YouVersion Logo
Search Icon

యెషయా 34

34
1రాష్టములారా, నాయొద్దకు వచ్చి వినుడి
జనములారా, చెవి యొగ్గి ఆలకించుడి
భూమియు దాని సంపూర్ణతయు లోకమును దానిలో
పుట్టినదంతయు వినును గాక.
2యెహోవా కోపము సమస్త జనములమీదికి వచ్చుచున్నది
వారి సర్వ సైన్యములమీద ఆయన క్రోధము వచ్చుచున్నది
ఆయన వారిని శపించి వధకు అప్పగించెను.
3వారిలో చంపబడినవారు బయట వేయబడెదరువారి శవములు కంపుకొట్టును
వారి రక్తమువలన కొండలు కరగిపోవును.
4ఆకాశసైన్యమంతయు క్షీణించును
కాగితపు చుట్టవలె ఆకాశవైశాల్యములు చుట్టబడును.
ద్రాక్షావల్లినుండి ఆకు వాడి రాలునట్లు
అంజూరపుచెట్టునుండి వాడినది రాలునట్లు వాటి
సైన్యమంతయు రాలిపోవును.
5నిజముగా ఆకాశమందు నా ఖడ్గము మత్తిల్లును
ఎదోముమీద తీర్పుతీర్చుటకు
నేను శపించిన జనముమీద తీర్పుతీర్చుటకు అది దిగును
6యెహోవా ఖడ్గము రక్తమయమగును
అది క్రొవ్వుచేత కప్పబడును
గొఱ్ఱెపిల్లలయొక్కయు మేకలయొక్కయు రక్తము
చేతను
పొట్టేళ్ల మూత్రగ్రంథులమీది క్రొవ్వుచేతను కప్ప
బడును
ఏలయనగా బొస్రాలో యెహోవా బలి జరిగించును
ఎదోము దేశములో ఆయన మహా సంహారము చేయును.
7వాటితోకూడ గురుపోతులును వృషభములును కోడె
లును దిగిపోవుచున్నవి
ఎదోమీయుల భూమి రక్తముతో నానుచున్నదివారి మన్ను క్రొవ్వుతో బలిసియున్నది.
8అది యెహోవా ప్రతిదండనచేయు దినము
సీయోను వ్యాజ్యెమునుగూర్చిన ప్రతికార సంవత్సరము.
9ఎదోము కాలువలు కీలగును
దాని మన్ను గంధకముగా మార్చబడును
దాని భూమి దహించు గంధకముగా ఉండును.
10అది రేయింబగళ్లు ఆరక యుండును
దాని పొగ నిత్యము లేచును
అది తరతరములు పాడుగానుండును
ఎన్నడును ఎవడును దానిలో బడి దాటడు
11గూడబాతులును ముళ్ళ పందులును దాని ఆక్రమించు
కొనును
గుడ్లగూబయు కాకియు దానిలో నివసించును
ఆయన తారుమారు అను కొలనూలును చాచును
శూన్యమను గుండును పట్టును.
12రాజ్యము ప్రకటించుటకు వారి ప్రధానులు అక్కడ
లేకపోవుదురు
దాని అధిపతులందరు గతమైపోయిరి.
13ఎదోము నగరులలో ముళ్లచెట్లు పెరుగును
దాని దుర్గములలో దురదగొండ్లును గచ్చలును పుట్టును
అది అడవికుక్కలకు నివాసస్థలముగాను నిప్పుకోళ్లకు
సాలగాను ఉండును
14అడవిపిల్లులును నక్కలును అచ్చట కలిసికొనును
అచ్చట అడవిమేక తనతోటి జంతువును కనుగొనును
అచ్చట చువ్వపిట్ట దిగి విశ్రమస్థలము చూచుకొనును
15చిత్తగూబ గూడు కట్టుకొనును
అచ్చట గుడ్లుపెట్టి పొదిగి నీడలో వాటిని కూర్చును
అచ్చటనే తెల్లగద్దలు తమ జాతిపక్షులతోకూడు
కొనును.
16యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి
ఆ జంతువులలో ఏదియు లేక యుండదు
దేని జతపక్షి దానియొద్ద ఉండక మానదు
నా నోటనుండి వచ్చిన ఆజ్ఞ యిదే
ఆయన నోటి ఊపిరి వాటిని పోగుచేయును.
17అవి రావలెనని ఆయన చీట్లువేసెను
ఆయన కొలనూలు చేతపట్టుకొని వాటికి ఆ దేశమును
పంచిపెట్టును.
అవి నిత్యము దాని ఆక్రమించుకొనును
యుగయుగములు దానిలో నివసించును.

Currently Selected:

యెషయా 34: TELUBSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in