YouVersion Logo
Search Icon

కీర్తనలు 73

73
తృతీయస్కంధము.
ఆసాపు కీర్తన.
1ఇశ్రాయేలుయెడల శుద్ధహృదయులయెడల
నిశ్చయముగా దేవుడు దయాళుడై యున్నాడు.
2నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను
నా అడుగులు జార సిద్ధమాయెను.
3భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు
గర్వించువారినిబట్టి నేను మత్సరపడితిని.
4మరణమందు వారికి యాతనలు లేవువారు పుష్టిగా నున్నారు.
5ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు
ఇతరులకు పుట్టునట్లు వారికి తెగులు పుట్టదు.
6కావున గర్వము కంఠహారమువలె వారిని చుట్టుకొనుచున్నది
వస్త్రమువలె వారు బలాత్కారము ధరించుకొందురు.
7క్రొవ్వుచేత వారి కన్నులు మెరకలై యున్నవివారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి
8ఎగతాళి చేయుచు బలాత్కారముచేత జరుగు కీడును
గూర్చి వారు మాటలాడుదురు.
గర్వముగా మాటలాడుదురు.
9ఆకాశముతట్టు వారు ముఖము ఎత్తుదురువారి నాలుక భూసంచారము చేయును.
10వారి జనము వారిపక్షము చేరునువారు జలపానము సమృద్ధిగా చేయుదురు.
11–దేవుడు ఎట్లు తెలిసికొనును
మహోన్నతునికి తెలివియున్నదా? అని వారను
కొందురు.
12ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు. వీరు ఎల్లప్పుడు
నిశ్చింతగలవారై ధనవృద్ధి చేసికొందురు.
13నా హృదయమును నేను శుద్ధిచేసికొని యుండుట
వ్యర్థమే
నా చేతులు కడుగుకొని నిర్మలుడనై యుండుట వ్యర్థమే
14దినమంతయు నాకు బాధ కలుగుచున్నది
ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది.
15–ఈలాగు ముచ్చటింతునని నేననుకొనినయెడల
నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చినవాడ
నగుదును.
16అయినను దీనిని తెలిసికొనవలెనని ఆలోచించినప్పుడు
17నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయివారి అంతమునుగూర్చి ధ్యానించువరకు
ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను.
18నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే
ఉంచియున్నావువారు నశించునట్లు వారిని పడవేయుచున్నావు
19క్షణమాత్రములోనే వారు పాడై పోవుదురు
మహాభయముచేత వారు కడముట్ట నశించుదురు.
20మేలుకొనినవాడు తాను కన్న కల మరచిపోవునట్లు
ప్రభువా, నీవు మేలుకొని వారి బ్రదుకును తృణీక
రింతువు.
21నా హృదయము మత్సరపడెను.
నా అంతరింద్రియములలో నేను వ్యాకులపడితిని.
22నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని
నీ సన్నిధిని మృగమువంటి వాడనైతిని.
23అయినను నేను ఎల్లప్పుడు నీయొద్దనున్నాను
నా కుడిచెయ్యి నీవు పట్టుకొని యున్నావు.
24నీ ఆలోచనచేత నన్ను నడిపించెదవు.
తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు
25ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు?
నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నా కక్కర
లేదు.
26నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను
దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై యున్నాడు.
27నిన్ను విసర్జించువారు నశించెదరు
నిన్ను విడిచి వ్యభిచరించువారినందరిని నీవు సంహ
రించెదవు.
28నాకైతే దేవుని పొందు ధన్యకరము
నీ సర్వకార్యములను నేను తెలియజేయునట్లు
నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చియున్నాను.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for కీర్తనలు 73