కీర్తనలు 78
78
ఆసాపు కీర్తన. దైవధ్యానము.
1నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి
నా నోటిమాటలకు చెవియొగ్గుడి
2నేను నోరు తెరచి ఉపమానము చెప్పెదను
పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియ
జెప్పెదను.
3మాకు తెలిసిన సంగతులను
మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను.
4యెహోవా స్తోత్రార్హక్రియలను
ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్యకార్య
ములను దాచకుండ
వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము.
5రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాని నెరుగు
నట్లునువారు లేచి తమ పిల్లలకు దానిని వివరించునట్లును
వీరును దేవునియందు నిరీక్షణగలవారై దేవుని క్రియ
లను మరువకయుండి
6యథార్థహృదయులు కాక దేవుని విషయమై స్థిర
మనస్సులేనివారై తమపితరులవలె తిరుగబడకయు
7మూర్ఖతయు తిరుగుబాటునుగల ఆ తరమును పోలి
యుండకయువారు ఆయన ఆజ్ఞలను గైకొనునట్లును
8ఆయన యాకోబు సంతతికి శాసనములను నియ
మించెను
ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రము ననుగ్రహించెను
మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలెననివారికాజ్ఞాపించెను
9విండ్లను పట్టుకొని యుద్ధసన్నద్ధులైన ఎఫ్రాయిము
సంతతివారు యుద్ధకాలమున వెనుకకు తిరిగిరి
10వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి
ఆయన ధర్మశాస్త్రము ననుసరింపనొల్లకపోయిరి
11ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య
క్రియలను వారు మరచిపోయిరి.
12ఐగుప్తుదేశములోని సోయను క్షేత్రమందు వారి
పితరులు చూచుచుండగా
ఆయన ఆశ్చర్యకార్యములను చేసెను.
13ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను
ఆయన నీటిని రాశిగా నిలిపెను
14పగటివేళ మేఘములోనుండియు
రాత్రి అంతయు అగ్నిప్రకాశములోనుండియు
ఆయన వారికి త్రోవ చూపెను
15అరణ్యములో ఆయన బండలు చీల్చి
సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను.
16బండలోనుండి ఆయన నీటికాలువలు రప్పించెను
నదులవలె నీళ్లు ప్రవహింపజేసెను.
17అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకను
పాపముచేయుచునే వచ్చిరి
అడవిలో మహోన్నతుని మీద తిరుగబడిరి.
18వారు తమ ఆశకొలది ఆహారము నడుగుచు
తమ హృదయములలో దేవుని శోధించిరి.
19ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచ గలడా
యనుచువారు దేవునికి విరోధముగా మాటలాడిరి.
20ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను
నీళ్లు కాలువలై పారెను.
ఆయన ఆహారము ఇయ్యగలడా?
ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా?
అని వారు చెప్పుకొనిరి.
21యెహోవా ఈ మాట విని కోపగించెను
యాకోబు సంతతిని దహించివేయుటకు అగ్నిరాజెను
ఇశ్రాయేలు సంతతిని హరించివేయుటకు కోపము
పుట్టెను.
22వారు దేవునియందు విశ్వాసముంచకపోయిరి.
ఆయన దయచేసిన రక్షణయందు నమ్మిక యుంచలేదు.
23అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞా
పించెను.
అంతరిక్షద్వారములను తెరచెను
24ఆహారమునకై ఆయన వారిమీద మన్నాను కురిపించెను
ఆకాశధాన్యము వారి కనుగ్రహించెను.
25దేవదూతల ఆహారము నరులు భుజించిరి
భోజనపదార్థములను ఆయన వారికి సమృద్ధిగా
పంపెను.
26ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరజేసెను
తన బలముచేత దక్షిణపు గాలి రప్పించెను.
27ధూళి అంత విస్తారముగా మాంసమును
సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలు
గల పిట్టలను ఆయన వారిమీద కురిపించెను.
28వారి దండుమధ్యను వారి నివాసస్థలములచుట్టును
ఆయన వాటిని వ్రాలజేసెను.
29వారు కడుపార తిని తనిసిరివారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను.
30వారి ఆశ తీరకమునుపే
ఆహారము ఇంక వారి నోళ్లలో నుండగానే
31దేవుని కోపము వారిమీదికి దిగెనువారిలో బలిసినవారిని ఆయన సంహరించెను
ఇశ్రాయేలులో యౌవనులను కూల్చెను.
32ఇంత జరిగినను వారు ఇంకను పాపముచేయుచు
ఆయన ఆశ్చర్యకార్యములనుబట్టి ఆయనను నమ్ముకొనక పోయిరి.
33కాబట్టి ఆయన, వారి దినములు ఊపిరివలె గడచి
పోజేసెను
వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడచిపోజేసెను.
34వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను
వెదకిరివారు తిరిగి హృదయపూర్వకముగా దేవుని బతిమాలుకొనిరి.
35దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు
మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియువారు జ్ఞాపకము చేసికొనిరి.
36అయినను వారి హృదయము ఆయనయెడల స్థిరముగానుండలేదు
ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు
37నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతిచేసిరి
తమ నాలుకలతో ఆయనయొద్ద బొంకిరి.
38అయితే ఆయన వాత్సల్యసంపూర్ణుడైవారిని నశింపజేయక వారి దోషము పరిహరించు
వాడు#78:38 మూలభాషలో–దోషమునకు ప్రాయశ్చిత్తము చేయువాడు..
తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనక
పలుమారు కోపము అణచుకొనువాడు.
39కాగా–వారు కేవలము శరీరులై యున్నారనియు
విసరి, వెళ్లి మరలి రాని గాలివలె నున్నారనియు
ఆయన జ్ఞాపకము చేసికొనెను.
