YouVersion Logo
Search Icon

యెషయా 46

46
1బేలు కూలుచున్నది నెబో క్రుంగుచున్నది
వాటి ప్రతిమలు జంతువులమీదను పశువులమీదను
మోయబడుచున్నవి
2మీ మోతలు సొమ్మసిల్లు పశువులకు భారముగా నున్నవి
అవి క్రుంగుచు కూలుచు నుండి ఆ బరువులను విడి
పించుకొనలేక తామే చెరలోనికి పోయియున్నవి.
3యాకోబు ఇంటివారలారా, ఇశ్రాయేలు ఇంటివారిలో శేషించినవారలారా,
గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన
వారలారా,
తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక
పెట్టుకొనినవారలారా,
నా మాట ఆలకించుడి.
4ముదిమి వచ్చువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే తల
వెండ్రుకలు నెరయువరకు నిన్ను ఎత్తికొనువాడను
నేనే
నేనే చేసియున్నాను చంకపెట్టుకొనువాడను నేనే
నిన్ను ఎత్తికొనుచు రక్షించువాడను నేనే.
5మేము సమానులమని నన్ను ఎవనికి సాటిచేయుదురు?
మేము సమానులమని యెవని నాకు పోటిగా చేయుదురు?
6దానికి సాగిలపడి నమస్కారము చేయుటకై
సంచినుండి బంగారము మెండుగా పోయువారును
వెండి తూచువారును
దాని దేవతగా నిరూపించవలెనని కంసాలిని కూలికి
పిలుతురు.
7వారు భుజముమీద దాని నెక్కించుకొందురు
దాని మోసికొనిపోయి తగినచోట నిలువబెట్టుదురు
ఆ చోటు విడువకుండ అది అక్కడనే నిలుచును
ఒకడు దానికి మొఱ్ఱపెట్టినను ఉత్తరము చెప్పదు
వాని శ్రమ పోగొట్టి యెవనిని రక్షింపదు.
8దీని జ్ఞాపకము చేసికొని ధైర్యముగా నుండుడి
అతిక్రమము చేయువారలారా, దీని ఆలోచించుడి
9చాల పూర్వమున జరిగినవాటిని జ్ఞాపకము చేసికొనుడి
దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు
నేను దేవుడను నన్ను పోలినవాడెవడును లేడు.
10నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెర
వేర్చుకొనెదననియు చెప్పుకొనుచు
ఆదినుండి నేనే కలుగబోవువాటిని తెలియజేయు
చున్నాను.
పూర్వకాలమునుండి నేనే యింక జరుగనివాటిని
తెలియజేయుచున్నాను.
11తూర్పునుండి క్రూరపక్షిని రప్పించుచున్నాను
దూరదేశమునుండి నేను యోచించిన కార్యమును నెర
వేర్చువానిని పిలుచుచున్నాను
నేను చెప్పియున్నాను దాని నెరవేర్చెదను
ఉద్దేశించియున్నాను సఫలపరచెదను.
12కఠినహృదయులై నీతికి దూరముగా ఉన్నవారలారా,
నా మాట ఆలకించుడి
13నా నీతిని దగ్గరకు రప్పించియున్నాను అది దూరమున
లేదు
నా రక్షణ ఆలస్యము చేయలేదు
సీయోనులో రక్షణనుండ నియమించుచున్నాను
ఇశ్రాయేలునకు నా మహిమను అనుగ్రహించు
చున్నాను.

Currently Selected:

యెషయా 46: TELUBSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in