YouVersion Logo
Search Icon

సామెతలు 27

27
1రేపటి దినమునుగూర్చి అతిశయపడకుము
ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు.
2నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే
నిన్ను పొగడదగును.
3రాయి బరువు ఇసుక భారము
మూఢుని కోపము ఆ రెంటికంటె బరువు.
4క్రోధము క్రూరమైనది కోపము వరదవలె పొర్లునది.
రోషము ఎదుట ఎవడు నిలువగలడు?
5లోలోపల ప్రేమించుటకంటె
బహిరంగముగా గద్దించుట మేలు
6మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును
పగవాడు లెక్కలేని ముద్దులుపెట్టును.
7కడుపు నిండినవాడు తేనెపట్టునైనను త్రొక్కివేయును.
ఆకలిగొనినవానికి చేదువస్తువైనను తియ్యగా నుండును.
8తన యిల్లు విడిచి తిరుగువాడు
గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు.
9తైలమును అత్తరును హృదయమును సంతోషపరచు
నట్లు
చెలికాని హృదయములోనుండి వచ్చు మధురమైన
మాటలు హృదయమును సంతోషపరచును.
10నీ స్నేహితునైనను నీ తండ్రి స్నేహితునినైనను విడిచి
పెట్టకుము
నీకు అపద కలిగిన దినమందు నీ సహోదరుని యింటికి
వెళ్లకుము
దూరములోనున్న సహోదరునికంటె
దగ్గరనున్న పొరుగువాడు వాసి,
11నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృద
యమును సంతోషపరచుము.
అప్పుడు నన్ను నిందించువారితో నేను ధైర్యముగా
మాటలాడుదును.
12బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును
జ్ఞానములేనివారు యోచింపక ఆపదలో పడుదురు.
13ఎదుటివానికొరకు పూటబడినవాని వస్త్రము పుచ్చుకొనుము
పరులకొరకు పూటబడినవానివలన కుదువపెట్టించుము.
14వేకువనే లేచి గొప్ప శబ్దముతో తన స్నేహితుని
దీవించువాని దీవెన వానికి శాపముగా ఎంచబడును.
15ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లును
గయ్యాళియైన భార్యయు సమానము
16దానిని ఆపజూచువాడు గాలిని ఆపజూచువానితోను
తన కుడిచేత నూనె పట్టుకొనువానితోను సమానుడు.
17ఇనుముచేత ఇనుము పదునగును
అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును.
18అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము
తినును
19తన యజమానుని మన్నించువాడు ఘనతనొందును.
నీటిలో ముఖమునకు ముఖము కనబడునట్లు
20ఒకని మనస్సునకు మరియొకని మనస్సు కనబడును.
పాతాళమునకును అగాధ కూపమునకును తృప్తి కానేరదు
21ఆలాగున నరుల దృష్టి తృప్తికానేరదు.
మూసచేత వెండిని కొలిమి చేత బంగారును
22తాను పొందిన కీర్తిచేత నరుని పరిశోధింపవచ్చును.
మూఢుని రోటిలోని గోధుమలలో వేసి రోకట
దంచినను
వాని మూఢత వాని వదలిపోదు.
23నీ పశువులస్థితి జాగ్రత్తగా తెలిసికొనుము
నీ మందలయందు మనస్సు ఉంచుము.
24ధనము శాశ్వతము కాదు
కిరీటము తరతరములు ఉండునా?
25ఎండిన గడ్డి వామివేయబడెను పచ్చిక కనబడుచున్నది
కొండగడ్డి యేరబడియున్నది
26నీ వస్త్రములకొరకు గొఱ్ఱెపిల్లలున్నవి
ఒక చేని క్రయధనమునకు పొట్టేళ్లు సరిపోవును
27నీ ఆహారమునకు నీ యింటివారి ఆహారమునకు
నీ పనికత్తెల జీవనమునకు మేకపాలు సమృద్ధియగును.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in