యెషయా 58
58
1తాళక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలువేయుమువారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయుము
యాకోబు ఇంటివారికి వారి పాపములను తెలియజేయుము
2తమ దేవుని న్యాయవిధిని విడువక
నీతిని అనుసరించువారైనట్టు
అనుదినము వారు నాయొద్ద విచారణ చేయుచు
నా మార్గములను తెలిసికొన నిచ్ఛ కనుపరచుదురు
తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలెనని వారడు
గుదురు
దేవుడు తమకు ప్రత్యక్షుడు కావలెనని యిచ్ఛ
యింతురు.
3మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు?
మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా
నీవెందుకు లక్ష్యపెట్టవు? అని అందురు
మీ ఉపవాసదినమున మీరు మీ వ్యాపారము
చేయుదురు.
మీ పనివారిచేత కఠినమైనపని చేయించుదురు
4మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయ
ముగా గుద్దులాడుచు ఉపవాసముందురు
మీ కంఠధ్వని పరమున వినబడునట్లుగా మీరిప్పుడు
ఉపవాసముండరు.
5అట్టి ఉపవాసము నాకనుకూలమా?
మనుష్యుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన
దినము అట్టిదేనా?
ఒకడు జమ్మువలె తలవంచుకొని గోనెపట్ట కట్టుకొని
బూడిదె పరచుకొని కూర్చుండుట ఉపవాసమా?
అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరను
కొందురా?
6దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు
కాడిమాను మోకులు తీయుటయు
బాధింపబడినవారిని విడిపించుటయు
ప్రతి కాడిని విరుగగొట్టుటయు
నే నేర్పరచుకొనిన ఉపవాసము గదా?
7-8నీ ఆహారము ఆకలిగొనినవారికి పెట్టుటయు నీ రక్త
సంబంధికి ముఖము తప్పింపకుండుటయు
దిక్కుమాలిన బీదలను నీ యింట చేర్చుకొనుటయు
వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము
లిచ్చుటయు
ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము?
ఆలాగున నీవు చేసినయెడల నీ వెలుగు వేకువ చుక్క
వలె ఉదయించును
స్వస్థత నీకు శీఘ్రముగా లభించును
నీ నీతి నీ ముందర నడచును
యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును
కావలికాయును.
9అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తర మిచ్చును
నీవు మొఱ్ఱపెట్టగా ఆయన–నేనున్నాననును.
ఇతరులను బాధించుటయు
వ్రేలుపెట్టి చూపి తిరస్కరించుటయు
చెడ్డదానినిబట్టి మాటలాడుటయు నీవు మాని
10ఆశించినదానిని ఆకలిగొనినవానికిచ్చి శ్రమపడినవానిని
తృప్తిపరచినయెడల
చీకటిలో నీ వెలుగు ప్రకాశించును
అంధకారము నీకు మధ్యాహ్నమువలె నుండును.
11యెహోవా నిన్ను నిత్యము నడిపించును
క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ యెముక
లను బలపరచును
నీవు నీరు కట్టిన తోటవలెను
ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు.
12పూర్వకాలమునుండి పాడైపోయిన స్థలములను నీ
జనులు కట్టెదరు
అనేకతరముల క్రిందట పాడైపోయిన పునాదులను
నీవు మరల కట్టెదవు
విరువబడినదానిని బాగుచేయువాడవనియు
దేశములో నివసించునట్లుగా త్రోవలు సిద్ధపరచువాడ
వనియు నీకు పేరు పెట్టబడును.
13నా విశ్రాంతిదినమున వ్యాపారము చేయకుండ
నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండినయెడల
విశ్రాంతిదినము మనోహరమైనదనియు
యెహోవాకు ప్రతిష్ఠితదినమనియు ఘనమైనదనియు
అనుకొని దాని ఘనముగా ఆచరించినయెడల
నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయ
కయు
లోకవార్తలు చెప్పుకొనకయు ఉండినయెడల
14నీవు యెహోవాయందు ఆనందించెదవు
దేశముయొక్క ఉన్నతస్థలములమీద నేను నిన్నెక్కిం
చెదను
నీ తండ్రియైన యాకోబు స్వాస్థ్యమును నీ యనుభవ
ములో ఉంచెదను
యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే.
Currently Selected:
యెషయా 58: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.