర్థమని స్వయంగా చెప్పాడు. ఆయన మత్తయి సువార్త 6 అధ్యాయంలో పొలంలోని పువ్వులు, గాలిలో ఎగిరే పక్షుల వైపుకు మన గమనాన్ని తీసుకొనివెళ్ళాడు. ఆందోళన లేదు, కష్టపడటం లేదు, జీవించడానికి వాటికి అనుగ్రహించబడిన జీవితాలను జీవించడమే. మెసేజ్ అనువాదంలో 1 పేతురు 5:7 ఇలా చెపుతుంది, “దేవుని ముందు స్వేచ్చగా జీవించండి, ఆయన మీ విషయంలో చాలా శ్రద్ధ కలిగి యుంటాడు.” ఇది ఎంత ప్రోత్సాహకరమైన మాట! – స్వేచ్చగా జీవించడానికి అనుమతించబడడం, ఈ లోక సంబంధ భారాలను మన భుజాలమీద మొయ్యకపోవడం. ప్రతీ దినం దేవుడు మనకు ముందుగా వెళ్ళాడనీ, ఆయన మనలను మోస్తున్నాడనే దృఢమైన విశ్వాసంతో దినాన్ని ఆరంభించడానికి ఇది మనం సహాయం చేస్తుంది. మరుసటి దినం ఎంత బెదురు పుట్టించేదిగా కనిపించినప్పటికీ ఆయన మనలను చూసుకుంటాడనే సామాన్య విశ్వాసంతో ప్రతిరోజూ ముగించడానికి ఇది మనకు సహాయపడాలి, ఎందుకంటే సమయానికి అతీతంగా ఆయన ఉనికి కలిగియున్న్నాడు, ఆయనకు సమస్తమూ తెలుసు. అంటే నాకు ఎదురయ్యే వాటిని నిర్వహించడానికి ఆయన నాకు జ్ఞానం అనుగ్రహిస్తాడు. అడ్డంకులను అధిగమించడానికి బలం, సంపూర్ణంగా ముగించడానికి తగిన ఓర్పునూ ఇస్తాడు. ఒక్క సమయంలో ఒక్క రోజును తీసుకోవడంలో మనం ఏవిధంగా ఉండాలో నేర్చుకుంటాము, మనం కలిగియున్న ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తాము. ఆందోళన మన జీవితాలను స్వాధీనం చేసుకున్నప్పుడు, మన జీవితంలో అల్లుకుపోయిన ఆ సాధారణ ఆనందాలను మనం కోల్పోతాము, మనం భౌతికంగా ఉనికి కలిగిఉంటాము, అయితే మన చుట్టూ ఉన్నవారి జీవితాల నుండి మానసికంగా దూరంగా ఉంటాము.
సంబంధాలు దెబ్బతింటాయి, ఫలితంగా మన ఆరోగ్యం తరచుగా క్షీణిస్తుంది. మీ కిటికీని దాటి ఎగిరిపోతున్న పక్షుల చిత్రాన్ని గానీ లేదా మీ తోటలో అందంగా పెరుగుతున్న పువ్వులను చూస్తున్నట్టున్న దృశ్యాన్ని మీ మనస్సులోనికి తెచ్చుకోండి, మీ జీవితంలోని ప్రతీ క్షణాన్ని అస్వాదించేలా మిమ్మల్ని మీరు అనుమతించండి. ప్రతీ దినం మరొకరిని ఆశీర్వదించడానికీ లేదా వారిని ప్రోత్సహించడానికి యెంచుకోండి. మనం జీవించడానికి ఒక జీవితాన్ని కలిగియున్నాము. ఆ జీవితాన్ని ఏవిధంగా జీవించగలమో అనేది మన మీద ఆధారపడి ఉంది. మనం ఆ జీవితాన్ని ఎలా గడుపుతామో అది మనకు తెలుసు. ఆందోళన అనేది మార్గానికి అంతం కాదు. ఇది ఒక చిన్న ప్రక్కతోవ, ప్రతిరోజూ మీరు మరుసటి రోజు ఏమి చేయాలో సిద్ధపడకుండా ఉన్నట్లయితే అది మిమ్మల్ని మీ జీవిత రహదారి మీదకు తీసుకువెళుతుంది. మిమ్మల్ని మీరు వేగం తగ్గించుకొని ప్రతీ దినాన్ని ఆస్వాదించడానికి సిద్ధపడుతున్నారా?
ప్రార్థన:
ప్రియమైన ప్రభువా,
నేను మేల్కొన్న ప్రతి దినం కోసం నీకు కృతజ్ఞతలు. జీవితం, ఆరోగ్యం, బలం కోసం నీకు వందనాలు. ఈ రోజును దాని పూర్తి సామర్థ్యంతో ఆస్వాదించడానికి నాకు సహాయం చెయ్యండి - రేపటి గురించిన చింతలను తొలగించి, దానికి బదులుగా నన్ను విశ్వాసంతో నింపండి.
యేసు నామంలో
ఆమేన్
About this Plan
ఆందోళన అన్ని విధాలుగా మనలను బలహీనపరుస్తుంది, ఎందుకంటే ఇది మన సమతుల్యతను చెదరగొడుతుంది, భయంలో మనలను బంధిస్తుంది. ఇది కథకు ముగింపు కాదు, ఎందుకంటే పోరాటాన్ని అధిగమించడానికి మనం యేసులో స్వేచ్ఛనూ, కృపనూ కలిగియున్నాము. మనం దానిని కేవలం అధిగమించడం మాత్రమే కాదు, కాదు కాని దాని విషయంలో శ్రేష్ఠమైన వారంగా చెయ్యబడతాము, దేవుని వాక్యం కోసం, నిరంతరం మనలను ధైర్యపరచే ఆయన సన్నిధి కోసం కృతజ్ఞతలు తెలుపుతున్నాము.
More