40అరణ్యమునవారు ఆయనమీద ఎన్నిమారులో తిరుగబడిరి
ఎడారియందు ఆయనను ఎన్నిమారులో దుఃఖపెట్టిరి.
41మాటిమాటికి వారు దేవుని శోధించిరి
మాటిమాటికి ఇశ్రాయేలు పరిశుద్ధదేవునికి సంతాపము
కలిగించిరి.
42ఆయన బాహుబలమునైనను
విరోధులచేతిలోనుండి ఆయన తమ్మును విమోచించిన
దినమునైననువారు స్మరణకు తెచ్చుకొనలేదు.
43ఐగుప్తులో తన సూచక క్రియలను
సోయను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన
చూపిన దినమునువారు జ్ఞిప్తికి తెచ్చుకొనలేదు.
44ఐగుప్తీయులు త్రాగలేకుండ
నైలునది కాలువలను వారి ప్రవాహజలములను ఆయన రక్తముగా మార్చెను
45ఆయన వారిమీదికి జోరీగలను గుంపుగా విడిచెను
అవి వారిని తినివేసెను
కప్పలను విడిచెను అవి వారిని నాశనము చేసెను.
46ఆయన వారి పంటను చీడపురుగులకిచ్చెనువారి కష్టఫలములను మిడతలకప్పగించెను.
47వడగండ్లచేత వారి ద్రాక్షతీగెలను
హిమముచేత వారి మేడిచెట్లను ఆయన పాడు
చేసెను.
48వారి పశువులను వడగండ్ల పాలుచేసెను.వారి మందలను పిడుగుల పాలుచేసెను.
49ఆయన ఉపద్రవము కలుగజేయు దూతల సేనగా తన కోపాగ్నిని ఉగ్రతను
మహోగ్రతను శ్రమను వారిమీద విడిచెను.
50తన కోపమునకు ఆయన త్రోవ చదునుచేసెను
మరణమునుండి వారి ప్రాణమును తప్పింపకవారి జీవమును తెగులునకు అప్పగించెను.
51ఐగుప్తులోని జ్యేష్ఠులనందరిని
హాము గుడారములలోనున్న బలప్రారంభమైన#78:51 వారి బలప్రారంభము.
ప్రథమసంతానమును ఆయన సంహరించెను.
52అయితే గొఱ్ఱెలవలె ఆయన తన ప్రజలను తోడు
కొనిపోయెను
ఒకడు మందను నడిపించునట్లు అరణ్యములో ఆయనవారిని నడిపించెను
53వారు భయపడకుండ ఆయన వారిని సురక్షితముగా
నడిపించెను.వారి శత్రువులను సముద్రములో ముంచివేసెను.
54తాను ప్రతిష్ఠించిన సరిహద్దునొద్దకు
తన దక్షిణహస్తము సంపాదించిన యీ పర్వతము
నొద్దకు ఆయన వారిని రప్పించెను.
55వారియెదుటనుండి అన్యజనులను వెళ్లగొట్టెను.
కొలనూలుచేత వారి స్వాస్థ్యమును వారికి పంచి
యిచ్చెను.
ఇశ్రాయేలు గోత్రములను వారి గుడారములలో నివ
సింపజేసెను.
56అయినను వారు మహోన్నతుడైన దేవుని శోధించి
తిరుగుబాటు చేసిరి
ఆయన శాసనముల ననుసరింపకపోయిరి.
57తమపితరులవలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి
జౌకిచ్చు విల్లు పనికిరాకపోయినట్లువారు తొలగి
పోయిరి.
58వారు ఉన్నతస్థలములను కట్టి ఆయనకు కోపము
పుట్టించిరి
విగ్రహములను పెట్టుకొని ఆయనకు రోషము కలుగ
జేసిరి.
59దేవుడు దీని చూచి ఆగ్రహించి ఇశ్రాయేలునందు
బహుగా అసహ్యించుకొనెను.
60షిలోహు మందిరమును తాను మనుష్యులలో సంస్థా
పన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను.
61ఆయన తన బలమును చెరకును,
తన భూషణమైనదానిని విరోధులచేతికిని అప్పగించెను.
62తన ప్రజలను ఖడ్గమునకు అప్పగించెను.
ఆయన తన స్వాస్థ్యముమీద ఆగ్రహించెను
63అగ్ని వారి యౌవనస్థులను భక్షించెనువారి కన్యకలకు పెండ్లిపాటలు లేకపోయెను.
64వారి యాజకులు కత్తిపాలుకాగావారి విధవరాండ్రు రోదనము చేయకుండిరి.
65అప్పుడు నిద్రనుండి మేల్కొను ఒకనివలెను
మద్యవశుడై ఆర్భటించు పరాక్రమశాలివలెను
ప్రభువు మేల్కొనెను.
66ఆయన తన విరోధులను వెనుకకు తరిమికొట్టెను
నిత్యమైన నింద వారికి కలుగజేసెను.
67పిమ్మట ఆయన యోసేపు గుడారమును అసహ్యించు కొనెను
ఎఫ్రాయిము గోత్రమును కోరుకొనలేదు.
68యూదా గోత్రమును తాను ప్రేమించిన సీయోను
పర్వతమును
ఆయన కోరుకొనెను.
69తాను అంతరిక్షమును కట్టినట్లు
తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు
ఆయన తన పరిశుద్ధమందిరమును కట్టించెను
70తన దాసుడైన దావీదును కోరుకొని
గొఱ్ఱెల దొడ్లలోనుండి అతని పిలిపించెను.
71పాడిగొఱ్ఱెలను వెంబడించుట మాన్పించి
తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రా
యేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను.
72అతడు యథార్థహృదయుడై వారిని పాలించెను
కార్యములయందు నేర్పరియై వారిని నడిపించెను.
Currently Selected:
కీర్తనలు 78: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.