YouVersion Logo
Search Icon

కీర్తనలు 79

79
ఆసాపు కీర్తన.
1దేవా, అన్యజనులు నీ స్వాస్థ్యములోనికి చొరబడియున్నారువారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరచియున్నారు
యెరూషలేమును పాడుదిబ్బలుగా చేసియున్నారు.
2వారు నీ సేవకుల కళేబరములను ఆకాశపక్షులకు ఎరగాను
నీ భక్తుల శవములను భూజంతువులకు
ఆహారముగాను పారవేసి యున్నారు.
3ఒకడు నీళ్లుపోసినట్లు యెరూషలేముచుట్టు వారి
రక్తము పారబోసియున్నారువారిని పాతిపెట్టువారెవరును లేరు.
4మా పొరుగువారికి మేము అసహ్యులమైతిమి
మా చుట్టునున్నవారు మమ్ము నపహసించి యెగతాళి చేసెదరు.
5యెహోవా, ఎంతవరకు కోపపడుదువు?
ఎల్లప్పుడును కోపపడుదువా?
నీ రోషము అగ్నివలె ఎల్లప్పుడును మండునా?
6నిన్నెరుగని అన్యజనులమీదను
నీ నామమునుబట్టి ప్రార్థనచేయని రాజ్యములమీదను
నీ ఉగ్రతను కుమ్మరించుము.
7వారు యాకోబు సంతతిని మ్రింగివేసియున్నారువారి నివాసమును పాడుచేసియున్నారు
8మేము బహుగా క్రుంగియున్నాము.
మా పూర్వుల దోషములు జ్ఞాపకము చేసికొని
నీవు మామీద కోపముగా నుండకుము
నీ వాత్సల్యము త్వరగా మమ్ము నెదుర్కొననిమ్ము
9మా రక్షణకర్తవగు దేవా, నీ నామప్రభావమునుబట్టి
మాకు సహాయముచేయుము
నీ నామమునుబట్టి మా పాపములను పరిహరించి
మమ్మును రక్షింపుము.
10–వారి దేవుడెక్కడ నున్నాడని అన్యజనులు పలుక
నేల?
మేము చూచుచుండగా ఓర్చబడిన నీ సేవకుల రక్త
మునుగూర్చిన ప్రతి దండన జరిగినట్లు
అన్యజనులకు తెలియబడనిమ్ము.
11చెరలోనున్నవాని నిట్టూర్పు నీ సన్నిధికి రానిమ్ము
నీ బాహుబలాతిశయమును చూపుము
చావునకు విధింపబడినవారిని కాపాడుము.
12ప్రభువా, మా పొరుగువారు నిన్ను నిందించిన నిందకు
ప్రతిగా
వారి యెదలోనికి ఏడంతలు నిందను కలుగజేయుము.
13అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొఱ్ఱెలమునైన
మేము
సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదము
తరతరములవరకు నీ కీర్తిని ప్రచురపరచెదము.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for కీర్తనలు 79