యెషయా 35
35
1అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును
అడవి ఉల్లసించి కస్తూరిపుష్పమువలె పూయును
2అది బహుగా పూయుచు ఉల్లసించును
ఉల్లసించి సంగీతములు పాడును
లెబానోను సౌందర్యము దానికి కలుగును
కర్మెలు షారోనులకున్న సొగసు దానికుండును
అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును
చూచును.
3సడలిన చేతులను బలపరచుడి
తొట్రిల్లు మోకాళ్లను దృఢపరచుడి.
4తత్తరిల్లు హృదయులతో ఇట్లనుడి
–భయపడక ధైర్యముగా ఉండుడి
ప్రతి దండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు
ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతికారమును
ఆయన చేయును
ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును.
5గ్రుడ్డివారి కన్నులు తెరవబడును
చెవిటివారి చెవులు విప్పబడును
6కుంటివాడు దుప్పివలె గంతులువేయును
మూగవాని నాలుక పాడును
అరణ్యములో నీళ్లు ఉబుకును
అడవిలో కాలువలు పారును
7ఎండమావులు మడుగులగును
ఎండిన భూమిలో నీటిబుగ్గలు పుట్టును
నక్కలు పండుకొనినవాటి ఉనికిపట్టులో జమ్మును
తుంగగడ్డియు మేతయు పుట్టును.
8అక్కడ దారిగా నున్న రాజమార్గము ఏర్పడును
అది పరిశుద్ధ మార్గమనబడును
అది అపవిత్రులు పోకూడని మార్గము
అది మార్గమున పోవువారికి ఏర్పరచబడును
మూఢులైనను దానిలో నడచుచు త్రోవను తప్పక
యుందురు
9అక్కడ సింహముండదు క్రూరజంతువులు దాని
ఎక్కవు, అవి అక్కడ కనబడవు
విమోచింపబడినవారే అక్కడ నడచుదురు
10యెహోవా విమోచించినవారు పాటలుపాడుచు తిరిగి
సీయోనునకు వచ్చెదరు
వారి తలలమీద నిత్యానందముండునువారు ఆనందసంతోషములుగలవారై వచ్చెదరు.
దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును.
Currently Selected:
యెషయా 35: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.