YouVersion Logo
Search Icon

కీర్తనలు 77

77
ప్రధానగాయకునికి. యెదూతూను అను రాగముమీద పాడదగినది. ఆసాపు కీర్తన.
1నేను ఎలుగెత్తి దేవునికి మొఱ్ఱపెట్టుదును ఆయనకు
మనవి చేయుదును
దేవుడు నాకు చెవియొగ్గువరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును.
2నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెదకితిని
రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండ చాప
బడియున్నది.
నా ప్రాణము ఓదార్పు పొందనొల్లక యున్నది.
3దేవుని జ్ఞాపకము చేసికొనునప్పుడు నేను నిట్టూర్పు
విడుచుచున్నాను
నేను ధ్యానించునప్పుడు నా ఆత్మ క్రుంగిపోవుచున్నది (సెలా.)
4నీవు నా కన్నులు మూతపడనీయవు.
నేను కలవరపడుచు మాటలాడలేక యున్నాను.
5తొల్లిటి దినములను, పూర్వకాల సంవత్సరములను
నేను మనస్సునకు తెచ్చుకొందును.
6నేను పాడిన పాట రాత్రియందు జ్ఞాపకము చేసి
కొందును
హృదయమున ధ్యానించుకొందును.
దేవా, నా ఆత్మ నీ తీర్పుమార్గము శ్రద్ధగా వెదకెను.
7ప్రభువు నిత్యము విడనాడునా?
ఆయన ఇకెన్నడును కటాక్షింపడా?
8ఆయన కృప ఎన్నటికిలేకుండ మానిపోయెనా?
ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పి
పోయెనా?
9దేవుడు కటాక్షింప మానెనా?
ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా? (సెలా.)
10అందుకు–నేనీలాగు అనుకొనుచున్నాను
మహోన్నతుని దక్షిణహస్తము మార్పునొందెననుకొను
టకు నాకు కలిగినశ్రమయే కారణము.
11యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ
ఆశ్చర్యకార్యములను
నేను మనస్సునకు తెచ్చుకొందును
12నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును
నీ క్రియలను నేను ధ్యానించుకొందును.
13దేవా, నీమార్గము పరిశుద్ధమైనది.
దేవునివంటి మహా దేవుడు ఎక్కడనున్నాడు?
14ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే
జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని
యున్నావు.
15నీ బాహుబలమువలన యాకోబు యోసేపుల సంతతి
వారగు నీ ప్రజలను నీవు విమోచించియున్నావు.
16దేవా, జలములు నిన్ను చూచెను
జలములు నిన్ను చూచి దిగులుపడెను
అగాధజలములు గజగజలాడెను.
17మేఘరాసులు నీళ్లు దిమ్మరించెను. అంతరిక్షము
ఘోషించెను.
నీ బాణములు నలుదిక్కుల పారెను.
18నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను
మెరుపులు లోకమును ప్రకాశింపజేసెను
భూమి వణకి కంపించెను.
19నీ మార్గము సముద్రములో నుండెను.
నీ త్రోవలు మహా జలములలో ఉండెను.
నీ యడుగుజాడలు గుర్తింపబడక యుండెను.
20మోషే అహరోనులచేత నీ ప్రజలను మందవలె నడి
పించితివి.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in