YouVersion Logo
Search Icon

యెషయా 61

61
1ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చియున్నది
దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా
నన్ను అభిషేకించెను
నలిగిన హృదయముగలవారిని దృఢపరచుటకును
చెరలోనున్నవారికి విడుదలను
బంధింపబడినవారికి విముక్తిని ప్రకటించుటకును
2యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతి దండన
దినమును ప్రకటించుటకును
దుఃఖాక్రాంతులందరిని ఓదార్చుటకును
3సీయోనులో దుఃఖించువారికి ఉల్లాస వస్త్రములు
ధరింపజేయుటకును
బూడిదెకు ప్రతిగా పూదండను
దుఃఖమునకు ప్రతిగా ఆనందతైలమును
భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతివస్త్రమునువారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు.
యెహోవా తన్ను మహిమపరచుకొనునట్లు
నీతి అను మస్తకివృక్షములనియు
యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్ట
బడును.
4చాలకాలమునుండి పాడుగానున్న స్థలములను వారు
కట్టుదురు
పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు
పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు
తరతరములనుండి శిథిలములైయున్న పురములను బాగు
చేయుదురు.
5అన్యులు నిలువబడి మీ మందలను మేపెదరు
పరదేశులు మీకు వ్యవసాయకులును
మీ ద్రాక్షతోట కాపరులును అగుదురు
6మీరు యెహోవాకు యాజకులనబడుదురు
–వారు మా దేవుని పరిచారకులని మనుష్యులు మిమ్మును
గూర్చి చెప్పుదురు
జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురువారి ప్రభావమును పొంది అతిశయింతురు
7మీ యవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందు
దురు
నిందకు ప్రతిగా తాము పొందిన భాగము ననుభవించివారు సంతోషింతురువారు తమ దేశములోరెట్టింపుభాగమునకు కర్తలగుదురు
నిత్యానందము వారికి కలుగును.
8ఏలయనగా న్యాయముచేయుట యెహోవానగు
నాకిష్టము
ఒకడు అన్యాయముగా ఒకనిసొత్తు పట్టుకొనుట
నాకసహ్యము.
సత్యమునుబట్టి వారి క్రియాఫలమును వారికిచ్చుచువారితో నిత్యనిబంధన చేయుదును.
9జనములలో వారి సంతతి తెలియబడును
జనములమధ్యను వారి సంతానము ప్రసిద్ధినొందును
–వారు యెహోవా ఆశీర్వదించిన జనమనివారిని చూచినవారందరు ఒప్పుకొందురు
10శృంగారమైనపాగా ధరించుకొనిన పెండ్లికుమారుని
రీతిగాను
ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లికుమార్తెరీతి
గాను
ఆయన రక్షణవస్త్రములను నాకు ధరింపజేసి
యున్నాడు
నీతి అను పైబట్టను నాకు ధరింపజేసియున్నాడు
కాగా యెహోవానుబట్టి మహానందముతో నేను
ఆనందించుచున్నాను
నా దేవునిబట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది
11భూమి మొలకను మొలిపించునట్లుగాను
తోటలో విత్తబడినవాటిని అది మొలిపించునట్లుగాను
నిశ్చయముగా సమస్త జనముల యెదుట
ప్రభువగు యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింప
జేయును.

Currently Selected:

యెషయా 61: TELUBSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in