YouVersion Logo
Search Icon

కీర్తనలు 71

71
1యెహోవా, నేను నీ శరణుజొచ్చియున్నాను.
నన్నెన్నడును సిగ్గుపడనియ్యకుము.
2నీ నీతినిబట్టి నన్ను తప్పింపుము నన్ను విడిపింపుము
నీ చెవి యొగ్గి నన్ను రక్షింపుము.
3నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయదుర్గముగా
ఉండుము
నా శైలము నా దుర్గము నీవే
నీవు నన్ను రక్షింప నిశ్చయించియున్నావు.
4నా దేవా, భక్తిహీనులచేతిలోనుండి నన్ను రక్షిం
పుము.
కీడుచేయువారి పట్టులోనుండి బలాత్కారుని
పట్టులోనుండి నన్ను విడిపింపుము.
5నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము
నీవే
బాల్యమునుండి నా ఆశ్రయము నీవే.
6గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై
యుంటివి
తల్లిగర్భమునుండి నన్ను ఉద్భవింపజేసినవాడవు నీవే
నిన్నుగూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును.
7నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను
అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే.
8నీ కీర్తితోను నీ ప్రభావవర్ణనతోను దినమంతయు నా
నోరు నిండియున్నది.
9వృద్ధాప్యమందు నన్ను విడనాడకుము
నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకుము.
10నా శత్రువులు నన్నుగూర్చి మాటలాడుకొనుచున్నారు
నా ప్రాణముకొరకు పొంచియున్నవారు కూడి
ఆలోచన చేయుచున్నారు.
11–దేవుడు వానిని విడిచెను తప్పించువారెవరును లేరు
వానిని తరిమి పట్టుకొనుడి అని వారనుకొనుచున్నారు.
12దేవా, నాకు దూరముగా ఉండకుము.
నా దేవా, నా సహాయమునకు త్వరపడి రమ్ము
13నా ప్రాణవిరోధులు సిగ్గుపడి నశించుదురు గాక.
నాకు కీడుచేయ జూచువారు నిందపాలై మాన
భంగము నొందుదురుగాక.
14నేను ఎల్లప్పుడు నిరీక్షింతును
నేను మరి యెక్కువగా నిన్ను కీర్తింతును
15నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్ల వివరించును
అవి నాకు ఎన్నశక్యము కావు.
16ప్రభువైన యెహోవాయొక్క బలవత్కార్యములను
బట్టి నేను వర్ణింప మొదలుపెట్టెదను
నీ నీతినిమాత్రమే నేను వర్ణించెదను.
17దేవా, బాల్యమునుండి నీవు నాకు బోధించుచు
వచ్చితివి
ఇంతవరకు నీ ఆశ్చర్యకార్యములు నేను తెలుపుచునే
వచ్చితిని.
18దేవా, వచ్చుతరమునకు నీ బాహుబలమునుగూర్చియు
పుట్టబోవువారికందరికి నీ శౌర్యమునుగూర్చియు
నేను తెలియజెప్పునట్లు తల నెరసి వృద్ధునైయుండు
వరకు నన్ను విడువకుము.
19దేవా, నీ నీతి మహాకాశమంత ఉన్నతమైనది
గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటియైన
వాడెవడు?
20అనేకమైన కఠినబాధలను మాకు కలుగజేసినవాడా,
నీవు మరల మమ్ము బ్రదికించెదవు
భూమియొక్క అగాధ స్థలములలోనుండి
నీవు మరల మమ్ము లేవనెత్తెదవు.
21నా గొప్పతనమును వృద్ధిచేయుము
నాతట్టు మరలి నాకు నెమ్మది కలుగజేయుము
22నా దేవా, నేను కూడ నీ సత్యమునుబట్టి
స్వరమండల వాద్యముతో నిన్ను స్తుతించెదను
ఇశ్రాయేలు పరిశుద్ధ దేవా, సితారాతో నిన్ను కీర్తించె
దను.
23నేను నిన్ను కీర్తించునప్పుడు
నా పెదవులును నీవు విమోచించిన నా ప్రాణమును
నిన్నుగూర్చి ఉత్సాహధ్వని చేయును.
24నాకు కీడుచేయజూచువారు సిగ్గుపడియున్నారువారు అవమానము పొందియున్నారు
కాగా నా నాలుక దినమెల్ల నీ నీతిని వర్ణించును.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for కీర్తనలు 71