YouVersion Logo
Search Icon

కీర్తనలు 143

143
దావీదు కీర్తన.
1యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము
నా విన్నపములకు చెవి యొగ్గుము
నీ విశ్వాస్యతనుబట్టియు నీ నీతినిబట్టియు నాకు
ఉత్తరమిమ్ము.
2నీ సేవకునితో వ్యాజ్యెమాడకుము
సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడుగా
ఎంచబడడు.
3శత్రువులు నన్ను తరుముచున్నారువారు నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు
చిరకాలముక్రిందట చనిపోయిన వారితోపాటు
గాఢాంధకారములో నన్ను నివసింపజేయుచున్నారు.
4కావున నా ఆత్మ నాలో క్రుంగియున్నది
నాలో నా హృదయము విస్మయమొందెను.
5పూర్వదినములు జ్ఞాపకము చేసికొనుచున్నాను
నీ క్రియలన్నియు ధ్యానించుచున్నాను.
నేను నీచేతుల పని యోచించుచున్నాను
6నీతట్టు నా చేతులు చాపుచున్నాను
ఎండిపోయిన భూమివలె నా ప్రాణము నీకొరకు ఆశ
పడుచున్నది.
7యెహోవా, నా ఆత్మ క్షీణించుచున్నది
త్వరగా నాకు ఉత్తరమిమ్ము
నేను సమాధిలోనికి దిగువారివలె కాకుండునట్లు
నీ ముఖమును నాకు మరుగుచేయకుము
8నీయందు నేను నమ్మిక యుంచియున్నాను
ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము
నీవైపు నా మనస్సు నే నెత్తికొనుచున్నాను.
నేను నడువవలసిన మార్గము నాకు తెలియజేయుము.
9యెహోవా, నేను నీ మరుగు జొచ్చియున్నాను
నా శత్రువుల చేతిలోనుండి నన్ను విడిపింపుము
10నీవే నా దేవుడవు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు
నాకు నేర్పుము
దయగల నీ ఆత్మ సమభూమిగల ప్రదేశమందు నన్ను
నడిపించును గాక.
11యెహోవా, నీ నామమునుబట్టి నన్ను బ్రదికిం
పుము
నీ నీతినిబట్టి నా ప్రాణమును శ్రమలోనుండి తప్పిం
పుము.
12నేను నీ సేవకుడను నీ కృపనుబట్టి నా శత్రువులను
సంహరింపుము
నా ప్రాణమును బాధపరచువారినందరిని నశింపజేయుము.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in