YouVersion Logo
Search Icon

సామెతలు 24

24
1దుర్జనులను చూచి మత్సరపడకుమువారి సహవాసము కోరకుము
2వారి హృదయము బలాత్కారము చేయ యోచించునువారి పెదవులు కీడునుగూర్చి మాటలాడును.
3జ్ఞానమువలన ఇల్లు కట్టబడును
వివేచనవలన అది స్థిరపరచబడును.
4తెలివిచేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ
సంపదలతో నింపబడును.
5జ్ఞానముగలవాడు బలవంతుడుగానుండును
తెలివిగలవాడు శక్తిమంతుడుగా నుండును.
6వివేకముగల నాయకుడవై యుద్ధముచేయుము.
ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము
7మూర్ఖునికి జ్ఞానము అందదు
గుమ్మమునొద్ద అట్టివారు మౌనులైయుందురు.
8కీడుచేయ పన్నాగములు పన్నువానికి
తంటాలమారి అని పేరు పెట్టబడును.
9మూర్ఖుని యోచన పాపము
అపహాసకులు నరులకు హేయులు.
10శ్రమదినమున నీవు క్రుంగినయెడల
నీవు చేతకాని వాడవగుదువు.
11చావునకై పట్టబడినవారిని నీవు తప్పించుము
నాశమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు
రక్షింపవా?
12ఈ సంగతి మాకు తెలియదని నీవనుకొనినయెడల
హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును గదా.
నిన్ను కనిపెట్టువాడు దాని నెరుగును గదా
నరులకు వారి వారి పనులనుబట్టి ఆయన ప్రతికారము చేయును గదా.
13నా కుమారుడా, తేనె త్రాగుము అది రుచిగలది గదా
తేనెపట్టు తినుము అది నీ నాలుకకు తీపియే గదా.
14నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలిసికొనుము
అది నీకు దొరికినయెడల ముందుకు నీకు మంచిగతి
కలుగును
నీ ఆశ భంగము కానేరదు.
15భక్తిహీనుడా, నీతిమంతుని నివాసమునొద్ద పొంచి
యుండకుము
వాని విశ్రమస్థలమును పాడుచేయకుము.
16నీతిమంతుడు ఏడుమారులు పడినను తిరిగి లేచును
ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు.
17నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకుము
వాడు తొట్రిల్లినప్పుడు నీవు మనస్సున నుల్లిసింపకుము.
18యెహోవా అది చూచి అసహ్యించుకొని
వానిమీదనుండి తన కోపము త్రిప్పుకొనునేమో.
19దుర్మార్గులను చూచి నీవు వ్యసనపడకుము
భక్తిహీనులయెడల మత్సరపడకుము.
20దుర్జనునికి ముందుగతి లేదు భక్తిహీనుల దీపము ఆరిపోవును
21నా కుమారుడా, యెహోవాను ఘనపరచుము రాజును ఘనపరచుము
ఆలాగు చేయనివారి జోలికి పోకుము.
22అట్టివారికి ఆపద హఠాత్తుగా తటస్థించునువారి కాలము ఎప్పుడు ముగియునో యెవరికి తెలియును?
23ఇవియు జ్ఞానులు చెప్పిన సామెతలే
–న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట
ధర్మము కాదు
24–నీయందు దోషములేదని దుష్టునితో చెప్పువానిని
ప్రజలు శపించుదురు
జనులు అట్టివానియందు అసహ్యపడుదురు.
25న్యాయముగా తీర్పు తీర్చువారికి మేలు కలుగును
క్షేమకరమైన దీవెన అట్టివారిమీదికి వచ్చును.
26సరియైన మాటలతో ప్రత్యుత్తరమిచ్చుట
పెదవులతో ముద్దుపెట్టుకొనినట్లుండును.
27బయట నీ పని చక్క పెట్టుకొనుము ముందుగా పొలములో దాని సిద్ధపరచుము
తరువాత ఇల్లు కట్టుకొనవచ్చును.
28నిర్నిమిత్తముగా నీ పొరుగువానిమీద సాక్ష్యము పలుకకుము
నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా?
29–వాడు నాకు చేసినట్లు వానికి చేసెదను
వాని క్రియచొప్పున వానికి ప్రతిఫలమిచ్చెద నను
కొనకుము.
30సోమరివాని చేను నేను దాటి రాగా
తెలివిలేనివాని ద్రాక్షతోట నేను దాటి రాగా
31ఇదిగో దానియందంతట ముండ్ల తుప్పలు బలిసి
యుండెను.
దూలగొండ్లు దాని కప్పియుండెను
దాని రాతి గోడ పడియుండెను.
32నేను దాని చూచి యోచన చేసికొంటిని
దాని కనిపెట్టి బుద్ధి తెచ్చుకొంటిని.
33ఇంక కొంచెము నిద్ర యింక కొంచెముకునుకుపాటు
పరుండుటకై యింక కొంచెము చేతులు ముడుచు
కొనుట
వీటివలన నీకు దరిద్రత పరుగెత్తి వచ్చును
ఆయుధస్థుడు వచ్చినట్లు లేమి నీమీదికి వచ్చును.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in