YouVersion Logo
Search Icon

యెషయా 47

47
1కన్యకయైన బబులోనూ, క్రిందికి దిగి మంటిలో .
కూర్చుండుము
కల్దీయుల కుమారీ, సింహాసనము లేకయే నేలమీద
కూర్చుండుము
నీవు మృదువువనియైనను సుకుమారివనియైనను జనులు
ఇకమీదట చెప్పరు.
2తిరుగటిదిమ్మలు తీసికొని పిండి విసరుము
నీ ముసుకు పారవేయుము
కాలిమీద జీరాడు వస్త్రము తీసివేయుము
కాలిమీది బట్ట తీసి నదులు దాటుము.
3నీ కోకయు తీసివేయబడును నీకు కలిగిన యవమానము
వెల్లడియగును
నేను ప్రతి దండన చేయుచు నరులను మన్నింపను.
4సైన్యములకధిపతియు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ
దేవుడునగు యెహోవా అని మా విమోచకునికి
పేరు.
5కల్దీయుల కుమారీ, మౌనముగా నుండి చీకటిలోనికి
పొమ్ము
రాజ్యములకు దొరసానియని యికమీదట జనులు
నిన్నుగూర్చి చెప్పరు.
6నా జనులమీద కోపపడి నా స్వాస్థ్యము నపవిత్ర
పరచి వారిని నీ చేతికి అప్పగించితిని
నీవు వారియందు కనికరపడక వృద్ధులమీద నీ కాడి
మ్రానును మిక్కిలి బరువుగా మోపితివి.
7నేను సర్వదా దొరసానినై యుందునని నీవనుకొని
వీటిని ఆలోచింపకపోతివి
వాటి ఫలమేమవునో మనస్సునకు తెచ్చుకొనకపోతివి.
8కాబట్టి సుఖాసక్తురాలవై నిర్భయముగా నివసించుచు
–నేనే ఉన్నాను నేను తప్ప మరి ఎవరును లేరు
నేను విధవరాలనై కూర్చుండను పుత్రశోకము నేను
చూడనని
అనుకొనుచున్నదానా, ఈ మాటను వినుము
9–ఒక్క దినములోగా ఒక్క నిమిషముననే పుత్ర
శోకమును వైధవ్యమును ఈ రెండును నీకు సంభ
వించును.
నీవు అధికముగా శకునము చూచినను
అత్యధికమైన కర్ణపిశాచ తంత్రములను నీవు ఆధార
ముగా చేసికొనినను
ఆ యపాయములు నీమీదికి సంపూర్తిగా వచ్చును.
10నీ చెడుతనమును నీవు ఆధారము చేసికొని యెవడును
నన్ను చూడడని అనుకొంటివి
–నేనున్నాను నేను తప్ప మరి ఎవరును లేరని నీవను
కొనునట్లుగా
నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసెను.
11కీడు నీమీదికివచ్చును నీవు మంత్రించి దాని పోగొట్ట
జాలవు
ఆ కీడు నీమీద పడును దానిని నీవు నివారించలేవు
నీకు తెలియని నాశనము నీమీదికి ఆకస్మికముగా
వచ్చును.
12నీ బాల్యమునుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ
కర్ణపిశాచ తంత్రములను
నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువుము
ఒకవేళ అవి నీకు ప్రయోజనములగునేమో
ఒకవేళ నీవు మనుష్యులను బెదరింతువేమో
13నీ విస్తారమైన యోచనలవలన నీవు అలసియున్నావు
జ్యోతిష్కులు నక్షత్రసూచకులు మాసచర్య చెప్పువారు నిలువబడి
నీమీదికి వచ్చునవి రాకుండ నిన్ను తప్పించి రక్షించుదు
రేమో ఆలోచించుము.
14వారు కొయ్యకాలువలెనైరి అగ్ని వారిని కాల్చివేయుచున్నది
జ్వాలయొక్క బలమునుండి తమ్ముతాము తప్పించుకొన
లేక యున్నారు
అది కాచుకొనుటకు నిప్పుకాదు ఎదుట కూర్చుండి
కాచుకొనదగినది కాదు.
15నీవు ఎవరికొరకు ప్రయాసపడి అలసితివో వారికి
ఆలాగే జరుగుచున్నది
నీ బాల్యము మొదలుకొని నీతో వ్యాపారముచేయువారు తమతమ చోట్లకు వెళ్లిపోవుచున్నారు
నిన్ను రక్షించువాడొకడైన నుండడు.

Currently Selected:

యెషయా 47: TELUBSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in