యెషయా 59
59
1రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము
కురుచకాలేదు
విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము
కాలేదు
2మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా
వచ్చెను
మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు
పరచెను
గనుక ఆయన ఆలకింపకున్నాడు.
3మీ చేతులు రక్తముచేతను మీ వ్రేళ్లు దోషముచేతను
అపవిత్రపరచబడియున్నవి
మీ పెదవులు అబద్ధములాడుచున్నవి
మీ నాలుక కీడునుబట్టి మాటలాడుచున్నది.
4నీతినిబట్టి యెవడును సాక్ష్యము పలుకడు
సత్యమునుబట్టి యెవడును వ్యాజ్యెమాడడు
అందరు వ్యర్థమైనదాని నమ్ముకొని మోసపుమాటలు
పలుకుదురు
చెడుగును గర్భము ధరించి పాపమును కందురు.
5వారు మిడునాగుల గుడ్లను పొదుగుదురు
సాలెపురుగు వల నేయుదురు
ఆ గుడ్లు తినువాడు చచ్చును
వాటిలో ఒకదానిని ఎవడైన త్రొక్కినయెడల విష
సర్పము పుట్టును.
6వారి పట్టు బట్టనేయుటకు పనికిరాదువారు నేసినది ధరించుకొనుటకు ఎవనికిని వినియో
గింపదు
వారి క్రియలు పాపక్రియలేవారు బలాత్కారము చేయువారే.
7వారి కాళ్లు పాపముచేయ పరుగెత్తుచున్నవి
నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును
వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు
పాడును నాశనమును వారి త్రోవలలో ఉన్నవి
8శాంతవర్తనమును వారెరుగరువారి నడవడులలో న్యాయము కనబడదువారు తమకొరకు వంకరత్రోవలు కల్పించుకొనుచున్నారు
వాటిలో నడచువాడెవడును శాంతి నొందడు.
9కావున న్యాయము మాకు దూరముగా ఉన్నది
నీతి మమ్మును కలిసికొనుటలేదు
వెలుగుకొరకు మేముకనిపెట్టుకొనుచున్నాము గాని
చీకటియే ప్రాప్తించును
ప్రకాశముకొరకు ఎదురుచూచుచున్నాము గాని
అంధకారములోనే నడచుచున్నాము
10గోడ కొరకు గ్రుడ్డివారివలె తడవులాడుచున్నాము
కన్నులు లేనివారివలె తడవులాడుచున్నాము
సంధ్యచీకటియందువలెనే మధ్యాహ్నకాలమున కాలు
జారి పడుచున్నాము
బాగుగ బ్రతుకుచున్నవారిలోనుండియు చచ్చినవారి
వలె ఉన్నాము.
11మేమందరము ఎలుగుబంట్లవలె బొబ్బరించుచున్నాము
గువ్వలవలె దుఃఖరవము చేయుచున్నాము
న్యాయముకొరకు కాచుకొనుచున్నాము గాని అది
లభించుటలేదు
రక్షణకొరకు కాచుకొనుచున్నాము గాని అది మాకు
దూరముగా ఉన్నది
12మేము చేసిన తిరుగుబాటుక్రియలు నీ యెదుట విస్త
రించియున్నవి
మా పాపములు మామీద సాక్ష్యము పలుకుచున్నవి
మా తిరుగుబాటుక్రియలు మాకు కనబడుచున్నవి.
మా దోషములు మాకు తెలిసేయున్నవి.
13తిరుగుబాటు చేయుటయు
యెహోవాను విసర్జించుటయు
మా దేవుని వెంబడింపక వెనుకదీయుటయు
బాధకరమైన మాటలు విధికి వ్యతిరిక్తమైన మాటలు
వచించుటయు
హృదయమున యోచించుకొని అసత్యపుమాటలు పలు
కుటయు
ఇవియే మావలన జరుగుచున్నవి.
14న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది
నీతి దూరమున నిలుచుచున్నది
సత్యము సంతవీధిలో పడియున్నది
ధర్మము లోపల ప్రవేశింపనేరదు.
15సత్యము లేకపోయెను
చెడుతనము విసర్జించువాడు దోచబడుచున్నాడు
న్యాయము జరుగకపోవుట యెహోవా చూచెను అది
ఆయన దృష్టికి ప్రతికూలమైయుండెను.
16సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను
మధ్యవర్తిలేకుండుట చూచి ఆశ్చర్యపడెను.
కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయము
చేసెను
ఆయన నీతియే ఆయనకు ఆధారమాయెను.
17నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను
రక్షణను తలమీద శిరస్త్రాణముగా ధరించుకొనెను
18ప్రతిదండనను వస్త్రముగా వేసికొనెను
ఆసక్తిని పైవస్త్రముగా ధరించుకొనెను
వారి క్రియలనుబట్టి ఆయన ప్రతి దండన చేయును
తన శత్రువులకు రౌద్రము చూపును
తన విరోధులకు ప్రతికారము చేయును
ద్వీపస్థులకు ప్రతికారము చేయును.
19పడమటి దిక్కుననున్నవారు యెహోవా నామమునకు
భయపడుదురు
సూర్యోదయ దిక్కుననున్నవారు ఆయన మహిమకు
భయపడుదురు
యెహోవా పుట్టించుగాలికి కొట్టుకొనిపోవు ప్రవాహ
జలమువలె ఆయన వచ్చును.
20సీయోనునొద్దకును యాకోబులో తిరుగుబాటు చేయుట
మాని మళ్లుకొనిన వారియొద్దకును విమోచకుడు
వచ్చును
ఇదే యెహోవా వాక్కు.
21నేను వారితోచేయు నిబంధన యిది
–నీ మీదనున్న నా ఆత్మయు
నేను నీ నోటనుంచిన మాటలును
నీ నోటనుండియు నీ పిల్లల నోటనుండియు
నీ పిల్లల పిల్లల నోటనుండియు
ఈ కాలము మొదలుకొని యెప్పుడును తొలగిపోవు
అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
Currently Selected:
యెషయా 59: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.