ఆందోళనను దాని విధానాలలోనే ఓడించడంSample
రెండు-వైపుల విధానం
న్యూ లివింగ్ అనువాదం బైబిలు ఫిలిప్పీయులు 4 అధ్యాయం 6 వచనం “దేని గురించి చింతించకండి, ప్రతీ దానిని గురించి ప్రార్థించండి” అని చెపుతుంది.
ఎంత ఖచ్చితమైన ఆజ్ఞ! దీనిలో ఎటువంటి అస్పష్టత లేదు. అయినా దీనిని అనుసరించడంలో ఇంకా ఎందుకు చాలా కష్టం? ఆందోళనతో కూడిన పోరాటం ఇది మన హృదయాలనూ, మనస్సులనూ పరుగు పెట్టిస్తుంది. అంటే మనం ఆలోచిస్తున్నదీ, విశ్లేషిస్తున్నదీ మన ప్రస్తుత పరిస్థితుల అవసరాలను మించిపోయింది. ఈ కారణం చేత అపొస్తలుడైన పౌలు అదే అధ్యాయంలోని 8 వ వచనంలో ఫిలిప్పీయులు, “ఏవి నిజమైనవో, ఏవి మాననీయమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి శుద్ధమైనవో, ఏవి అందమైనవో, ఏవి మంచిపేరు గలవో – శ్రేష్ఠమైనవేవైనా, మెప్పుకు తగినవేవైనా ఉంటే – అలాంటి వాటి మీద ధ్యాన ముంచాలని” చెపుతున్నాడు. సంతృప్తితో నిండియుండే ప్రపంచంలో నివసించే మనం సుదీర్ఘ కాలం నిజంగా ముఖ్యమైన వాటిమీద దృష్టి పెట్టడం అవసరం. అవసరమైతే, మన ఆలోచనలను పవిత్ర పరచాలి. మన ఆలోచనలను పవిత్రపరచడం అంటే ఉద్దేశపూర్వకంగానూ, సిగ్గుపడకుండా ప్రతికూలంగానూ, భయపరచేవిగానూ, ఆందోళనకు గురిచేసివిగానూ ఉన్న తలంపులను బయటకు నెట్టి, సత్యం, గౌరవం, పవిత్రతతో కూడిన ఆలోచనలతో వాటిని మార్పు చెయ్యడం అని అర్థం. అయితే ఇక్కడ సవాలు ఉంది – మార్పు చెయ్యడం అంత ఖచ్చితంగా లేదు. ప్రతికూల ఆలోచనలను కనుగొని వాటిని సంతోషకరమైన ఆలోచనలతో భర్తీ చేయడానికి మనం కంప్యూటర్ల వలె నిర్దేశించబడలేదు. కాబట్టి ముందుకు వెళ్ళే మార్గం ఏమిటి? పరిష్కారం ఉందా? అవును ఇది స్తుతితో ప్రారంభమవుతుంది. మన ఆలోచనల సుడిగుండం నుండి మనం బయటకు రావాలి. మనం దేవుణ్ణి స్తుతించాలి. ఆయన ఎవరో, ఆయన ఏమి చేసాడో, ఆయన ఏమి చేస్తానని వాగ్దానం చేసాడో వాటన్నిటిని గురించి మనం స్తుతించాలి, మన పట్ల ఆయనకున్న శాశ్వత ప్రేమ కోసం దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించాలి. వాటిలో కొన్నింటిని గుర్తించడం ఆరంభించాలి. స్తుతి అంటే మన విషయాల నుండి దేవుని వైపుకు ఉద్దేశపూర్వకంగా దృష్టి నిలపడమే. భారభరితమైనా, చీకటి పరిస్థితులనుండి నిరీక్షణ, ఆనందంతో కూడిన స్థితిలోనికి స్తుతి మారుస్తుంది. స్తుతి మన జీవిత సింహాసనంమీదకు దేవుణ్ణి సరైన స్థానంలో ఉంచుతుంది. మనం అనుమతించిన అనారోగ్య ప్రత్యామ్నాయాలను స్థానభ్రంశం చేస్తుంది.
