YouVersion Logo
Search Icon

కీర్తనలు 72

72
సొలొమోను కీర్తన.
1దేవా, రాజునకు నీ న్యాయవిధులను
రాజకుమారునికి నీ నీతిని తెలియజేయుము.
2నీతినిబట్టి నీ ప్రజలకును
న్యాయవిధులనుబట్టి శ్రమ నొందిన నీ వారికిని
అతడు న్యాయము తీర్చును.
3నీతినిబట్టి పర్వతములును చిన్నకొండలును
ప్రజలకు నెమ్మది పుట్టించును.
4ప్రజలలో శ్రమనొందువారికి అతడు న్యాయము
తీర్చును
బీదల పిల్లలను రక్షించి బాధపెట్టువారిని నలగగొట్టును.
5సూర్యుడు నిలుచునంత కాలము
చంద్రుడు నిలుచునంతకాలము తరములన్నిటను
జనులు నీయందు భయభక్తులు కలిగియుందురు.
6గడ్డికోసిన బీటిమీద కురియు వానవలెను
భూమిని తడుపు మంచి వర్షమువలెను అతడు విజ
యము చేయును.
7అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు
చంద్రుడు లేకపోవువరకు క్షేమాభివృద్ధి కలుగును.
8సముద్రమునుండి సముద్రమువరకు
యూఫ్రటీసునది మొదలుకొని భూదిగంతములవరకు
అతడు రాజ్యము చేయును.
9అరణ్యవాసులు అతనికి లోబడుదురు.
అతని శత్రువులు మన్ను నాకెదరు.
10తర్షీషు రాజులు ద్వీపముల రాజులు కప్పము
చెల్లించెదరు
షేబరాజులును సెబారాజులును కానుకలు తీసికొని
వచ్చెదరు.
11రాజులందరు అతనికి నమస్కారము చేసెదరు.
అన్యజనులందరు అతని సేవించెదరు.
12దరిద్రులు మొఱ్ఱపెట్టగా అతడు వారిని విడిపించును.
దీనులను నిరాధారులను అతడు విడిపించును.
13నిరుపేదలయందును బీదలయందును అతడు కనిక
రించును
బీదల ప్రాణములను అతడు రక్షించును
14కపట బలాత్కారములనుండి అతడు వారి ప్రాణ
మును విమోచించును.
వారి ప్రాణము#72:14 లేక–వారిరక్తము అతని దృష్టికి ప్రియముగా ఉండును.
15అతడు చిరంజీవియగును, షేబ బంగారము అతనికి
ఇయ్యబడును.
అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థనచేయు
దురు
దినమంతయు అతని పొగడుదురు.
16దేశములోను పర్వత శిఖరములమీదను సస్య సమృద్ధి
కలుగును
దాని పంట లెబానోను వృక్షములవలె తాండవమాడు
చుండును
నేలమీది పచ్చికవలె పట్టణస్థులు తేజరిల్లుదురు.
17అతని పేరు నిత్యము నిలుచును
అతని నామము సూర్యుడున్నంతకాలము చిగుర్చు
చుండును
అతనినిబట్టి మనుష్యులు దీవింపబడుదురు
అన్యజనులందరును అతడు ధన్యుడని చెప్పుకొందురు.
18దేవుడైన యెహోవా ఇశ్రాయేలుయొక్క దేవుడు
స్తుతింపబడును గాక
ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయువాడు.
19ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడును గాక
సర్వభూమియు ఆయన మహిమతో నిండియుండును
గాక. ఆమేన్ . ఆమేన్.
యెష్షయి కుమారుడగు దావీదు ప్రార్థనలు ముగిసెను.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for కీర్తనలు 72