YouVersion Logo
Search Icon

కీర్తనలు 76

76
ప్రధానగాయకునికి. తంతివాద్యములతో పాడదగినది. ఆసాపు కీర్తన. గీతము.
1యూదాలో దేవుడు ప్రసిద్ధుడు
ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది.
2షాలేములో ఆయన గుడారమున్నది
సీయోనులో ఆయన ఆలయమున్నది.
3అక్కడ వింటి అగ్ని బాణములను
కేడెములను కత్తులను యుద్ధాయుధములను ఆయన
విరుగగొట్టెను. (సెలా.)
4దుష్టమృగములుండు పర్వతముల సౌందర్యముకంటె
నీవు అధిక తేజస్సుగలవాడవు.
5కఠినహృదయులు#76:5 లేక, గుండె దిట్టరులు. దోచుకొనబడి యున్నారువారు నిద్రనొంది యున్నారు
పరాక్రమశాలులందరి బాహుబలము హరించెను.
6యాకోబు దేవా, నీ గద్దింపునకు
రథసారథులకును గుఱ్ఱములకును గాఢనిద్ర కలిగెను.
7నీవు, నీవే భయంకరుడవు
నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలువగలవాడెవడు?
8నీవు తీర్చిన తీర్పు ఆకాశములోనుండి వినబడజేసితివి
9దేశములో శ్రమనొందిన వారినందరిని రక్షించుటకై
న్యాయపుతీర్పునకు దేవుడు లేచినప్పుడు
భూమి భయపడి ఊరకుండెను. (సెలా.)
10నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును
ఆగ్రహశేషమును నీవు ధరించుకొందువు.
11మీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొని మీ
మ్రొక్కుబడులను చెల్లించుడి
ఆయన చుట్టునున్నవారందరు భయంకరుడగు
ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలెను.
12అధికారుల పొగరును ఆయన అణచివేయువాడు
భూరాజులకు ఆయన భీకరుడు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for కీర్తనలు 76