YouVersion Logo
Search Icon

యెషయా 44

44
1అయినను నా సేవకుడవగు యాకోబూ, నేను
ఏర్పరచుకొనిన ఇశ్రాయేలూ, వినుము
2నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు
సహాయము చేయువాడైన యెహోవా ఈలాగు
సెలవిచ్చుచున్నాడు
–నా సేవకుడవగు యాకోబూ, నేను ఏర్పరచుకొనిన
యెషూరూనూ, భయపడకుము.
3నేను దప్పిగలవానిమీద నీళ్లను
ఎండిన భూమిమీద ప్రవాహజలములను కుమ్మరించెదను
నీ సంతతిమీద నా ఆత్మను కుమ్మరించెదను
నీకు పుట్టినవారిని నేనాశీర్వదించెదను.
4నీటికాలువలయొద్ద నాటబడిన నిరవంజిచెట్లు గడ్డిలో
ఎదుగునట్లువారు ఎదుగుదురు.
5ఒకడు–నేను యెహోవావాడననును, మరియొకడు
యాకోబు పేరు చెప్పుకొనును,
మరియొకడు యెహోవావాడనని తన చేతితో వ్రాసి
ఇశ్రాయేలను మారుపేరు పెట్టుకొనును.
6ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా
వారి విమోచకుడైన సైన్యములకధిపతియగు యెహోవా
ఈలాగు సెలవిచ్చుచున్నాడు
నేను మొదటివాడను కడపటివాడను
నేను తప్ప ఏ దేవుడును లేడు.
7ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని
నేను తెలియజేయుచు వచ్చినట్లు తెలియజేయగల
వాడెవడు?
అట్టివాడెక్కడైన నుండినయెడల నాకు తెలియజెప్ప
వలెను
ఆ సంగతి నాకు ప్రచురింపవలెను
అట్టివారు భవిష్యద్విషయమును రాబోవు సంగతులను
తెలియజెప్పువారై యుండవలెను.
8మీరు వెరవకుడి భయపడకుడి
పూర్వకాలమునుండి నేను నీకు ఆ సంగతి వినిపించి
తెలియజేయలేదా?
మీరే నాకు సాక్షులు, నేను తప్ప వేరొక దేవు
డున్నాడా?
నేను తప్ప ఆశ్రయ దుర్గమేదియు లేదు, ఉన్నట్టు నే
నెరుగను.
9విగ్రహమును నిర్మించువారందరు మాయవంటివారువారికిష్టమైన విగ్రహములు నిష్‌ప్రయోజనములు
తామే అందుకు సాక్షులు, వారు గ్రహించువారు
కారు ఎరుగువారు కారు గనుక వారు సిగ్గుపడరు.
10ఎందుకును పనికిరాని విగ్రహమును పోతపోసి దాని
నొక దేవునిగా నిరూపించువాడెవడు?
11ఇదిగో దాని పూజించువారందరు సిగ్గుపడుదురు
ఆ శిల్పకారులు నరమాత్రులేగదా? వారందరు పోగు
చేయబడి నిలువబడవలెను
నిశ్చయముగా వారు భయపడి సిగ్గుపడుదురు.
12కమ్మరి గొడ్డలి పదును చేయుచు నిప్పులతో పని
చేయును
సుత్తెతో దానిని రూపించి తన బాహుబలముచేత
దాని చేయును.
అతడు ఆకలిగొనగా అతని బలము క్షీణించిపోవును
నీళ్లు త్రాగక సొమ్మసిల్లును
13వడ్లవాడు నూలు వేసి చీరణముతో గీత గీచి చిత్రిక
లతో దాని చక్కచేయును
కర్కాటకములతో గురుతుపెట్టి దాని రూపించును
మందిరములో దాని స్థాపింపవలెనని నరరూపముగల
దానిగాను నరసౌందర్యముగలదానిగాను చేయును.
14ఒకడు దేవదారుచెట్లను నరుకవలెనని పూనుకొనును
శ్మశానవృక్షమును గాని సరళవృక్షమును గాని
సింధూరవృక్షములనుగాని అడవి వృక్షములలో
ఏదో ఒకదానిని తీసికొనును
ఒకడు చెట్టు నాటగా వర్షము దాని పెంచును
15ఒకడు పొయ్యికట్టెలకు వాటి నుపయోగించును
వాటిలో కొంతతీసికొని చలి కాచుకొనును
నిప్పు రాజబెట్టి రొట్టె కాల్చుకొనును
ఒక తుండు తీసికొని దానితో ఒక దేవతను చేసికొనును
దానికి నమస్కారము చేయును
దానితో ఒక విగ్రహముచేసి దానికి సాగిలపడును.
16అగ్నితో సగము కాల్చియున్నాడు, కొదువ సగ
