YouVersion Logo
Search Icon

కీర్తనలు 74

74
ఆసాపు కీర్తన. దైవధ్యానము.
1దేవా, నీవు నిత్యము మమ్మును విడనాడితివేమి?
నీవు మేపు గొఱ్ఱెలమీద నీ కోపము పొగరాజు
చున్నదేమి?
2నీ స్వాస్థ్య గోత్రమును నీవు పూర్వము సంపా
దించుకొని విమోచించిన నీ సమాజమును జ్ఞాపక
మునకు తెచ్చుకొనుము.
నీవు నివసించు ఈ సీయోను పర్వతమును జ్ఞాపక
మునకు తెచ్చుకొనుము.
3శత్రువులు పరిశుద్ధ స్థలములోనున్న సమస్తమును
పాడుచేసియున్నారు
నిత్యము పాడైయుండు చోట్లకు విజయము
చేయుము.
4నీ ప్రత్యక్షపు గుడారములో నీ విరోధులు ఆర్భటించుచున్నారు
విజయధ్వజములని తమ ధ్వజములను వారెత్తియున్నారు
5దట్టమైన చెట్ల గుబురుమీద జనులు గొడ్డండ్ల నెత్తి
నట్లుగా వారు కనబడుదురు
6ఇప్పుడే వారు గొడ్డళ్లను సమ్మెటలను చేతపట్టుకొని
దాని విచిత్రమైన పనిని బొత్తిగా విరుగగొట్టుదురు.
7నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించుదురు
నీ నామమందిరమును నేల పడగొట్టి అపవిత్ర పరచు
దురు.
8–దేవుని మందిరములను బొత్తిగా అణగద్రొక్కుద
మనుకొని
దేశములోని వాటినన్నిటిని వారు కాల్చియున్నారు.
9సూచకక్రియలు మాకు కనబడుటలేదు, ఇకను
ప్రవక్తయు లేకపోయెను.
ఇది ఎంతకాలము జరుగునో దాని నెరిగినవాడు
మాలో ఎవడును లేడు.
10దేవా, విరోధులు ఎందాక నిందింతురు?
శత్రువులు నీ నామమును నిత్యము దూషింతురా?
11నీ హస్తమును నీ దక్షిణహస్తమును నీవెందుకు ముడుచు
కొని యున్నావు?
నీ రొమ్ములోనుండి దాని తీసి వారిని నిర్మూలము
చేయుము.
12పురాతనకాలము మొదలుకొని దేవుడు నా రాజై
యున్నాడు
దేశములో మహారక్షణ కలుగజేయువాడు ఆయనే.
13నీ బలముచేత సముద్రమును పాయలుగా చేసితివి
జలములలో భుజంగముల శిరస్సులను నీవు పగుల
గొట్టితివి.
14మకరముయొక్క శిరస్సును నీవు ముక్కలుగా గొట్టి
తివి
అరణ్యవాసులకు దానిని ఆహారముగా ఇచ్చితివి.
15బుగ్గలను నదులను పుట్టించితివి
నిత్యము ప్రవహించు నదులను నీవు ఇంక జేసితివి
16పగలు నీదే రాత్రి నీదే
సూర్యచంద్రులను నీవే నిర్మించితివి.
17భూమికి సరిహద్దులను నియమించినవాడవు నీవే
వేసవికాలము చలికాలము నీవే కలుగజేసితివి.
18యెహోవా, శత్రువులు నిన్ను దూషణచేయుటను
అవివేక ప్రజలు నీ నామమును దూషించుటను
మనస్సునకు తెచ్చుకొనుము.
19దుష్టమృగమునకు నీ గువ్వయొక్క ప్రాణము నప్ప
గింపకుము
శ్రమనొందు నీవారిని నిత్యము మరువకుము.
20లోకములోనున్న చీకటిగల చోటులు బలాత్కారుల
నివాసములతో నిండియున్నవి.
కాగా నిబంధనను జ్ఞాపకము చేసికొనుము
21నలిగినవానిని అవమానముతో వెనుకకు మరల నియ్యకుము.
శ్రమ నొందువారును దరిద్రులును నీ నామము
సన్నుతించుదురు గాక.
22దేవా, లెమ్ము నీ వ్యాజ్యెము నడుపుము
అవివేకులు దినమెల్ల నిన్ను నిందించు సంగతి జ్ఞాప
కము చేసికొనుము.
23నీమీదికి లేచువారి అల్లరి నిత్యము బయలుదేరుచున్నది.
నీ విరోధులుచేయు గల్లత్తును మరువకుము.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for కీర్తనలు 74