YouVersion Logo
Search Icon

యెషయా 60

60
1నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము
యెహోవా మహిమ నీమీద ఉదయించెను.
2చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది
కటికచీకటి జనములను కమ్ముచున్నది
యెహోవా నీమీద ఉదయించుచున్నాడు
ఆయన మహిమ నీమీద కనబడుచున్నది
3జనములు నీ వెలుగునకు వచ్చెదరు
రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు.
4కన్నులెత్తి చుట్టు చూడుము
వీరందరు కూడుకొని నీయొద్దకు వచ్చుచున్నారు
నీ కుమారులు దూరమునుండి వచ్చుచున్నారు
నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు.
5నీవు చూచి ప్రకాశింతువు
నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును
సముద్రవ్యాపారము నీవైపు త్రిప్పబడును
జనముల ఐశ్వర్యము నీయొద్దకు వచ్చును.
6ఒంటెల సమూహము మిద్యాను ఏయిఫాల లేత ఒంటె
లును నీ దేశముమీద వ్యాపించును
వారందరు షేబనుండి వచ్చెదరు
బంగారమును ధూపద్రవ్యమును తీసికొనివచ్చెదరు
యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు.
7నీ కొరకు కేదారు గొఱ్ఱెమందలన్నియు కూడుకొనును
నెబాయోతు పొట్లేళ్లు నీ పరిచర్యకు ఉపయోగము
లగును
అవి నా బలిపీఠముమీద అంగీకారములగును
నా శృంగార మందిరమును నేను శృంగారించెదను.
8మేఘమువలెను ఎగయు గువ్వలవలెను గూళ్లకు ఎగసి
వచ్చు వీరెవరు?
9నీ దేవుడైన యెహోవా నామమునుబట్టి
ఆయన నిన్ను శృంగారించినందున
ఇశ్రాయేలు పరిశుద్ధదేవుని నామమునుబట్టి
దూరమునుండి నీ కుమారులను తమ వెండి బంగారము
లను తీసికొని వచ్చుటకు
ద్వీపములు నాకొరకు కనిపెట్టుకొనుచున్నవి
తర్షీషు ఓడలు మొదట వచ్చుచున్నవి.
10అన్యులు నీ ప్రాకారములను కట్టుదురువారి రాజులు నీకు ఉపచారము చేయుదురు
ఏలయనగా నేను కోపపడి నిన్ను కొట్టితినిగాని
కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను.
11నీయొద్దకు జనముల భాగ్యము తేబడునట్లువారి రాజులు జయోత్సవముతో రప్పింపబడునట్లు
నీ ద్వారములు రాత్రింబగళ్లు వేయబడక
నిత్యము తెరువబడి యుండును.
12నిన్ను సేవింపనొల్లని జనమైనను రాజ్యమైనను నిలువదు
అట్టి జనములు నిర్మూలము చేయబడును.
13నా పరిశుద్ధాలయపు అలంకారము నిమిత్తమై
లెబానోను శ్రేష్ఠమైన దేవదారు వృక్షములును
సరళవృక్షములును గొంజిచెట్లును నీయొద్దకు తేబడును
నేను నా పాదస్థలమును మహిమపరచెదను.
14నిన్ను బాధించినవారి సంతానపువారు
నీ యెదుటికి వచ్చి సాగిలపడెదరు
నిన్ను తృణీకరించినవారందరు వచ్చి నీ పాదములమీద
పడెదరు.
యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని
సీయోననియు నీకు పేరు పెట్టెదరు.
15నీవు విసర్జింపబడుటనుబట్టియు ద్వేషింపబడుటను
బట్టియు
ఎవడును నీ మార్గమున దాటిపోవుట లేదు.
నిన్ను శాశ్వత శోభాతిశయముగాను
బహు తరములకు సంతోషకారణముగాను చేసెదను.
16యెహోవానగు నేను నీ రక్షకుడననియు
బహు పరాక్రమముగల యాకోబు దేవుడనగు నీ
విమోచకుడననియు నీకు తెలియబడునట్లు
నీవు జనముల పాలు కుడిచి రాజుల చంటి పాలు
త్రాగెదవు.
17నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను
ఇనుమునకు ప్రతిగా వెండిని కఱ్ఱకు ప్రతిగా ఇత్తడిని
రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను.
సమాధానమును నీకధికారులుగాను
నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించుచున్నాను.
18ఇకను నీ దేశమున బలాత్కారమను మాట వినబడదు
నీ సరిహద్దులలో పాడు అను మాటగాని నాశనము
అను మాటగాని వినబడదు
రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ
గుమ్మములనియు నీవు చెప్పుకొందువు.
19ఇకమీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా
ఉండదు
నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు
యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును
నీ దేవుడు నీకు భూషణముగా ఉండును.
20నీ సూర్యుడికను అస్తమింపడు
నీ చంద్రుడు క్షీణింపడు
యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును
నీ దుఃఖదినములు సమాప్తములగును.
21నీ జనులందరు నీతిమంతులైయుందురు
నన్ను నేను మహిమపరచుకొనునట్లువారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను
ఉండి
దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు.
22వారిలో ఒంటరియైనవాడు వేయిమందియగును
ఎన్నికలేనివాడు బలమైన జనమగును
యెహోవానగు నేను తగినకాలమున ఈ కార్యమును
త్వరపెట్టుదును.

Currently Selected:

యెషయా 60: TELUBSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in