ముతో మాంసము వండి భక్షించియున్నాడు
తిని తృప్తిపొందగా చలి కాచుకొనుచు
ఆహా, చలికాచుకొంటిని వెచ్చగా ఉన్నది అని అను
కొనుచున్నాడు
17దానిలో మిగిలిన భాగముతో తనకు దేవతగానున్న
విగ్రహమును చేయించుకొనును
దానియెదుట సాగిలపడుచు నమస్కారము చేయుచు
–నీవే నా దేవుడవు నన్ను రక్షింపుమని ప్రార్థించును.
18వారు వివేచింపరు గ్రహింపరు
చూడకుండునట్లు వారి కన్నులు కప్పబడెను
గ్రహింపకుండునట్లు వారి హృదయములు మూయ
బడెను.
19ఎవడును ఆలోచనచేయడు, నేను అగ్నిలో సగము
కాల్చితిని
నిప్పులమీద వేసి రొట్టె కాల్చితిని
దానితో మాంసము వండుకొని భోజనముచేసితిని
మిగిలినదానిని తీసికొని దానితో హేయమైనదాని
చేయుదునా?
చెట్టు మొద్దుకు సాష్టాంగపడుదునా? అని యెవడును
ఆలోచింపడు
యోచించుటకు ఎవనికిని తెలివిలేదు వివేచనలేదు.
20వాడు బూడిదె తినుచున్నాడు, వాని మనస్సు
మోసపోయినదై తప్పుదారిని వాని తీసికొనిపోవుచున్నది
వాడు తన ఆత్మను రక్షించుకొనజాలడనియు
నా కుడిచేతిలో అబద్ధమున్నది గదా అనియు అను
కొనుటకు వానికి బుద్ధి చాలదు.
21యాకోబూ, ఇశ్రాయేలూ; వీటిని జ్ఞాపకము చేసికొనుము
నీవు నా సేవకుడవు నేను నిన్ను నిర్మించితిని
ఇశ్రాయేలూ, నీవు నాకు సేవకుడవై యున్నావు
నేను నిన్ను మరచిపోజాలను.
22మంచు విడిపోవునట్లుగా నేను నీ యతిక్రమములను
మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి
యున్నాను
నేను నిన్ను విమోచించియున్నాను, నాయొద్దకు
మళ్లుకొనుము.
23యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసియున్నాడు
ఆకాశములారా, ఉత్సాహధ్వని చేయుడి
భూమి అగాధస్థలములారా, ఆర్భాటము చేయుడి
పర్వతములారా, అరణ్యమా, అందులోని ప్రతి
వృక్షమా, సంగీతనాదము చేయుడి.
యెహోవా యాకోబును విమోచించును
ఆయన ఇశ్రాయేలులో తన్నుతాను మహిమోన్న
తునిగా కనుపరచుకొనును
24గర్భమునుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు
యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు
–యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను
నేనొకడనే ఆకాశమును విశాలపరచినవాడను
నేనే భూమిని పరచినవాడను
25నేనే ప్రగల్భుల ప్రవచనములను వ్యర్థముచేయు వాడను
సోదెగాండ్రను వెఱ్ఱివారినిగా చేయువాడను
జ్ఞానులను వెనుకకు త్రిప్పి వారి విద్యను అవిద్యగా
చేయువాడను నేనే.
26నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను
నా దూతల ఆలోచన నెరవేర్చువాడను
–యెరూషలేము నివాసస్థలమగుననియు
యూదా నగరులనుగూర్చి అవి కట్టబడుననియు
నేను ఆజ్ఞ ఇచ్చియున్నాను, దాని పాడైన స్థలములను
బాగుచేయువాడను నేనే.
27నేనే నీ నదులను ఎండచేయుచున్నాను ఎండిపొమ్మని
ప్రవాహముతో నేనే చెప్పుచున్నాను
28కోరెషుతో–నా మందకాపరీ, నా చిత్తమంతయు
నెరవేర్చువాడా, అని చెప్పువాడను నేనే.
యెరూషలేముతో–నీవు కట్టబడుదువనియు దేవాలయ
మునకు పునాదివేయబడుననియు నేను చెప్పు
చున్నాను.

Currently Selected:

యెషయా 44: TELUBSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in