YouVersion Logo
Search Icon

కీర్తనలు 70

70
ప్రధానగాయకునికి. దావీదు రచించినది. జ్ఞాపకార్థమైన కీర్తన.
1దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము
యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము.
2నా ప్రాణము తీయగోరువారు
సిగ్గుపడి అవమానమొందుదురుగాక.
నాకు కీడుచేయగోరువారు
వెనుకకు మళ్లింపబడి సిగ్గునొందుదురు గాక.
3–ఆహా ఆహా అని పలుకువారు
తమకు కలిగిన అవమానమును చూచి విస్మయ మొందుదురుగాక
4నిన్ను వెదకువారందరు
నిన్నుగూర్చి ఉత్సహించి సంతోషించుదురు గాక.
నీ రక్షణను ప్రేమించువారందరు
–దేవుడు మహిమపరచబడును గాక అని నిత్యము
చెప్పుకొందురు గాక.
5నేను శ్రమల పాలై దీనుడనైతిని
దేవా, నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము
నాకు సహాయము నీవే నారక్షణకర్తవు నీవే
యెహోవా, ఆలస్యము చేయకుమీ.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for కీర్తనలు 70