YouVersion Logo
Search Icon

కీర్తనలు 145

145
స్తుతికీర్తన. దావీదుది.
1రాజవైన నా దేవా, నిన్ను ఘనపరచెదను.
నీ నామమును నిత్యము సన్నుతించెదను
2అనుదినము నేను నిన్ను స్తుతించెదను
నిత్యము నీ నామమును స్తుతించెదను.
3యెహోవా మహాత్మ్యముగలవాడు
ఆయన అధికస్తోత్రము నొందదగినవాడు
ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యము కానిది
4ఒక తరమువారు మరియొక తరమువారియెదుట నీ
క్రియలను కొనియాడుదురు
నీ పరాక్రమక్రియలను తెలియజేయుదురు
5మహోన్నతమైన నీ ప్రభావమహిమను
నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను
6నీ భీకరకార్యముల విక్రమమును మనుష్యులు వివరించెదరు
నేను నీ మహాత్మ్యమును వర్ణించెదను.
7నీ మహా దయాళుత్వమునుగూర్చిన కీర్తిని వారు
ప్రకటించెదరు
నీ నీతినిగూర్చి వారు గానము చేసెదరు
8యెహోవా దయాదాక్షిణ్యములుగలవాడు
ఆయన దీర్ఘశాంతుడు కృపాతిశయముగలవాడు.
9యెహోవా అందరికి ఉపకారి
ఆయన కనికరములు ఆయన సమస్త కార్యములమీద
నున్నవి.
10యెహోవా, నీ క్రియలన్నియు నీకు కృతజ్ఞతాస్తుతులు
చెల్లించుచున్నవి
నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు.
11ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన
బలమును
నరులకు తెలియజేయుటకై
12నీ భక్తులు నీ రాజ్యప్రభావమునుగూర్చి చెప్పుకొందురు
నీ శౌర్యమునుగూర్చి పలుకుదురు
13నీ రాజ్యము శాశ్వతరాజ్యము
నీ రాజ్యపరిపాలన తరతరములు నిలుచును.
14యెహోవా పడిపోవువారినందరిని ఉద్ధరించువాడు
క్రుంగిపోయిన వారినందరిని లేవనెత్తువాడు
15సర్వజీవుల కన్నులు నీవైపు చూచుచున్నవి
తగిన కాలమందు నీవు వారికి ఆహారమిచ్చుదువు.
16నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తి
పరచుచున్నావు.
17యెహోవా తన మార్గములన్నిటిలో నీతిగలవాడు
తన క్రియలన్నిటిలో కృపచూపువాడు
18తనకు మొఱ్ఱపెట్టువారికందరికి
తనకు నిజముగా మొఱ్ఱపెట్టువారికందరికి యెహోవా
సమీపముగా ఉన్నాడు.
19తనయందు భయభక్తులుగలవారి కోరిక ఆయన నెర
వేర్చునువారి మొఱ్ఱ ఆలకించి వారిని రక్షించును.
20యెహోవా తన్ను ప్రేమించువారినందరిని కాపా
డును
అయితే భక్తిహీనులనందరిని ఆయన నాశనము చేయును.
21నా నోరు యెహోవాను స్తోత్రము చేయును
శరీరులందరు ఆయన పరిశుద్ధ నామమును నిత్యము
సన్నుతించుదురు గాక.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for కీర్తనలు 145