శరీరేచ్చ శోధన నదిగమించుట Sample
సుశిక్షత/పవిత్ర విధానంలో అశీల దృశ్యాల [వీక్షణ] శోధన నధిగమించుట
2016 వ సంవత్సరం మార్చి నెలనుండి వివస్త్రలైన స్త్రీల చిత్రాలు ప్రచురించబడవు అనే పత్రికా ప్రకటన నొకటి ప్లే బాయ్ అనే పత్రికలో చూసాను. ఈ సమాచారాన్ని దక్కను క్రానికల్[అక్టోబర్13, 2015] భారతీయ వార్తా పత్రిక నుండి సేకరించాను. ఈ నిర్ణయం వెనుకగల కారణాన్నిఆ కంపెనీ ప్రధానాధికారి తెలియజేస్తూ వచ్చాడు. “యుద్ద పోరాటం గెలుపొంది ముగిసింది” ఊహించగల ప్రతి లైంగికచర్యకు నీకు మధ్య దూరం ఒక్క క్లిక్ మాత్రమే. “కాబట్టి ఈ పరిస్థితిలో కేవలం ఇదిలా దాటించబడింది” ఆన్ లైన్ ద్వారానైనట్టి లైంగిక శోధన ఎంత శక్తివంతమైనదో ఈవాంగ్మూలం తెలియజేస్తుంది. అది ఒక్క క్లిక్ దూరం మాత్రమే. వైర్డ్ ఫర్ ఇంటిమసి అనే తన గ్రంధంలో లైంగిక పాపం పురుషుడి మెదడును ఏ విధంగా అడ్డగించి అపహరిస్తుందో విలియం స్త్రూతర్ రచిస్తూ, సులభంగా వినియోగించగలుగుట, వెచ్చించ గలుగుట మరియు అస్పష్టత అనే ఈ మూడు ప్రత్యేకంగా ఆన్ లైన్ శృంగార శోధనను జయించడాన్నిఎంతో కష్టతరం చేసాయి అనే విషయాన్నిచర్చించాడు.
సర్వ జనీనమైనట్టి ఈ సమస్యకు పరిష్కారం ఒకటి చూపించమని తెరిచిన బైబిలు చేత పట్టుకొని దేవుని సన్నిధికి వెళ్లాను. గేయ [ప్రాస] రూపకమైనట్టి మూడు పదాలను దేవుడు నాకిచ్చాడు. ఇవి అపవిత్రమైన మురికి చిత్రాలను వీక్షించే శోధనను/అలవాటును జయించడంలో సహయకరం కాగలవు. నేటి మన ధ్యానంలో ఈ మొదటి మాటను మీకు తెలియజేస్తాను “ [గ్రూమ్]పెండ్లికొడుకు .
లైంగిక చిత్రాల శోధనను జయించడానికి మొదటి మెట్టు: మన కొరకు రక్తం చిందించి సిలువలో మరణించింన పెండ్లికుమారుడైన యేసు ప్రేమలో జీవించడం, మత్తయి 25:1- 13 వచనాల భాగం యేసును మనకు పెండ్లి కుమారుడుగా చూపుతూ వుంది. యేసుకు పెండ్లి కుమార్తెయైన మనం అంతకంతకూ ఆయన ప్రేమలో మునిగి పోవాలి. [ప్రకటన 2 : 4] మనం మన మొదటి ప్రేమను ఎప్పటికీ విడువకూడదు. ఆయన అద్భుత ముఖార విందాన్ని చూడడంలో మనం పూర్తిగా ఆనందించేవారమై వుండాలి. ఈ విధంగా మనం చేసినపుడు లైంగిక అశీల దృశ్యాల శోధనతో పాటుగా ఇతర లౌకిక విషయాలన్నీఆశ్చర్యకరంగా మసకబారి పోతాయి. మనం మన ప్రేమను యేసు ఎడల ప్రకటించినపుడు ఆయన ఆజ్ఞలకు సహజంగా విధేయత చూపగలం. బైబిలు పలుమార్లు ఈ విషయాన్ని మనకు బోధిస్తూ వుంది [యోహాను 14 : 15, 23] యేసును బహుగా మనం ప్రేమించినట్టయితే సునాయాసంగా లైంగిక అపవిత్ర /అశీల దృశ్యాల శోధనను తప్పించుకోగలం. మనం ఉద్దేశ్య పూర్వకంగా ఏసుకు వ్యతిరేకంగా పాపం చేయడం జరిగితే, ఆ జాబితా లో అశీల దృశ్యాలను వీక్షించడానికి బుద్ధిపూర్వకంగా కొంత సమయాన్ని కేటాయించడం కూడా ఒక పాపమై యుండగలదు. ఇది ఆయన రక్తాన్ని తొక్కడం వంటిదే, ఆయన ప్రేమను త్రోసిపుచ్చడమే అవుతుంది. [హెబ్రీ 10 : 26 – 29]. యేసు మన పెండ్లి కుమారుడైన చిత్రం మనం అశీల దృశ్యాల వీక్షణను వద్దు, వద్దు అని చెప్పడానికి మనలను బలపరుస్తుంది.
About this Plan
అశీల దృశ్యాలను వీక్షించే శోధనను అధిగమించుటలో క్రియాశీలక విధానాలను బైబిలు నుండి కనుగొనుటలో చదువరులకు సహాయం చేస్తుంది.
More