శరీరేచ్చ శోధన నదిగమించుట Sample
చీపురు విధానంలో లైంగిక దృశ్యాల శోధన నధిగమించుట
నా భాషలో చీపురు అనేది తీర్పుకు సూచనగా వుంది తమిళ భాషలో బాగా విసికించే ఒకడికి ఇది వాడతారు చీపురు కట్టతో కొట్టాలి నిన్నుఅంటారు. దేవుడు తన బిడ్డల మూర్ఖ ప్రవర్తనకు నిజంగా చాలా సార్లు కోపగిస్తాడు. 78వ కీర్తనలో ఇలాంటి ఒక సన్నివేశం మనం చదవగలం. వారి కడుపులు నిండకముందే వారు తిన్నది ఇంకా వారి నోటిలోనే వుండగా దేవుని కోపం వారి మీద సముద్రపు గొప్ప అల వలే విరుచుకుపడి వారిలో బలవంతులైన వారిని ధైర్యవంతులైన వారిని మింగివేసిందనే విషయాలను [29 -32] వచనాలలో మనం చదువుతాం. ఇంకా వారి నోటిలోనే ఆ ఆహారం వున్నపుడు అది వారి కడుపులోనికి వెళ్ళడం కూడా దేవుని కిష్టం లేదు ఆ విధంగా దేవుని సహనం నశించిపోయింది. దేవుడు వారిలో ఎన్నో మార్పులు తీసుకొచ్చాడు కానీ చివరికి ఈ విధంగా తీర్పు చర్యలకు పూనుకొన్నాడు. చీపురు విధానంలో తన తీర్పును నిర్ణయించాడు. తమ దేహాలను ఎవరైతే నిర్మించారో అట్టి తమ సృష్టికర్తను గూర్చి వారు ఆలోచించకుండా తమ దురాశలనే తీర్చుకొన్న యవనస్తులను దేవుడు కూల్చివేసాడు. వారు తినడం అనే పాపంలో ఉండగానే ఆ ఆహారాన్ని వారు తినకుండానే మరణించారు. సరిగ్గా ఇలాగె మనం ఈ లైంగిక అపవిత్ర శోధనలో కొనసాగితే దేవుడు మనతో కూడా ఇలాగే వ్యవహరిస్తాడు. ఒకవేళ దేవుడు అల చెయ్యడం లేదు అంటే మనం చేసేది సరైనది అని కాదు. ఆయన మనకు పశ్చాత్తాపపడడానికి తరుణాలిస్తున్నాడు [2 పేతురు 3 : 9] మనం అశీల దృశ్యాల [ లైంగిక అపవిత్ర] కార్యాల్లో వుంటే, ఆయన మనలను కొట్టడానికి నిర్ణయించుకోవచ్చు. మనం అశీల దృశ్యాల [లైంగిక అపవిత్ర] శోధన నురుగులో పడి పొర్లుతూ వుంటే, సరిగ్గా అదే అర్ధ రాత్రిలో ఆయన తిరిగి ఈ భూమిపైకి [తన సంఘం కొరకు] రావడానికి నిర్ణయించుకోవచ్చు. ఆయన దొంగ వలే వస్తానని చెప్పిన తలంపు మనల్ని పరిశుద్ధ జీవితం జీవించుటకు ప్రేరేపించాలి. పరిశుద్ధ జీవిత విధానానికి వ్యతిరేకంగా మితిమీరిన [పైత్యపు] తప్పుడు కృపా సిద్ధాంతాన్ని తీసుకొనివచ్చిన అబద్ద బోధకులు, కృపా సిద్ధాంతాన్ని పరిశుద్ధ జీవితానికి ఒక మినహాయింపుగా తీసుకొంటారు. పేతురు తన రెండవ పత్రికలో[3:10 , 11] రాసి వున్నాడు. ఇది బైబిలు సత్యానికి అనుకూలంగానే ధ్వనిస్తుంది. కొత్త నిబంధనలో ఒక ప్రీరణ మనకివ్వబడింది [1 కొరింథీ 10 : 12] పడిపోకుండా చూచుకోమని చెబుతూవుంది. “చీపురు కట్ట” తీర్పును గూర్చి తెలియజేసే అనేక కధనాలు బైబిల్లో వున్నాయి. వాటిల్లో 1 కొరింథీ 10 వ అధ్యాయంలోని వివరణ ఒకటై యుంది. ఒక్క రోజునే అనేక మంది వ్యభిచారం వలన ఆకస్మికంగా సంహరించబడ్డారని దేవుని శోధించినందున సర్పముల వలన నశించారని ఇంకా ఆయా విషయాల హెచ్చరికలు పౌలు మనకు రాస్తూ వచ్చాడు. 1 కొరింథీ [10 :7 -10].
About this Plan
అశీల దృశ్యాలను వీక్షించే శోధనను అధిగమించుటలో క్రియాశీలక విధానాలను బైబిలు నుండి కనుగొనుటలో చదువరులకు సహాయం చేస్తుంది.
More