YouVersion Logo
Search Icon

యెషయా 57

57
1నీతిమంతులు నశించుట చూచి యెవరును దానిని
మనస్సున పెట్టరు
భక్తులైనవారు తీసికొనిపోబడుచున్నారు
కీడు చూడకుండ నీతిమంతులుకొనిపోబడుచున్నారని
యెవనికిని తోచదు.
2వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు
తమకు సూటిగానున్న మార్గమున నడచువారు
తమ పడకలమీద పరుండి విశ్రమించుచున్నారు.
3మంత్రప్రయోగపు కొడుకులారా, వ్యభిచార
సంతానమా,
వేశ్యాసంతానమా, మీరక్కడికి రండి.
4మీరెవని ఎగతాళి చేయుచున్నారు?
ఎవని చూచి నోరు తెరచి నాలుక చాచుచున్నారు?
మీరు తిరుగుబాటు చేయువారును అబద్ధికులును
కారా?
5మస్తచావృక్షములను#57:5 సింధూర వృక్షములను. చూచి పచ్చని ప్రతిచెట్టు
క్రిందను కామము రేపుకొనువారలారా,
లోయలలో రాతిసందులక్రింద పిల్లలను చంపువార
లారా,
6నీ భాగ్యము లోయలోని రాళ్లలోనే యున్నది
అవియే నీకు భాగ్యము, వాటికే పానీయార్పణము
చేయుచున్నావు
వాటికే నైవేద్యము నర్పించుచున్నావు.
ఇవన్నియు జరుగగా నేను ఊరకుండదగునా?
7ఉన్నతమైన మహాపర్వతముమీద నీ పరుపు వేసి
కొంటివి
బలి అర్పించుటకు అక్కడికే యెక్కితివి
తలుపువెనుకను ద్వారబంధము వెనుకను
నీ జ్ఞాపకచిహ్నము ఉంచితివి
8నాకు మరుగై బట్టలు తీసి మంచమెక్కితివి
నీ పరుపు వెడల్పుచేసికొని నీ పక్షముగా వారితో
నిబంధన చేసితివి
నీవు వారి మంచము కనబడిన చోట దాని ప్రేమిం
చితివి.
9నీవు తైలము తీసికొని రాజునొద్దకు పోతివి
పరిమళ ద్రవ్యములను విస్తారముగా తీసికొని
నీ రాయబారులను దూరమునకు పంపితివి
పాతాళమంత లోతుగా నీవు లొంగితివి
10నీ దూరప్రయాణముచేత నీవు ప్రయాసపడినను
అది అసాధ్యమని నీవనుకొనలేదు
నీవు బలము తెచ్చుకొంటిని గనుక నీవు సొమ్మసిల్లలేదు.
11ఎవనికి జడిసి భయపడినందున ఆ సంగతి మనస్క
రింపకపోతివి?
నీవు కల్లలాడి నన్ను జ్ఞాపకము చేసికొనకపోతివి
బహుకాలమునుండి నేను మౌనముగానుండినందుననే
గదా
నీవు నాకు భయపడుట లేదు?
12నీ నీతి యెంతో నేనే తెలియజేసెదను, నీ క్రియలు
నీకు నిష్‌ప్రయోజనములగును.
13నీవు మొఱ్ఱపెట్టునప్పుడు నీ విగ్రహముల గుంపు నిన్ను
తప్పించునేమో
గాలి వాటినన్నిటిని ఎగరగొట్టును గదా?
ఒకడు ఊపిరి విడిచినమాత్రమున అవియన్నియు
కొట్టుకొనిపోవును
నన్ను నమ్ముకొనువారు దేశమును స్వతంత్రించు
కొందురు
నా పరిశుద్ధపర్వతమును స్వాధీనపరచుకొందురు.
14–ఎత్తుచేయుడి ఎత్తుచేయుడి
త్రోవను సిద్ధపరచుడి, అడ్డు చేయుదానిని నా జనుల
మార్గములోనుండి తీసివేయుడి
అని ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు.
15మహా ఘనుడును మహోన్నతుడును
పరిశుద్ధుడును నిత్యనివాసియునైనవాడు ఈలాగు సెల
విచ్చుచున్నాడు
–నేను మహోన్నతమైన పరిశుద్ధస్థలములో నివసించు
వాడను
అయినను వినయముగలవారి ప్రాణమును ఉజ్జీవింప
జేయుటకును
నలిగినవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును
వినయముగలవారియొద్దను దీనమనస్సుగలవారియొద్దను
నివసించుచున్నాను.
16నేను నిత్యము పోరాడువాడను కాను
ఎల్లప్పుడును కోపించువాడను కాను
ఆలాగుండినయెడల నా మూలముగా జీవాత్మ క్షీణిం
చును
నేను పుట్టించిన నరులు క్షీణించిపోవుదురు.
17వారి లోభమువలన కలిగిన దోషమునుబట్టి నేను
ఆగ్రహపడి వారిని కొట్టితిని
నేను నా ముఖము మరుగుచేసికొని కోపించితినివారు తిరుగబడి తమకిష్టమైన మార్గమున నడచుచు
వచ్చిరి.
18నేను వారి ప్రవర్తనను చూచితిని
వారిని స్వస్థపరచుదును వారిని నడిపింతునువారిలో దుఃఖించువారిని ఓదార్చుదును.
19వారిలో కృతజ్ఞతాబుద్ధి పుట్టించుచు
దూరస్థులకును సమీపస్థులకును సమాధానము సమా
ధానమని చెప్పి
నేనే వారిని స్వస్థపరచెదనని యెహోవా సెలవిచ్చు
చున్నాడు.
20భక్తిహీనులు కదలుచున్న సముద్రమువంటివారు
అది నిమ్మళింపనేరదు
దాని జలములు బురదను మైలను పైకివేయును.
21దుష్టులకు నెమ్మదియుండదని నా దేవుడు సెలవిచ్చు
చున్నాడు.

Currently Selected:

యెషయా 57: TELUBSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in