YouVersion Logo
Search Icon

కీర్తనలు 144

144
దావీదు కీర్తన.
1నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింప
బడును గాక
ఆయన నా చేతులకు యుద్ధమును
నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడైయున్నాడు.
2ఆయన నాకు కృపానిధి నా కోట
నా దుర్గము నన్ను తప్పించువాడు
నా కేడెము నే నాశ్రయించువాడు
ఆయన నా జనులను నాకు లోబరచువాడైయున్నాడు.
3యెహోవా, నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు
ఏపాటివారు?
నీవు వారిని ఎన్నికచేయుటకు మనష్యులు ఏపాటివారు?
4నరులు వట్టి ఊపిరిని పోలియున్నారువారి దినములు దాటిపోవు నీడవలె నున్నవి.
5యెహోవా, నీ ఆకాశమును వంచి దిగిరమ్ము
పర్వతములు పొగ రాజునట్లు నీవు వాటిని ముట్టుము
6మెరుపులు మెరిపించి వారిని చెదరగొట్టుము
నీ బాణములు వేసి వారిని ఓడగొట్టుము.
7పైనుండి నీ చెయ్యి చాచి నన్ను తప్పింపుము
మహా జలములలోనుండి
అన్యులచేతిలోనుండి నన్ను విడిపింపుము.
8వారి నోరు వట్టిమాటలాడుచున్నదివారి కుడిచేయి అబద్ధముతోకూడియున్నది.
9దేవా, నిన్నుగూర్చి నేనొక క్రొత్త కీర్తన పాడెదను
పదితంతుల సితారాతో నిన్ను కీర్తించెదను.
10నీవే రాజులకు విజయము దయచేయువాడవు
దుష్టుల ఖడ్గమునుండి నీవు నీ సేవకుడైన దావీదును
తప్పించువాడవు
11నన్ను తప్పింపుము అన్యుల చేతిలోనుండి నన్ను విడి
పింపుమువారి నోరు వట్టిమాటలాడుచున్నదివారి కుడిచేయి అబద్ధముతోకూడియున్నది.
12మా కుమారులు తమ యౌవన కాలమందు
ఎదిగిన మొక్కలవలె ఉన్నారు
మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూలకంబములవలె
ఉన్నారు.
13మా కొట్లు నింపబడి పలువిధములైన ద్రవ్యములకు
నిధులుగా ఉన్నవి
మా గొఱ్ఱెలు వేలకొలదిగాను పదివేలకొలదిగాను మా
గడ్డి బీళ్లలో పిల్లలు వేయుచున్నవి.
14మా యెడ్లు గొప్ప బరువులు మోయగలవి
మా వీధులలో చొరబడుటయైనను ఉరుకులెత్తుట
యైనను లేదు
వాటిలో శ్రమగలవారి మొఱ్ఱ వినబడుటయైనను లేదు
15ఇట్టి స్థితిగలవారు ధన్యులు.
యెహోవా తమకు దేవుడుగాగల జనులు ధన్యులు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in