YouVersion Logo
Search Icon

కీర్తనలు 95

95
1రండి యెహోవానుగూర్చి ఉత్సాహధ్వనిచేయు
దము
మన రక్షణ దుర్గమునుబట్టి సంతోషగానముచేయు
దము
2కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చెదము
కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము
చేయుదము.
3యెహోవా మహా దేవుడు
దేవతలందరికి పైన మహాత్మ్యముగల మహారాజు
4భూమ్యగాధస్థలములు ఆయన చేతిలోనున్నవి
పర్వతశిఖరములు ఆయనవే.
5సముద్రము ఆయనది ఆయన దాని కలుగజేసెను
ఆయన హస్తములు భూమిని నిర్మించెను.
6ఆయన మన దేవుడు
మనము ఆయన పాలించు ప్రజలము ఆయన మేపు
గొఱ్ఱెలము.
7రండి నమస్కారము చేసి సాగిలపడుదము
మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించు
దము
నేడు మీరు ఆయన మాట నంగీకరించినయెడల ఎంత
మేలు.
8అరణ్యమందు మెరీబాయొద్ద మీరు కఠినపరచుకొని
నట్లు
మస్సాదినమందు మీరు కఠినపరచుకొనినట్లు
మీ హృదయములను కఠినపరచుకొనకుడి.
9అచ్చట మీపితరులు నన్ను పరీక్షించి శోధించి నా
కార్యములు చూచిరి
10నలువది ఏండ్లకాలము ఆ తరమువారివలన నేను విసికి
–వారు హృదయమున తప్పిపోవు ప్రజలువారు నా మార్గములు తెలిసికొనలేదని అనుకొంటిని.
11కావున నేను కోపించి–వీరెన్నడును నా విశ్రాంతిలో
ప్రవేశింపకూడదని ప్రమాణము చేసితిని.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in