స్తుతి తరువాత ప్రార్థన కొనసాగుతుంది. నిన్నటి దినం ధ్యానంలో మనం ప్రస్తావించిన విధంగా అప్పగించడం జరుగుతుంది. ఈ ప్రార్థన మన ఆందోళనలను సంపూర్ణంగా సమర్థుడైన దేవుని చేతుల్లోకి సమర్పిస్తుంది. ఆయన సర్వ శక్తివంతడు, సమస్తమూ యెరిగినవాడు. ఒకే సమయంలో అన్ని చోట్లా ఉండేవాడు. మన భారాలతో ఆద్భుతమైన ఈ రక్షకుని మీద ఆధారపడడం శ్రేష్ఠమైన అనుభవం. తీవ్రమైన ఆందోళనతో కూడిన సమయంలో ఉన్నప్పుడు ఆందోళనలను నేరుగా ప్రార్థనలుగా మార్చడం చాలా ప్రాముఖ్యం. దేవుడు మన భయాలను పరిష్కరించగలడు, ఆయన నిజంగా చేయగలడు.
పరిశుద్ధాత్మ ఆలోచన కర్త అని పిలువబడ్డాడు. ఎందుకంటే ఈ ప్రార్థన సమయాలలో ఆయన మీకు ఆదరణ ఇస్తాడు. ఆయన తన వాక్కుతో నడిపింపును ఇస్తాడు. మీరు ఏమనుకుంటున్నారో దానికి విరుద్ధంగా, మీరు ఒంటరిగా లేరు, మీరు సహాయానికి మించినవారు కాదు, మీ మానసిక ఆరోగ్యానికి చాలా ప్రాముఖ్యత ఉంది. స్తుతి, ప్రార్థనలతో మన మనస్సులనూ, హృదయాలనూ పునర్వినియోగం చేసుకొంటున్నప్పుడు మన ఆత్మను శుద్ధి చెయ్యడానికీ, మన అంతరంగంలో మనలను నూతన పరచడానికీ ఘనమైన, ప్రశంసనీయమైన, సత్యమైన ఆలోచనలను అనుమతించడం ప్రారంభిస్తాము. ఆందోళనతో యుద్ధం చెయ్యడానికీ, అది ఎక్కడినుండి వచ్చిందో అక్కడికి పంపించివెయ్యడానికీ ఈ రెండు వైపుల విధానానికి మీరు సిద్ధంగా ఉన్నారా?
ప్రార్థన:
ప్రియమైన ప్రభువా,
ఇంత నమ్మదగిన దేవుడిగా ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కాలం ఆరంభం కావడానికి ముందు నుండి నన్ను ప్రేమించావు. నా కోసం చనిపోవడానికి నీ ఏకైక కుమారుడు ప్రభువైన యేసును పంపించడంలో నీవు చూపిన దాదృత్వం కోసం వందనాలు. నన్ను ఎన్నడూ విడిచిపెట్టకుండా ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు. నా ఆందోళనమీద విజయం పొందేలా, నా జీవితంలోనూ, నా జీవితం ద్వారానూ నీవు మహిమపరచబడాలని చూడటానికి నాకు సహాయం చేయాలని నేను కోరుతున్నాను.
తండ్రీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను.
యేసు నామంలో
ఆమేన్.
About this Plan
ఆందోళన అన్ని విధాలుగా మనలను బలహీనపరుస్తుంది, ఎందుకంటే ఇది మన సమతుల్యతను చెదరగొడుతుంది, భయంలో మనలను బంధిస్తుంది. ఇది కథకు ముగింపు కాదు, ఎందుకంటే పోరాటాన్ని అధిగమించడానికి మనం యేసులో స్వేచ్ఛనూ, కృపనూ కలిగియున్నాము. మనం దానిని కేవలం అధిగమించడం మాత్రమే కాదు, కాదు కాని దాని విషయంలో శ్రేష్ఠమైన వారంగా చెయ్యబడతాము, దేవుని వాక్యం కోసం, నిరంతరం మనలను ధైర్యపరచే ఆయన సన్నిధి కోసం కృతజ్ఞతలు తెలుపుతున్నాము.
More