యెషయా 45
45
1అతని పక్షమున జనములను జయించుటకు నేను
అతని కుడిచేతిని పట్టుకొనియున్నాను
నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని
యెదుట వేయబడకుండ తలుపులు తీసెదను
అని యెహోవా తాను అభిషేకించిన కోరెషును
గురించి సెలవిచ్చుచున్నాడు.
2–నేను నీకు ముందుగా పోవుచు మెట్టగానున్న స్థల
ములను సరాళముచేసెదను.
ఇత్తడి తలుపులను పగులగొట్టెదను ఇనుపగడియలను
విడగొట్టెదను.
3పేరుపెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన
యెహోవాను నేనే యని నీవు తెలిసికొనునట్లు
అంధకారస్థలములలో ఉంచబడిన నిధులను
రహస్యస్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను.
4నా సేవకుడైన యాకోబు నిమిత్తము
నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు నిమిత్తము నేను
నీకు పేరుపెట్టి నిన్ను పిలిచితిని.
నీవు నన్ను ఎరుగకుండినప్పటికిని నీకు బిరుదులిచ్చితిని
5నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు
నేను తప్ప ఏ దేవుడును లేడు.
6తూర్పుదిక్కునుండి పడమటిదిక్కువరకు
నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలిసికొను
నట్లు
నీవు నన్ను ఎరుగకుండినప్పటికిని నిన్ను సిద్ధపరచితిని
యెహోవాను నేనే నేను తప్ప మరి ఏ దేవుడును
లేడు
7నేను వెలుగును సృజించువాడను
అంధకారమును కలుగజేయువాడను
సమాధానకర్తను కీడును కలుగజేయువాడను నేనే
యెహోవా అను నేనే వీటినన్నిటిని కలుగజేయు
వాడను.
8ఆకాశమండలము నీతిని కురిపించునట్లు
అంతరిక్షమా, మహావర్షము వర్షించుము
భూమి నెరలువిడిచి రక్షణ ఫలించునట్లు భూమి
నీతిని మొలిపించును గాక
యెహోవానగు నేను దాని కలుగజేసియున్నాను.
9మంటికుండ పెంకులలో ఒక పెంకై యుండి తన్ను
సృజించినవానితో వాదించువానికి శ్రమ.
జిగటమన్ను దాని రూపించువానితో నీవేమిచేయు
చున్నావని అనదగునా?
వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా?
10నీవు ఏమి కనుచున్నావని తన తండ్రితో చెప్పువానికి
శ్రమ
నీవు గర్భము ధరించినదేమి అని స్త్రీతో చెప్పువానికి
శ్రమ.
11ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడగు సృష్టికర్తయైన
యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు
–రాగలవాటినిగూర్చి నన్నడుగుదురా?#45:11 అడుగుడి.
నా కుమారులనుగూర్చియు నా హస్తకార్యములను
గూర్చియు నాకే ఆజ్ఞాపింతురా?#45:11 ఆజ్ఞాపించుడి.
12భూమిని కలుగజేసినవాడను నేనే దానిమీదనున్న
నరులను నేనే సృజించితిని
నా చేతులు ఆకాశములను విశాలపరచెను
వాటి సర్వసమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చితిని.
13నీతినిబట్టి కోరెషును రేపితిని
అతని మార్గములన్నియు సరాళముచేసెదను
అతడు నా పట్టణమును కట్టించును
క్రయధనము తీసికొనకయు లంచము పుచ్చు
కొనకయు
నేను వెలివేసినవారిని అతడు విడిపించును
14యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు
–ఐగుప్తీయుల కష్టార్జితమును కూషు వర్తక లాభమును
నీకు దొరుకును
దీర్ఘదేహులైన సెబాయీయులును నీయొద్దకు వచ్చి
నీవారగుదురువారు నీవెంట వచ్చెదరు సంకెళ్లు కట్టుకొని వచ్చి నీ
యెదుట సాగిలపడుదురు
–నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు మరి ఏ
దేవుడును లేడు
ఆయన తప్ప ఏ దేవుడును లేడు అని చెప్పుచు నీకు
విన్నపము చేసెదరు.
15ఇశ్రాయేలు దేవా, రక్షకా, నిశ్చయముగా నీవు నిన్ను
మరుగుపరచుకొను దేవుడవైయున్నావు.
16విగ్రహములు చేయువారు సిగ్గుపడినవారైరి
వారందరు విస్మయము పొందియున్నారు.
ఒకడును మిగులకుండ అందరు కలవరపడుదురు.
17యెహోవావలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది
యున్నది
మీరు ఎన్నటెన్నటికి సిగ్గుపడకయు విస్మయమొంద
కయు నుందురు.
18ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు;
ఆయన భూమిని కలుగజేసి దాని సిద్ధపరచి స్థిర
పరచెను
నిరాకారముగానుండునట్లు ఆయన దాని సృజింప
లేదు
నివాసస్థలమగునట్లుగా దాని సృజించెను
ఆయన సెలవిచ్చునదేమనగా–
యెహోవాను నేనే మరి ఏ దేవుడును లేడు.
19అంధకారదేశములోని మరుగైనచోటున నేను మాట
లాడలేదు
–మాయాస్వరూపుడనైనట్టు#45:19 లేక, వ్యర్థముగా. నన్ను వెదకుడని
యాకోబు సంతానముతో నేను చెప్పలేదు
నేను న్యాయమైన సంగతులు చెప్పువాడను
యథార్థమైన సంగతులు తెలియజేయువాడను అగు
యెహోవాను నేనే.
20కూడి రండి జనములలో తప్పించుకొనినవారలారా,
దగ్గరకు వచ్చి కూడుకొనుడి
తమ కొయ్యవిగ్రహమును మోయుచు రక్షింపలేని
దేవతకు మొఱ్ఱపెట్టువారికి తెలివిలేదు.
21మీ ప్రమాణవాక్యములు నా సన్నిధిని తెలియ
జేయుడి
జనులు కూడుకొని ఆలోచనచేసికొందురు గాక;
పూర్వకాలము మొదలుకొని ఆ కార్యమును తెలియ
జేసినవాడెవడు?
చాలకాలముక్రిందట దాని ప్రకటించినవాడెవడు?
యెహోవానగు నేనే గదా? నేను తప్ప వేరొక దేవుడు
లేడు.
నేను నీతిపరుడనగు దేవుడను, రక్షించువాడను నేనే
నేను తప్ప మరి ఏ దేవుడును లేడు
22భూదిగంతముల నివాసులారా, నావైపు చూచి
రక్షణ పొందుడి
దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు.
23–నా యెదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి
నాలుకయు నాతోడని ప్రమాణము చేయుననియు
నేను నా పేరట ప్రమాణము చేసియున్నాను
నీతిగల నా నోటి మాట బయలుదేరియున్నది
అది వ్యర్థము కానేరదు.
24యెహోవాయందే నీతి బలములున్నవని జనులు నన్ను
గూర్చి చెప్పుదురు
ఆయనయొద్దకే మనుష్యులు వచ్చెదరు
ఆయనమీద కోపపడినవారందరు సిగ్గుపడుదురు
25యెహోవాయందే ఇశ్రాయేలు సంతతివారందరు
నీతిమంతులుగా ఎంచబడినవారై యతిశయపడుదురు.
Currently Selected:
యెషయా 45: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.