YouVersion Logo
Search Icon

సామెతలు 26

26
1ఎండకాలమునకు మంచు గిట్టదు కోతకాలమునకు
వర్షము గిట్టదు
అటువలె బుద్ధిహీనునికి ఘనత గిట్టదు.
2రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు
దాటుచుండు వానకోయిలయు దిగకుండునట్లు
హేతువులేని శాపము తగులకపోవును.
3గుఱ్ఱమునకు చబుకు గాడిదకు కళ్లెము
మూర్ఖుల వీపునకు బెత్తము.
4వాని మూఢతచొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తర మియ్యకుము
ఇచ్చినయెడల నీవును వాని పోలియుందువు.
5వాని మూఢతచొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తర మిమ్ము
ఆలాగు చేయనియెడల వాడు తన దృష్టికి తాను
జ్ఞానిననుకొనును.
6మూర్ఖునిచేత వర్తమానము పంపువాడు
కాళ్లు తెగగొట్టుకొని విషము త్రాగినవానితో సమానుడు.
7కుంటివాని కాళ్లు పట్టులేక యున్నట్లు
మూర్ఖుల నోట సామెత పాటిలేకుండును
8బుద్ధిహీనుని ఘనపరచువాడు
వడిసెలలోని రాయి కదలకుండ కట్టువానితో సమానుడు.
9–మూర్ఖుల నోట సామెత
మత్తునుగొనువాని చేతిలోముల్లు గుచ్చుకొన్నట్లుండును.
10అధికముగా నొందినవాడు సమస్తము చేయవచ్చును
మూర్ఖునివలన కలుగు లాభము నిలువదు కూలికి వానిని
పిలిచినవాడును చెడిపోవును.
11తన మూఢతను మరల కనుపరచు మూర్ఖుడు
కక్కినదానికి తిరుగు కుక్కతో సమానుడు.
12తన దృష్టికి జ్ఞానిననుకొనువానిని చూచితివా?
వానిని గుణపరచుటకంటె మూర్ఖుని గుణపరచుట
సుళువు.
13సోమరి–దారిలో సింహమున్నదనును వీధిలో సింహ
మున్నదనును.
14ఉతకమీద తలుపు తిరుగును
తన పడకమీద సోమరి తిరుగును.
15సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును
నోటియొద్దకు దాని తిరిగి యెత్తుట కష్టమనుకొనును.
16హేతువులు చూపగల యేడుగురికంటె
సోమరి తన దృష్టికి తానే జ్ఞానిననుకొనును
17తనకు పట్టని జగడమునుబట్టి రేగువాడు
దాటిపోవుచున్న కుక్క చెవులు పట్టుకొనువానితో
సమానుడు.
18తెగులు అమ్ములు కొఱవులు విసరు వెఱ్ఱివాడు
19తన పొరుగువాని మోసపుచ్చి నేను నవ్వులాటకు
చేసితినని పలుకువానితో సమానుడు.
20కట్టెలు లేనియెడల అగ్ని ఆరిపోవును
కొండెగాడు లేనియెడల జగడము చల్లారును.
21వేడిబూడిదెకు బొగ్గులు అగ్నికి కట్టెలు
కలహములు పుట్టించుటకు కలహప్రియుడు.
22కొండెగాని మాటలు రుచిగల పదార్థములవంటివి
అవి లోకడుపులోనికి దిగిపోవును.
23చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెద
వులును కలిగియుండుట మంటి పెంకుమీది వెండి
పూతతో సమానము.
24పగవాడు పెదవులతో మాయలు చేసి
అంతరంగములో కపటము దాచుకొనును.
25వాడు దయగా మాటలాడినప్పుడు వాని మాట నమ్మకుము
వాని హృదయములో ఏడు హేయవిషయములు కలవు.
26వాడు తనద్వేషమును కపటవేషముచేత దాచుకొనును
సమాజములో వాని చెడుతనము బయలుపరచబడును.
27గుంటను త్రవ్వువాడే దానిలో పడును
రాతిని పొర్లించువానిమీదికి అది తిరిగి వచ్చును.
28అబద్ధములాడువాడు తాను నలగగొట్టినవారిని ద్వేషించును
ఇచ్చకపు మాటలాడు నోరు నష్టము కలుగజేయును.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in